Thalaivan Thalaivii Movie Twitter Review: తలైవన్ తలైవి మూవీ ట్విట్టర్ రివ్యూ

పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం తలైవన్ తలైవి (తెలుగులో సర్ మేడమ్). సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్, టీజీ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యోగిబాబు, రోషిణి హరిప్రియన్, కాళి వెంకట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ఎం సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రదీప్ ఈ రాఘవన్ ఎడిటింగ్ .. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఓవర్సీస్, చెన్నై తదితర ప్రాంతాల్లోని ప్రీమియర్లు, స్పెషల్ షోల తర్వాత నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

Thalaivan Thalaivi Movie Twitter Review in Telugu  Will Vijay Sethupathi hits the bulls eye

తలైవన్ తలైవి బ్లాక్‌బస్టర్. డైరెక్టర్ పాండిరాజ్ ఈసారి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చారు. సెకాండఫ్ సూపర్, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

తలైవన్ తలైవితో మనందరం కోరుకున్న వింటేజ్ వీజేఎస్ (విజయ్ సేతుపతి) తిరిగి వచ్చాడు. విజయ్ - నిత్యామీనన్‌ల మధ్య సంఘర్షణతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా మారుతుంది. సెకండాఫ్‌లో కొన్ని లాగ్స్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ అదరగొట్టిందని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

కామెడీ, అద్భుతమైన సంగీతంతో ఫస్టాఫ్ ముగిసింది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ బాగుంది. నిత్యామీనన్ ఉన్న సన్నివేశాలు బాగున్నాయి. సపోర్టింగ్ నటుల కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయ్యింది అని ఓ అభిమాని ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది.. ఎంటర్‌టైనింగ్ అండ్ ఫన్, వింటేజ్ విజయ్ సేతుపతి మళ్లీ కనిపించారు. నిత్యామీనన్ నటనకు చప్పట్లు కొట్టాల్సిందే. యోగిబాబు కామెడీతో నవ్వులు పూయించారు. పొట్టేల్ ముట్టాయే సాంగ్‌ మంచి డ్యాన్స్ మెటీరియల్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

తలైవన్ తలైవి ఫస్టాఫ్ ప్యూర్ ఫన్‌.. విజయ్ సేతుపతి ఫాంలో పడ్డారు.. నిత్యామీనన్ క్లాసిక్‌‌.. యోగిబాబు కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

తలైవన్ తలైవి చిత్రం కుటుంబ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.. విజయ్ సేతుపతి తిరిగి ట్రాక్‌లో పడ్డాడు. నిత్యామీనన్ ఎప్పటిటాగే కల్ట్ యాక్టింగ్ చేసింది. ఫన్ + ఎమోషనల్ స్క్రిప్ట్ బాగా పనిచేసింది అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

తలైవన్ తలైవి విడుదల సందర్భంగా పూరీ జగన్నాథ్ నివాసంలో విజయ్ సేతుపతితో కేక్ కట్ చేయించారు. ఛార్మీ కౌర్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు విజయ్‌ సేతుపతికి అభినందనలు తెలియజేశారు.

తలైవన్ తలైవి విడుదల సందర్భంగా నాయకుడికి, నాయకురాలికి అభినందనలు అని యాక్టర్ సూరి ట్వీట్ చేశారు.

తలైవన్ తలైవి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000కు పైగా థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. టీజర్, ట్రైలర్‌తో హైప్ నేపథ్యంలో మంచి బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X