twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ishq Movie Review : సస్పెన్స్ రేపి, ఉస్సూరుమనిపించారే?

    |

    Rating:
    2.0/5

    కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు సుమారు నాలుగు నెలల తర్వాత మళ్ళీ తెరుచుకున్నాయి. తెలంగాణలో 100% ఆక్యుపెన్సీతో, ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈరోజు దాదాపు ఐదు సినిమాలు రిలీజ్ కాగా అందులో ఎక్కువగా ఇష్క్ సినిమా పేరు బాగా వినిపించింది. మిగతా సినిమాలతో పోటీపడుతూ కుర్ర హీరో తేజ సజ్జ నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది ? ప్రేక్షకులని సినిమా థ్రిల్ కు గురి చేసిందా లేదా అనేది కథా కథనాల్లో తెలుసుకుందాం

    ఇష్క్ కథ

    ఇష్క్ కథ

    సిద్ధార్థ్ (తేజ సజ్జా) అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనసూయ (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఒక స్టూడెంట్ ప్రేమలో ఉంటారు. అనసూయ పుట్టినరోజు సందర్భంగా నైట్ అవుట్ చేయాలని భావించి దానిని ఒక మెమొరబుల్ నైట్ గా మార్చాలి అనుకున్న ఈ జంటకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. మాధవ్(రవీంద్ర విజయ్)ఎంట్రీతో వీరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. సిద్ధార్థ్, అనసూయ, మాధవ్ మధ్య ఏం జరిగింది అనేది సినిమా కథ.

    ఇష్క్ కథలో ట్విస్టులు

    ఇష్క్ కథలో ట్విస్టులు

    మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఇష్క్ సినిమాను అదే పేరుతో అధికారికంగా తెలుగులో రీమేక్ చేశారు. అయితే సినిమా మొత్తం సస్పెన్స్ తో నింపే ప్రయత్నం చేశారు. నిజానికి ఒరిజినల్ సినిమా కాస్త లాగ్ అనిపిస్తుంది కానీ ఈ సినిమాని దానికంటే ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని ట్రై చేశారు. మెమరబుల్ నైట్ ని హారిబుల్ నైట్ గా మార్చిన మాధవ్ కి సిద్ధార్థ్ ఎలా గుణపాఠం నేర్పాడు ? అలాగే సిద్ధార్థ - అనసూయ మధ్య క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు దాదాపు సినిమా అంతా ట్విస్టుల మయంగా మారింది. అయితే సస్పెన్స్ క్యారీ చేయడంలో పూర్తి సఫలమయ్యారని చెప్పలేం.

    సినిమా కథా కథనాలు ఎలా ఉన్నాయంటే

    సినిమా కథా కథనాలు ఎలా ఉన్నాయంటే

    సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే అసలు విషయంలోకి తీసుకువెళ్ళాడు దర్శకుడు. సాధారణ లవర్స్ ఎలా ఉంటారో చూపిస్తూ వారిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, అలకలు, కోపాలు ఇలా దాదాపుగా అన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథలోకి తీసుకు వెళ్లిన దర్శకుడు సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మలిచడానికి తన వంతు ప్రయత్నం చేశాడు కానీ పూర్తిగా మలయాళ సినిమాను మక్కీకి మక్కి దించినట్లుగానే అనిపించింది.

    ఎక్కడా పెద్దగా మార్పులు చేర్పులు కూడా చేయలేదు. కానీ తెలుగులో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ తో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని మాత్రం చెప్పక తప్పదు. కథనాన్ని ఆసక్తికర్మగా నడిపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు కానీ చాలా వరకు సీన్లు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.

    దర్శకుడు ఎస్ ఎస్ రాజు గురించి

    దర్శకుడు ఎస్ ఎస్ రాజు గురించి

    దర్శకుడికి మొదటి సినిమానే అయినా పూర్తిగా మలయాళ సినిమాని ఫాలో అయిపోవడంతో దర్శకుడి ప్రతిభ గురించి పెద్దగా మాట్లాడాల్సింది అయితే ఏమీ లేదు. అయితే సినిమాని అనేక సస్పెన్స్ ఎలిమెంట్స్ తో నింపాలని భావించి మొదటికే మోసం తెచ్చాడు. మలయాళంలో లేని డైలాగులను, బూతు అర్ధం వచ్చే డైలాగులను పలికించి ఎబ్బెట్టుగా ఫీలయ్యేట్టు చేశాడు అని చెప్పక తప్పదు. అయితే ప్రేక్షకులను సీట్లకే పరిమితం అయ్యేలా చేశారని మాత్రం చెప్పక తప్పదు.

    తేజ సజ్జ పర్ఫామెన్స్

    తేజ సజ్జ పర్ఫామెన్స్

    ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత జాంబి రెడ్డి సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారిన తేజ సజ్జ ఈ సినిమాతో తన నట విశ్వరూపం చూపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కాస్త సైకో లక్షణాలు చూపించాల్సిన పాత్ర కావడంతో ఆ సమయంలోనే తేజ నటనలో తడబాటు కనిపించింది. తెరమీద కనిపించినంత సేపు తేజ సజ్జ కాకుండా సిద్ధార్థ అనే వ్యక్తి అక్కడ కనిపిస్తున్నట్టు తేజ మాయ చేయడానికి ప్లాన్ చేసినా క్లైమాక్స్ లో కొన్ని సీన్లలో తేజ సజ్జ యాక్టింగ్ లో తడబాటు కనిపించింది. ఓవరాల్ గా చూస్తే పర్వాలేదు అనే చెప్పాలి.

    ప్రియా ప్రకాష్ వారియర్, రాహుల్ విజయ్ పాత్రల గురించి

    ప్రియా ప్రకాష్ వారియర్, రాహుల్ విజయ్ పాత్రల గురించి

    ఒకే ఒక కన్ను గీటి తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో అనసూయ పాత్ర ద్వారా మరింత చేరువ అయింది అని చెప్పక తప్పదు. మన పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో నటించిన ప్రియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా సినిమా మొత్తం ఆమె ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

    ఉమామహేశ్వర ఉగ్రరూపం సినిమాలో విలన్ పాత్రధారిగా కనిపించిన రాహుల్ విజయ్ ఈ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించాడు. నకిలీ పోలీస్ అధికారిగా అంబులెన్స్ డ్రైవర్ గా భార్య ముందు చేతకాని భర్తగా ఇలా పలు భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ప్రియాతో సీన్స్ ఉన్నప్పుడే కొన్ని సీన్స్ లో పలికిన డైలాగులు ఎబ్బెట్టుగా అనిపించాయి.

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే

    ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ లో దాదాపుగా అందరూ తమదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. మ్యూజిక్ అందించిన మహతి స్వర సాగర్ సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా అందించాడు. సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక కారణం అవుతుంది అని చెప్పక తప్పదు. ఇక శ్యామ్ కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమా రిచ్నెస్ పెంచేసింది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో తీసిన సీన్స్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. వరప్రసాద్ కూడా సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద బాగానే కష్టపడ్డారని చెప్పాలి.

    ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే

    ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే

    ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సినిమాను సమర్పించింది. ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు అనే చెప్పాలి. మెగా సూపర్ ఫుల్ ఫిలిమ్స్ బ్యానర్ కి తగ్గట్టుగానే సినిమా నిర్మాణం కూడా ఉంది. అలాగే ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న తేజ సినిమాని ధైర్యంగా థియేటర్లలో రిలీజ్ చేయడం కూడా కత్తి మీద సాములాంటిదే. అయితే వారి సాహసం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.

    Recommended Video

    Actor Gopichand Inspiring Life Story | Filmibeat Telugu
    ఫైనల్ గా

    ఫైనల్ గా

    ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇష్క సినిమా సస్పెన్స్ త్రిల్లర్, చివరి అరగంట ఒక రకంగా సినిమాకి ఆయువు పట్టు లాంటిది. పూర్తిస్థాయిలో చివరి అరగంటలో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ లు పెట్టారు. అప్పటిదాకా సినిమా ఏంటి ఇలా ఉంది అనుకున్న వారు కూడా చివరి అరగంటలో ఈలలు వేసే పరిస్థితి. మోరల్ పోలీసింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చక పోవచ్చు. కానీ సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టం ఉన్నవారు ఒకసారి సినిమాని చూడచ్చు.

    English summary
    Ishq is a 2021 Indian Telugu-language romantic thriller film directed by S. S. Raju. Produced by Mega Super Good Films production studio, the film stars Sajja Teja and Priya Prakash Varrier in lead roles. It is the remake of 2019 Malayalam film of the same name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X