twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్
    Director: జీ. నాగేశ్వర్ రెడ్డి

    టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఒకప్పుడు హిట్లు కొట్టిన యంగ్ హీరోలు ప్రస్తుతం వెనకబడుతున్నారు. వారి జాబితాలో సందీప్ కిషన్ ముందుటాడు. ప్రస్థానం సినిమాతో నటుడిగా నిరూపించుకున్న ఈ హీరో.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు చాలానే కష్టపడుతున్నాడు. చివరగా రూటు మార్చి హారర్ జానర్‌లో చేసిన నిను వీడని నీడను నేను అనే చిత్రం బాగానే వర్కౌట్ అయింది. మళ్లీ తాజాగా తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చాడు. మరి ఈసారి కూడా ఈ యంగ్ హీరో విజయాన్ని అందుకున్నాడా? లేదా అన్నది చూద్దాం.

     కథ

    కథ

    కర్నూలు సిటీలో వరలక్ష్మీ దేవీ (వరలక్ష్మీ శరత్ కుమార్), సింహాద్రి నాయుడు (అయ్యప్ప పీ శర్మ) మధ్య ఆదిపత్య పోరు జరుగుతుంది. వరలక్ష్మీ దగ్గర పని చేసే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ కేసులో వరలక్ష్మీని ఇరికించాలని సింహాద్రి నాయుడు ప్రయత్నిస్తాడు. వరలక్ష్మీ తరుపున వాదించే క్రిమినల్ లాయర్ మురళీ శర్మ.. ఆమెను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఆ కేసును టేకప్ చేస్తాడు. మరి చివరకు ఆ కేసు ఏమైంది? అన్నదే కథ.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఆ హత్యకు వరలక్ష్మీకి సంబంధం ఏంటి? అసలు ఆ హత్యను చేసింది ఎవరు? ప్రజల్లో మంచి పేరున్న వరలక్ష్మీ నిజస్వరూపం ఏంటి? ఆమెను కేసులో ఇరికించాలనుకున్న సింహాద్రి నాయుడుతోనే మళ్లీ ఎందుకు చేతులు కలిపింది? అబద్దాన్ని నిజమని నమ్మిన తెనాలి.. నిజాన్ని నిజం అని నిరూపించడానికి వేసిన ప్లాన్ ఏంటి? అనేవి సినిమాలో ఆసక్తికరమైన అంశాలు.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    కేసులు లేక చెట్టు కింద ప్లీడర్‌లా కాలం గడుపుతూ ఉంటాడు తెనాలి రామకృష్ణ. ప్రభాస్ శీనుతో అక్కడక్కడా కామెడీని పండించడం, కోర్టులో పెండింగ్ కేసుల మధ్య కాంప్రమైజ్‌ చేస్తూ డబ్బులు సంపాదించడం, రుక్మిణి (హన్సిక)తో పరిచయం..ప్రేమ ఇలా కాస్త ఎంటర్టైన్‌మెంట్‌గా ఫస్టాఫ్‌ను రాసుకున్నాడు. అయితే అసలు కథ మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. వరలక్ష్మీని లాయర్ మోసం చేస్తున్నాడని తెలుసుకోవడం, ఆమెను ప్రమాదంలోంచి తప్పించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. మొత్తానికి ప్రథమార్థంలో మూడు పాటలు, ఆరు జోకులు అన్నట్లు మధ్యలో రెండు యాక్షన్ సీన్స్ పెట్టి ఫర్వాలేదనిపించాడు.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    అయితే వరలక్ష్మీని ఆ కేసు నుంచి కాపాడం, ఆమెపై హత్యాప్రయత్నం జరగడం, మళ్లీ కేసును రీ ఓపెన్ చేయించడం, లేని సాక్ష్యాలను పుట్టించడం, వారితో కామెడీ ట్రాక్ నడిపించడం కాస్త బూస్టప్ ఇచ్చినట్టైంది. సెకండాఫ్‌లో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు ఎక్కువయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. చివరకు అసలు నేరస్థుల ఆట కట్టించడం, దానికి తెనాలి రామకృష్ణ వేసిన ఎత్తులతో ద్వితీయార్థం ఆకట్టుకుంటుంది.

    దర్శకుడి పనితీరు

    దర్శకుడి పనితీరు

    తెనాలి రామకృష్ణ మూవీ కథ పాతదే అన్న ఫీలింగ్ అక్కడక్కడా అనిపించినా.. రచయిత తన రైటింగ్‌ ప్రతిభతో నెట్టుకొచ్చాడు. పలు చోట్ల పంచులతో ప్రతీ సన్నివేశాన్ని చక్కగా మలిచేలా జాగ్రత్తలు తీసుకొన్నాడనిపిస్తుంది. అయితే ఆ డైలాగ్స్‌లో కొత్తదనం కొరవడినట్టు కనిపించినా.. మొత్తానికి బాగానే లాగించేశాడే అని భావన కలుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ చేయకుండా కథనాన్ని రాయడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడని చెప్పవచ్చు.

    సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ..

    సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ..

    కేసులు లేకుండా ఖాళీగా ఉండే తెనాలి రామకృష్ణ పాత్రలో సందీప్ కిషన్ చక్కగా నటించాడు. కామెడీ సీన్స్‌లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఈ క్యారెక్టర్‌కు చక్కగా కుదిరింది. ఇక రుక్మిణీ పాత్రలో హన్సిక కామెడీని పండించే ప్రయత్నం చేసింది. లుక్స్ పరంగానూ మెప్పించింది. అయితే పాటల కోసమే ఆ పాత్ర అన్నట్లు ఉంటుంది. తమిళ నాట తన నటనతో అందర్నీ కట్టిపడేసే వరలక్ష్మీ.. ఈ సినిమాలోనూ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. అయితే ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో నెట్టుకొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రభాస్ శ్రీను, రఘు బాబు, సప్తగిరి, పోసాని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు.

     సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    తెనాలి రామకృష్ణ సినిమాకు సంగీతం అందించిన సాయి కార్తీక్.. రొటీన్ ట్యూన్స్ అందించినట్టు అనిపిస్తుంది. సౌండ్ పొల్యూషన్‌కు తప్పా మిగతా ఏ రకంగానూ సినిమాకు ఉపయోగ పడలేదు. దీనికి తోడు నేపథ్య సంగీతం కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సాయి శ్రీరామ్ అందించిన ఫోటోగ్రఫీ మాత్రం చక్కగా ఉంది. ప్రతీ ఒక్కర్నీ అందంగానే చూపించాడు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా సరిపోయింది. ఎక్కడా కూడా సాగదీసినట్టు అనిపించదు. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు ఇలా ప్రతీ ఒక్కటి సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    కొత్తదనాన్ని ఆశించి వెళ్లే ప్రేక్షకులు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేద్దామనే ప్రేక్షకుడిని మాత్రం తెనాలి రామకృష్ణ కచ్చితంగా ఆకట్టుకుంటాడు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    సందీప్ కిషన్
    ఎంటర్‌టైన్‌మెంట్
    డైలాగ్స్

    మైనస్ పాయింట్స్
    కథ
    ఊహకందేట్టు సాగే కథనం
    రొటీన్ సన్నివేశాలు

    Recommended Video

    #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు
    దర్శకత్వం: జీ. నాగేశ్వర్ రెడ్డి
    నిర్మాత: అగ్రహారం నాగిరెడ్డి
    మ్యూజిక్: సాయి కార్తీక్
    సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్
    ఎడిటింగ్: చోటా కె ప్రసాద్

    English summary
    Tenali RamaKrishna BA BL movie is an Telugu language Entertainment Drama written and directed by Nageswara Reddy. The film stars Sundeep Kishan, Hansika, Varalakshmi. This movie released on November 15, 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X