Tere Ishk Mein Twitter Review: తేరే ఇష్క్ మే ట్విట్టర్ రివ్యూ
తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధనుష్. ప్రేమకథలు, రొమాన్స్, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో అభిమానుల ఆదరణను దక్కించుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. తాజాగా ఆయన హిందీలో నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరిస్ ఫిలింస్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషాన్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించగా.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించారు. సుశీల్ దాహియా, మాహిర్ మొహిద్దున్ తదితరులు నటించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించగా... తుషార్ కాంతి రే, విశాల్ సిన్హాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. హేమాల్ కొఠారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
తెలుగు, తమిళ భాషల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ధనుష్. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోనూ తన హవా చూపించాలని ఆయన నిర్ణయించుకున్నారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమలతో తేరే ఇష్క్ మే సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. నవంబర్ 28న తేరే ఇష్క్ మే సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు నవంబర్ 27వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

ఆనంద్ ఎల్ రాయ్ భావోద్వేగాలు, అద్భుతమైన కథ, స్టార్ కాస్టింగ్ పర్ఫార్మెన్స్‌తో తేరీ ఇస్క్ మై బ్లాక్‌బస్టర్. మొదటి అర్ధభాగం బిగుతుగా సాగుతుంది. కథను అద్భుతమైన వాయిస్‌తో సెట్ చేస్తుంది. తొలి 20 నిమిషాలు టాప్ టైర్‌గా ఉంటూ, సినిమాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. క్యారెక్టరైజేషన్, సెటప్ పర్ఫెక్ట్‌గా పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా కథ సజావుగా సాగి ఇంటర్వెల్ వద్ద అది పతాక స్థాయికి చేరుకుంది. రెండవ అర్ధభాగంలో ఎక్కువ భాగం డ్రామా సాగుతుంది. పాత్రల షేడ్స్, బలమైన భావోద్వేగాలు, ఊహకందని పర్ఫార్మెన్స్, అదిరిపోయే క్లైమాక్స్‌తో ఎండ్ కార్డ్ బాగుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ధనుష్ అదరగొట్టేశాడు. అతని కళ్లే మాట్లాడతాయి, మిగతావన్నీ బోనస్. కృతిసనన్ ఫిమేల్ కబీర్ సింగ్. భావోద్వేగాలను, నెగిటివ్ షేడ్‌ని, సిగరెట్ కాల్చే శైలిని అద్భుతంగా చిత్రీకరించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధికి తగట్టుగా రాణించి సినిమాకు మద్ధతుగా నిలిచారు. ఆనంద్ ఎల్ రాయ్ డైలాగులు, ఎమోషన్స్, స్క్రీన్ ప్లేను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చిత్రీకరించాడు.
ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ఆత్మవంటిది. హమ్ అంటూ సాగే బీజీఎం.. మాస్‌ను ఖచ్చితంగా ఊపేస్తుంది. టీ సిరీస్ నిర్మాణ విలువలకు అదనపు మార్కులు వేయాల్సిందే. మొత్తం మీద తేరే ఇష్క్ మే కేవలం 3 రోజుల్లోనే సూపర్ హిట్ కానుంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు రేసులో దుమ్మురేపుతాయి. ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హై!! దేఖో దేఖ్ అని ఓ యూజర్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.
తేరే ఇష్క్ మైను టీ సిరీస్, కలర్ యెల్లో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ద్రోహం, విడిపోవడం, బాధపెట్టడం, చికిత్స, మనసును హత్తుకునే పాటలతో ఇంటెన్స్ మూవీ ఇది. అన్ని రకాల భావోద్వేగాలతో మజా ప్యాక్. శంకర్ పాత్రలో ధనుష్ ఒక మాస్ హీరోయిక్ ఆరాను కలిగి ఉన్నాడు. అతని నటన పూర్తిగా బీస్ట్ మోడ్‌లో ఉంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ మావెరిగా మాదిరిగా అలరిస్తుంది. ముక్తి పాత్రలో కృతి సనన్ ఫైర్ ఆఫ్ ఫారెస్ట్ మాదిరిగా ఉంది. సగం సినిమా వరకు ఆమె పాత్రను ఇష్టపడుతూ, ద్వేషిస్తారు. కృతి అసలు సిసలు ఊసరవెల్లిలా స్క్రీన్ ప్రెజెన్స్‌ను దాచుకుంది.
ఈ సినిమా రెండు ప్రధాన బలాలపై ఆధారపడి ఉంది. ఆకర్షణీయమైన క్షణాలు, అద్భుతమైన ప్రదర్శనలు. ధనుష్ అత్యుత్తమం.. కృతిసనన్ అద్భుతం. సంక్లిష్టమైన మానవ సంబంధాలను అన్వేషించడంలో పేరుగాంచిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్.. తనకు ఇష్టమైన ప్రేమ, కోరిక అది సృష్టించే గందరగోళానికి ఈసారి మరింత తీవ్రతతో తిరిగొచ్చాడు. రాయ్ బిగ్గరగా మాట్లాడటానికి దూరం.. ఇది పరిణితి చెందిన కథకుడి లక్షణం. ఉద్రిక్తమైన, సంఘర్షణతో కూడిన సన్నివేశాలోనూ ఆయన సంయమనంతో ఉంటాడు. ఎప్పుడూ గీత దాటడు.
కఠినమైన కథనం సినిమా ప్రభావాన్ని పెంచుతుంది. అయితే అది ఆఖరిలో సంక్షిప్తంగా ఉండాలి.. దీని వల్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. మరింత ప్రభావంతమైన ముగింపు ఇచ్చుంటే బాగుండేది. ధనుష్ ఒక అసాధారణ నటుడు.. పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో పాటు బాధ, కోపం, ప్రేమను చూపించగలడు. భావోద్వేగాలతో నిండిపోయిన అసాధారణ యువకుడిగా అతని పరివర్తన ఈ సినిమా బలాల్లో ఒకటి. కృతి సనన్ తన కెరీర్‌లో అత్యుత్తమ నటనను ప్రదర్శించింది. ధనుష్‌తో ఆమె కెమెస్ట్రీ .. డ్రామాను మరింత పెంచింది.
ప్రకాష్ రాజ్, తోటరాయ్ చౌదరి, ప్రియాన్షు పైన్యులి, వినీత్ సింగ్, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్‌లు వారి పాత్రలలో ప్రభావంతంగా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని పాటలు గుండెల్లో నిలిచిపోతే, కొన్ని అంతగా వర్కవుట్ కాలేదు. అసాధారణమైన పర్ఫార్మెన్స్‌లు, తీవ్రమైన క్షణాల కోసం ఈ ప్రేమకథను చూడాలని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











