Thaai Kizhavi Twitter Review: తాయి కెలవి మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, సుధన్ సుందరం నిర్మాతలుగా మారి ప్యాషన్ స్టూడియోస్, శివ కార్తీకేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం తాయి కెలవి. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కామెడీ, ఎమోషనల్ డ్రామాగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో సింగం పులి, రైచల్ రెబాకా, అరుళ్ దాస్, బాలా శరవణన్, ముణిశ్ కాంత్, ఇలవరసు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: వివేక్ విజయ్ కుమార్, ఎడిటర్: సాన్ లోకేష్, మ్యూజిక్: నివాస్ ప్రసన్న, ప్రొడక్షన్ డిజైనర్: రాము తంగరాజ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్లు ఇటీవల ప్రదర్శించారు. ఈ సినిమా గురించి నెటిజన్లు క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

Thaai Kizhavi Twitter Review

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి (రాధిక శరత్ కుమార్) మరణిస్తే ఆస్తిని పంచుకోవాలనే దురాశతో కొడుకులు ఉంటారు. అయితే ఆమె దగ్గర విలువైన నిధి ఉందనే విషయం వారికి తెలుస్తుంది. తల్లి నిధిని ఎక్కడ దాచిందని వెతుకుతూ.. ఆ రహస్యాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. దాంతో తల్లిని చనిపోకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ తల్లి వద్ద నిధి రహస్యాన్ని తెలుసుకొన్నారా? తల్లి ఆ నిధులను ఎక్కడ దాచిపెట్టింది? ఆ తల్లి చివరి క్షణాలు ఎలా గడిచాయనే ఎమోషనల్ కథనే తాయి కలైవి సినిమా.

తాయ్ కెలవి చిత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఈ సినిమాలోని యాక్టర్ల పవర్‌ఫుల్ పెర్పార్మెన్స్‌తో భారీ చిత్రంగా మారింది. ప్రతీ క్యారెక్టర్‌ను చక్కగా డిజైన్ చేశారు. కథ, కథనాలు చాలా బాగున్నాయి. స్టోరీ సెటిల్ కావడానికి కొంత ఎక్కువ సమయాన్నే తీసుకొన్నారు. కానీ ఆ తర్వాత టాప్ గేర్‌లో దూసుకెళ్లింది అంటూ ఓ నెటిజన్ సుదీర్ఘమైన ట్వీట్ రివ్యూను అందించారు.

తాయ్ కెలవి చిత్రం ఎక్ట్రార్డినరీ ఎంటర్‌టైనింగ్ మూవీ. సింప్లి అమేజింగ్. కొత్త నటీనటులు, అద్బుతమైన ప్రతిభతో ప్యాషినేట్ ఫిల్మ్ మేకర్ శివకార్తీకేయన్ అదరగొట్టారు. తొలి చిత్ర దర్శకుడు శివకుమార్ గర్వపడేలా తన సినిమాను అందించారు. ఆయనకు మరిన్ని సక్సెస్‌లో భవిష్యత్‌లో రావాలని కోరుకొంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తాయ్ కెలవి సినిమా అద్బుతమైన రచనా నైపుణ్యంతో రాసిన గ్రామీణ ఎంటర్‌టైనర్. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా ఎంగేజ్‌చేస్తూ ఉంటుంది. ఫస్టాఫ్ ఫన్‌తో సాగిపోతుంది. సెకండాఫ్ బ్యాలెన్స్‌గా ఎమోషన్స్, హ్యుమర్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. కామెడీ సూపర్‌గా వర్కవుట్ అయింది. ప్రతీ 5 నిమిషాలకోసారి నవ్వుల్లో మునిగిపోతాం. హ్యుమర్ ఫ్రెష్, యూనిక్‌గా ఉంది అని కామెంట్ చేశారు.

ఒకవేళ రాజ్ కుమార్ హిరాణి తమిళ రూరల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తే ఎలాగుంటుందంటే.. తాయ్ కెలవి సినిమాల ఉంటుందనిపిస్తుంది. ఆ రేంజ్‌లో డైరెక్టర్ శివకుమార్ తెరకెక్కించారు. ఫ్యామిలీలకు ఓ వృద్ధ మహిళ లైఫ్ లెస్సన్‌గా ఉంటుంది. పురుషుల సహాయం లేకుండా ఆమె ఇండిపెండెంట్‌గా జీవించాలని అనుకొనే మహిళ జీవితమే ఈ సినిమా కథ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X