Thala Review: తల తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. అమ్మ రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ అవుతుందా?
మూవీ: తల
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్ తదితరులు
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
ఎడిటర్ : శివ సామి
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
రిలీజ్ డేట్: 2025-02-14
ఆవేశం, ఆలోచనతో ఉండే యువకుడు (అమ్మ రాగిన్ రాజ్)కు తల్లి అంటే పిచ్చి ప్రేమ. తల్లి కోసం ఎంతకైనా తెగిస్తాడు. అయితే ఓ సమస్యతో బాధపడుతున్న తల్లి తన జీవితంలో ఓ అన్యాయానికి గురి అవుతుంది. తన తల్లికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసేందుకు కంకణం కట్టుకొంటాడు. అమ్మ కోసం యువకుడు ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దమవుతాడు.
అమ్మ రాగిన్ రాజ్ తల్లికి జరిగిన అన్యాయం ఏమిటి? రాగిన్ రాజ్ తల్లికి ఎదురైన ప్రాణాంతక సమస్య ఏమిటి? తన తండ్రి కోసం రాగిన్ రాజ్ ఎందుకు వెతుక్కొంటూ వెళ్తాడు? రాగిన్ రాజ్ తల్లి, తండ్రి ఎందుకు విడిపోయారు? తల్లికి దూరమైన తండ్రిని రాగిన్ రాజ్ కలిశాడా? చావు బతుకుల్లో ఉన్న తన తల్లిని కలిసేందుకు తండ్రిని ఒప్పించాడా? తన లక్ష్యాన్ని సాధించేందుకు రాగిన్ రాజ్‌కు ఎదురైన సమస్యలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే తల సినిమా కథ.

అమ్మ రాగిన్ రాజ్ ఇండస్ట్రీకి కొత్తవాడైనా ఎక్కడా ఆ ఫీలింగ్ కనిపించకుండా ఫెర్ఫార్మెన్స్, యాక్టింగ్ విషయంలో అనుభవం ఉన్న యువ హీరోలా నటించాడు. ఫైట్స్, పాటలు, ఎమోషన్స్ సీన్లలో బాగా రాణించడమే కాకుండా మంచి భవిష్యత్ ఉందనే అభిప్రాయాన్ని కలిగించాడు. ఇక ఎస్తేర్ నొరొన్హా, ముక్కు అవినాష్, అజయ్, ఇతర నటీనటులు తమ పాత్రలకు అనుగుణంగా రాణించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ధర్మ తేజ, అస్లాం కేజీ అందించిన మ్యూజిక్, శ్యామ్ కే నాయుడు చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ఎమోషన్స్ సీన్స్‌ను శ్యామ్ కే నాయుడు మంచి ఫీల్‌తో చిత్రీకరించారు. లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. శివసామి ఎడిటింగ్ పనితీరు బాగుంది. అమ్మ రాజశేఖర్ టీం రాసిన డైలాగ్స్ సన్నివేశాలకు బలంగా నిలిచాయి. శ్రీనివాస్ గౌడ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగుండటమే కాకుండా సినిమాను మరింత రిచ్‌గా చూపించేందుకు ఖర్చు చేసిన ప్రతీ పైసా తెర మీద కనిపిస్తుంది.
తల సినిమా గురించి చెప్పాల్సి వస్తే.. ముందుగా చెప్పినట్టే మదర్ సెంటిమెంట్ అనే బలమైన పాయింట్‌తో సాగే లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక విభాగాల పనితీరు బలంగా నిలిచింది. మితీ మిరిన హింస కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. యాక్షన్ లవర్స్‌కు, వయోలెన్స్ బేస్డ్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కమ్ బ్యాక్ మ్యూవీగా చూపించడానికి అమ్మ రాజశేఖర్ పడిన తపన ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి.. మంచి అనుభూతిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications











