Tere Ishk Mein Hindi Movie Review: తేరే ఇష్క్ మే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

మూవీ: తేరే ఇష్క్ మే
నటీనటులు: ధనుష్, కృతిసనన్, ప్రకాశ్ రాజ్, ప్రియాంశు పైనీల్, తోతారాయ్ చౌదరీ, వినీత్ కుమార్ తదితరులు
దర్శకత్వం: ఆనంద్ ఎల్ రాయ్
రచన: హిమాంశు శర్మ, నీరజ్ యాదవ్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, హిమంన్షు శర్మ, ఆనంద్ ఎల్ రాయ్
సినిమాటోగ్రఫి: తుషార్ కాంతి రే
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
ఎడిటింగ్: హేమల్ కొఠారీ
బ్యానర్: టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-11-28

శంకర్ గురక్కల్ (ధనుష్) ఆగ్రహావేశాలున్న యువ స్టూడెంట్. తండ్రి (ప్రకాశ్ రాజ్) అంటే ప్రాణం. కానీ తన అగ్రెసివ్ బిహేవియర్ విషయంలో బేధాభిప్రాయాలు ఉంటాయి. ముఖ్తి బెహ్నినివాల్ (కృతిసనన్) పీహెచ్‌డీ థీసిస్ సబ్మిట్ చేసేందుకు కాలేజీలోకి అడుగుపెట్టిన సమయంలో ఓ స్టూడెంట్‌ను వెంటాడుతూ వచ్చి ఆమెను శంకర్ గుద్దేసుకొంటాడు. ముఖ్తి తన థీసిస్‌లో చెప్పిన ప్రకారం.. మనిషిలోని హింసాత్మక ధోరణిని కంట్రోల్ చేయవచ్చు అనేది ఆమె బలమైన నమ్మకం. తన థీసీస్ కరెక్ట్ అనిపించడానికి అత్యంత దూకుడు, అలజడి తత్వం, ఆవేశం ఉన్న శంకర్‌ను తన కేస్ స్టడీగా తీసుకొంటుంది. ముఖ్తి ఫస్ట్ టచ్‌తోనే ప్రేమలో పడిపోతాడు.

శంకర్ ఆవేశానికి, ఆగ్రహ ప్రవర్తనకు కారణం ఏమిటి? తండ్రితో శంకర్ రిలేషన్ ఎలా ఉండేది? తల్లి మరణం శంకర్‌లో ఎలాంటి విషాదాన్ని నింపింది? తల్లి మరణ దుర్ఘటనకు కారణం ఏమిటి? థీసిస్‌లో తాను నమ్మిన పాయింట్‌ను నిరూపించుకోవడానికి శంకర్‌ను ముఖ్తి కేస్ స్టడీగా తీసుకొన్న తర్వాత చోటు చేసుకొన్న పరిస్థితులేమిటి? శంకర్ ప్రేమను ముఖ్తి ఎలా తీసుకొన్నది? అసలు శంకర్ గతం ఏమిటి? ముఖ్తి, శంకర్ మధ్య రిలేషన్‌కు ముగింపు ఏమిటి? శంకర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎందుకు చేరాడు? అలా చేరడానికి కారణం ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే తేరే ఇష్క్ మే సినిమా కథ.

Tere Ishk Mein Hindi Movie Review

ఈ మూవీ ప్రారంభంలో ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ సన్నివేశాలతో కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంటుంది. లడఖ్‌లో శంకర్‌కు మెంటల్ సర్టిఫికెట్ ఇవ్వాలని ముఖ్తిని పిలువడం లాంటి ట్విస్టుతో మూవీలో ఆడియెన్ పూర్తిగా కనెక్ట్ అయ్యేలే చేసిన తీరు దర్వకుడు ఆనంద్ అనసరించిన స్క్రీన్ ప్లే సినిమాకు మంచి ఫౌండేషన్ ఇచ్చాయి. ఆ తర్వాత ధనుష్, కృతిసనన్ సినిమాను ఆద్యంతం తమ పెర్ఫార్మెన్స్‌తో పరుగులు పెట్టించారు. చాలా చోట్ల సినిమాటిక్ నరేషన్ ఉన్నప్పటికి.. ఎమోషన్స్ వల్ల అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సీట్లలో హత్తుకొని చూసేలా చేస్తాయి. దర్శకుడు ఆనంద్ కమ్ బ్యాక్ గ్రేట్ బ్యాంగ్‌తో ఇచ్చాడని సినిమా స్పష్టం చేసింది.

యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్‌లో తనకంటూ గొప్ప నటుడు లేరనేంతగా ధనుష్ నటించాడు. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టాడు. పలు సన్నివేశాల్లతో నటించిన తీరు.. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ రెచ్చిపోయిన విధానం ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. కృతిసనన్ గ్లామర్‌తో కూడిన పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న మెచ్యుర్డ్ క్యారెక్టర్‌లో నటించింది. ధనుష్‌తో పోటీపడేలా పెర్ఫార్మెన్స్ చూపించింది. శంకర్ తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, కృతి ఫాదర్‌గా తోతా రాయ్, మురారీగా మహ్మద్ జీషన్ అయ్యుబ్ తదితరులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. టైటిల్ సాంగ్ తేరే ఇష్క్ మే, చిన్నావారే, ఆవారా అంగారా లాంటి పాటలు బాగున్నాయి. అంతకంటే ఆయన సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాల్లో కేక పెట్టించింది. తుషార్ క్రాంతి రే సినిమాటోగ్రఫి, హేమల్ కొఠారీ ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్‌లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X