twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thaggedele review and Rating: దండుపాళ్యం 4 అనే విధంగా.. రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్‌గా తగ్గేదేలే!

    |

    Rating:
    2.5/5

    నటీనటులు: నవీన్ చంద్ర, అనన్య రాజ్, దివ్య పిళ్లై, రాజా రవీంద్ర, నాగబాబు, రవి శంకర్, అయ్యప్ప పీ శర్మ, పూజా గాంధీ, మక్రంద్ దేశ్‌పాండే, కోటేశ్వర్ రావు, నైనా గంగూలీ, రవి కాలే తదితరులు
    రచన, దర్శకత్వం: శ్రీనివాసరాజు
    డీవోపీ: వెంకట్ ప్రసాద్
    బ్యానర్: భద్ర క్రియేషన్స్
    ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
    బీజీఎం: చిన్నా
    మ్యూజిక్: చరణ్ అర్జున్
    ఆర్ట్: నారా అశోక్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీంద్ర
    పీఆర్వో: వంశీ కాక
    రిలీజ్ డేట్: 2022-11-04

    ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. జీవితాన్ని అన్ని రకాలుగా ఆస్వాదించాలనే కోరికతో స్వామి (నాగబాబు) నడిపే ప్యారడైజ్ అనే ఆశ్రమానికి వెళ్తారు. డ్రగ్స్, అమ్మాయిలతో సుఖాలకు అడ్డాగా ఉండే ఆ ఆశ్రమంలో లిజి (అనన్య రాజ్)తో జరిగిన పరిచయం పడక గదిలో శారీరక సంబంధం వరకు వెళ్తుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా తన మేన మరదలు దేవీ (దివ్య పిళ్లై)తో ఈశ్వర్‌కు పెళ్లి జరుగుతుంది. కానీ తన లైఫ్‌లోకి రాదని అనుకొన్న ఈశ్వర్ జీవితంలోకి లిజీ మళ్లీ ప్రవేశిస్తుంది

    దేవీతో పెళ్లి తర్వాత తన జీవితంలోకి లిజి ప్రవేశించడంతో ఈశ్వర్‌కు జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అనుమానాస్పద రీతిలో తన ఇంట్లోనే లిజి చనిపోవడంతో ఈశ్వర్ పరిస్థితి ఏమైంది? ఈ మర్డర్ కేసు దర్యాప్తు ఎలా జరిగింది? స్వామిజీ నడిపే ఆశ్రమంతో లిజికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ కథలో దండుపాళ్యం బ్యాచ్ పాత్రలు ఎమిటి? చివరకు లిజీ మర్డర్ కేసు నుంచి ఈశ్వర్ బయటపడ్డారా? లిజిని హత్య చేసిందెవరు అనే ప్రశ్నలకు సమాధానమే తగ్గేదే లే సినిమా కథ.

    Thaggedele review and Rating:  Dandupalyam fame Srinivas Rajus romantic crime thriller

    తగ్గేదేలే సినిమా మూడు రకాల పాయింట్స్‌తో కొనసాగుతుంది. స్వామిజీ ప్యారడైజ్ ఆశ్రమంలో లిజీ, దండుపాళ్యం బ్యాచ్‌కు సంబంధించిన మరో పాయింట్.. అలాగే దివ్య, ఈశ్వర్, లిజీ ముగ్గురి మధ్య జరిగే డ్రామాగా తగ్గేదేలే రకరకాల ట్విస్టులతో ముందుకెళ్తుంది. అయితే మూడు రకాల పాయింట్స్‌తో దర్శకుడు శ్రీనివాసరాజు కథను నడిపించిన తీరు అతడి అనుభవానికి అద్దం పట్టింది. అయితే కథ, కథనాలను ఇంకా బెటర్‌గా వర్కవుట్ చేయాల్సిందనిపిస్తుంది.

    నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికి వస్తే.. నవీన్ చంద్ర ఎప్పటిలానే ఎమోషనల్ పాత్రను బెటర్‌గా చేశాడు. అనన్య రాజ్‌తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయాడనే చెప్పాలి. వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. లిజీ పాత్రను ఇంకా బెటర్‌గా కొనసాగించి ఉంటే.. యూత్‌ఫుల్‌గా ఉండేదనిపిస్తుంది. లిజీ తన పాత్రకు న్యాయం చేసింది. నవీన్ చంద్ర భార్యగా నటించిన దివ్య పిళ్లై గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. మిగితా పాత్రల్లో నటీనటులు తమ పాత్రలకు మించిన పెర్ఫార్మెన్స్ చూపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే...చిన్నా అందించిన బీజీఎం బాగుంది. సీతాకోక చిలుక సినిమాలోని మాటే మంత్రం పాట సినిమాకు ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ కథ డిమాండ్ మేరకు మంచి అవుట్‌పుట్ అందించాయి. భద్ర క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపిక సినిమాకు ప్లస్‌గా మారింది.

    లవ్, క్రైమ్, మిస్టరీ లాంటి అంశాలతో తగ్గేదేలే రూపొందింది. అయితే స్వామిజీ ఆశ్రమం, దండుపాళ్యం బ్యాచ్ స్టోరిపై ఇంకాస్త డిటైల్డ్‌గా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు సినిమాను యూత్‌పుల్‌గా మార్చాయని చెప్పవచ్చు. అయితే మితిమీరిన హింస, తెరపై పారిన రక్తపాతం చూడాలంటే.. కాస్త గుండెధైర్యం తెచ్చుకోవాల్సిందే. దండుపాళ్యం సినిమా అభిమానులకు, క్రైమ్, మర్డరీ, మిస్టరీలను ఇష్టపడే వారికి తగ్గేదేలే నచ్చే అవకాశం ఉంది.

    English summary
    Thaggedele is set to release on November 4th. Here is the exclusive review by Telugu filmibeat
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X