Thaai Kizhavi First Review: తాయ్ కెలవి మూవీ ఫస్ట్ రివ్యూ.. రాధిక నట విశ్వరూపం

తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, సుధన్ సుందరం నిర్మాతలుగా మారి ప్యాషన్ స్టూడియోస్, శివ కార్తీకేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం తాయి కలైవి. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కామెడీ, ఎమోషనల్ డ్రామాగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో సింగం పులి, రైచల్ రెబాకా, అరుళ్ దాస్, బాలా శరవణన్, ముణిశ్ కాంత్, ఇలవరసు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: వివేక్ విజయ్ కుమార్, ఎడిటర్: సాన్ లోకేష్, మ్యూజిక్: నివాస్ ప్రసన్న, ప్రొడక్షన్ డిజైనర్: రాము తంగరాజ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. సెన్సార్ రివ్యూ ఏమిటి? ఈ సినిమాపై వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఈ సినిమా రన్‌టైమ్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Thaai Kizhavi Review By Censor Board

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి (రాధిక శరత్ కుమార్) మరణిస్తే ఆస్తిని పంచుకోవాలనే దురాశతో కొడుకులు ఉంటారు. అయితే ఆమె దగ్గర విలువైన నిధి ఉందనే విషయం వారికి తెలుస్తుంది. తల్లి నిధిని ఎక్కడ దాచిందని వెతుకుతూ.. ఆ రహస్యాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. దాంతో తల్లిని చనిపోకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ తల్లి వద్ద నిధి రహస్యాన్ని తెలుసుకొన్నారా? తల్లి ఆ నిధులను ఎక్కడ దాచిపెట్టింది? ఆ తల్లి చివరి క్షణాలు ఎలా గడిచాయనే ఎమోషనల్ కథనే తాయి కలైవి సినిమా.

ఇలాంటి ఎమోషనల్ స్క్రీన్ జర్నీతో కూడిన ఈ చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత రాధిక శరత్ కుమార్ నటన, పెర్ఫార్మెన్స్‌ను, పాత్రలో జీవించిన విధానంపై ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా అని సెన్సార్ ప్రతినిధులు అభిప్రాయాన్ని పంచుకొన్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

తాయి కెలవి సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరును అభినందిస్తూ ఈ మూవీకి క్లీన్ సర్టిఫికెట్ అందించారు. ఈ చిత్రానికి ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయకుండానే యూ(U) సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం ఈ మూవీని వయసుతో సంబంధం లేకుండా అందరూ చూడొచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను వీక్షించవచ్చు అని సెన్సార్ తాము జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

ఇక ఈ సినిమాను ఎమోషనల్‌గా తీర్చి దిద్దిన శివకుమార్ మురుగేశన్ కాస్త నిడివిని ఎక్కువగానే చూపించారు. భావోద్వేగాలతోపాటు కామెడీ దట్టించిన ఈ చిత్రం నిడివి 2 గంటల 24 నిమిషాలు. అంటే ఈ సినిమా 144 నిమిషాల రన్‌టైమ్‌తో సాగుతుందని సెన్సార్ సర్టిఫికెట్ తెలియజేసింది. ఈ సినిమా ఆద్యంత హృదయాన్ని టచ్ చేస్తూ ఆడియెన్స్‌కు చక్కటి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను చెన్నైలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని శివ కార్తీకేయన్, సూర్య, జ్యోతిక, ఇతర సినీ ప్రముఖులు, క్రిటిక్స్ చూశారు. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్ నటనా విశ్వరూపం ప్రదర్శించిందనే టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాను సాధారణ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే విషయాన్ని వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X