Tere Ishq Mein First Review: తేరే ఇష్క్ మే మూవీ ఫస్ట్ రివ్యూ

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రతిభావంతుడైన నటుడు, స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం తేరే ఇష్క్ మే. ప్రముఖ దర్శకుడు ఆనంద్ లాయ్ రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మించారు.

మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ అందించారు. ఈ సినిమాకు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 28వ తేదీన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించి రివ్యూ చేశారు. వారు ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ఎంత? ఈ మూవీపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా రన్ టైమ్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

Tere Ishq Mein Review by Censor Board

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌‌లో రాంజ్నా అనే సినిమా 2013 సంవత్సరంలో వచ్చి భారీ విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టు కట్టారు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా ధనుష్ పెర్ఫార్మెన్స్‌కు మైలురాయిగా నిలిచే విధంగా ఈ సినిమాను రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఇక తేరే ఇష్క్ మే సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాను వీక్షించిన ప్రతినిధులు, అధికారులు స్వల్ప మార్పులు, సూచనలతో క్లీన్ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో ధనుష్ నటన హైలెట్‌గా నిలిచి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది. కృతిసనన్ జోడి, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వ ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకొంటారు అనే విధంగా ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్టు తెలిసింది.

ధనుష్, కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రంలోని కంటెంట్‌పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు అధికారులు క్లీన్ సర్టిఫికెట్ అందించారు. ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్ అందించారు. ఈ సినిమాను 16 ఏళ్లకుపై బడిన వారంతా ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. 16 ఏళ్లకు లోబడి ఉన్న వారంతా తల్లిదండ్రుల సూచనలు, సలహాలతో చూడొచ్చని సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలోని ప్రేమ కథ, హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు హృదయానికి టచ్ అయ్యేలా ఉంటాయి. ఈ సినిమాను పక్కాగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలు అంటే సుమారుగా 169 నిమిషాలు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర ప్రత్యేక కథనాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: dhanush kriti sanon bollywwood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X