For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విక్రమ్ మళ్లీ డీలా...(శివ తాండవం రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  2.0/5
  హైదరాబాద్: 'అపరిచితుడు' చిత్రం తర్వాత ఆ రేంజి హిట్ లేని హీరో విక్రమ్ ఇప్పటికే చాలా సినిమాలతో తెలుగు బాక్సాఫీసు వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాఅన్ని సార్లు అపజయాన్నే చవి చూసాడు. తాజాగా మరోసారి 'శివతాండవం' పేరుతో బాక్సాఫీసు బరిలోకి దిగాడు. విక్రమ్, అనుష్క, అమీ జాక్సన్, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రానికి 'నాన్న'ఫేం ఎంఎల్.విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.

  కథ: శివ కుమార్ (విక్రమ్) 'రా' (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) డిపార్టుమెంటులో టాప్ 5 ఇంటెలిజెన్స్ అధికారులలో ఒకరు. లండన్లో జరిగిన బాంబు పేలుళ్లలో తన భార్య మీనాక్షి(అనుష్క)ను కోల్పోతాడు. ప్రమాదంలో తన చూపు కూడా పోతుంది. తర్వాత విక్రమ్ 'కెన్ని'గా మారి హత్యలు చేస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకివెళితే...శివ కుమార్, అతని సహచరుడు మరియు స్నేహితుడు అయిన శరత్(జగపతిబాబు) టెర్రరిస్టులు తలపెట్టిన వినాశనాన్ని అడ్డుకునే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ వారి మిషన్ సక్సెస్ కాదు. ఫలితంగా మీనాక్షిని కూడా కోల్పోతారు. అలా ఎందుకు జరిగింది? దాని వెనక ఎవరున్నారు? భార్యతో పాటు చూపు కోల్పోయిన శివకుమార్ తను అనుకున్నది ఎలా సాధించాడు? అనేది తర్వాతి కథ.

  పెర్ఫార్మెన్స్: దేశాన్ని కాపాడే ఇంటెలిజెన్స్ అధికారి శివ పాత్రలో, తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే కెన్ని అనే అంధుడి పాత్రల్లో విక్రమ్ అద్భుతంగా నటించాడు. స్వతహాగా విక్రమ్ మంచి నటుడు ఈ సినిమాలో తెలివైన అందుడిగా బాగా నటించాడు. అనుష్క ఫ్లాష్ బ్యాక్‌లో పరిమితమైన పాత్ర చేసింది. హీరోకి సహాయం చేసే పాత్రలో అమీ జాక్సన్ ఆకట్టుకోలేక పోయింది. అందం పరంగా ఫర్వాలేదు కానీ నటన పరంగా ఆమె పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి మైనస్. జగపతిబాబు ఇంప్రెసివ్‌గా నటించాడు. సంతానంతో కామెడీ చేయించారు కానీ వర్కౌట్ కాలేదు. నాజర్, కోట, షాయాజీ షిండే తదితరులు తమ పాత్రలకు తగిన విధంగా నటించారు.

  విశ్లేషణ: దర్శకుడు విజయ్ కుమార్ విక్రమ్ పాత్రలపై పెట్టిన దృష్టి స్ర్కీన్ ప్లేపై పెట్టలేదు. ఫస్టాఫ్‌లో సినిమా చాలా స్లోగా సాగుతుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఆకట్టుకోలేక పోయింది. అయితే నివర్ షా సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ఎడిటర్ ఆంటోనీ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేదు. సినిమాలో చాలా అనవసర సీన్లు ఉన్నాయి. వాటిపై ఆంటోనీ దృష్టి పెట్టక పోవడం సినిమాకు మైనస్ గా మారింది.

  తీర్పు: మొత్తానికి 'శివ తాండవం' అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. సినిమాలో విక్రమ్ పెర్ఫార్మెన్స్ తప్పించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎంటర్ టైన్మెంట్ అంశాలు లేక పోవడం వల్ల ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను, మసాలా ఎలిమెంట్స్, కమర్షియల్ అంశాలు లేక పోవడం వల్ల అటు యూత్, మాస్ ఆడియన్స్‌ను కూడా ఈచిత్రం ఆకట్టుకోలేక పోతోంది.

  English summary
  Vikram starrer Siva Thandavam movie released today and get average talk. It is a Blind Revenge Drama. The film, which also has Anushka, Amy Jackson, Jagapathi Babu and Lakshmi Rai. Minus points are.. Predictable Plot, The placement of songs is the biggest let down, Casting isn’t great. Amy Jackson and Santhanam look out of place, There are plenty of logical loopholes in the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X