Thalaivan Thalaivii First Review: తలైవన్ తలైవీ ఫస్ట్ రివ్యూ
తమిళ సినీ పరిశ్రమలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన చిత్రం తలైవన్ తలైవి (తెలుగులో సర్ మేడమ్). ఈ సినిమాను సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్, టీజీ త్యాగరాజన్ నిర్మించారు. ఈ చిత్రంలో యోగిబాబు, రోషిణి హరిప్రియన్, కాళి వెంకట్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఎం సుకుమార్, ఎఢిటింగ్ ప్రదీప్ ఈ రాఘవన్, మ్యూజిక్ సంతోష్ నారాయణ్ అందించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సమీక్షించింది. సెన్సార్ రివ్యూ అనంతరం ఈ సినిమాకు సర్టిఫికెట్ ఎలాంటిది లభించింది? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తలైవన్ తలైవి సినిమా కథ విషయానికి వస్తే.. భార్య, భర్తల మధ్య జరిగే ఫ్యామిలీ డ్రామా. మొగుడు, పెళ్లాల మధ్య ప్రేమలు, అలకలు, కొట్లాటలు, వారి రిలేషన్స్‌లో ఎమోషన్స్ ప్రధాన అంశాలుగా చేసుకొని తెరకెక్కించారు అనేది తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో స్పష్టమైంది. 19 (1 a) మలయాళ చిత్రంలో నటించిన అనంతరం చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించడంతో ఈ సినిమాపై కొంత క్రేజ్ ఏర్పడింది. ప్రమోషన్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.
తలైవన్ తలైవి సినిమాలో విజయ్ సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నారు. ఆయన భార్యగా నిత్యా మీనన్ నటించారు. ఆ ఇద్దరి మధ్య సన్నివేశాలు, సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్‌ను దర్శకుడు పాండి రాజ్ చక్కగా రాశారు అనే విషయాన్ని ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. దాంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సెన్సార్ అధికారుల రివ్యూకు ఈ సినిమా వెళ్లింది.
ఈ మూవీని సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించిన తర్వాత సంతృప్తిని వ్యక్తం చేశారు. సగటు సినిమా ప్రేక్షకుడు తమ కుటుంబ సమేతంగా చూసేందుకు అంశాలు ఉన్నాయి. చక్కటి కథ, కథనాలతోపాటు మంచి వినోదం, సందేశం దాగి ఉంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ పోటీపడి నటించారు. భార్యాభర్తలుగా వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అని అభిప్రాయపడినట్టు సమాచారం. పరోటా మాస్టర్‌గా, కామన్ మ్యాన్‌గా విజయ్ సేతుపతి అద్బుతంగా నటించాడు.
ఇక తలైవన్ తలైవి సినిమా క్లీన్ ప్రశంసలు అందిస్తూ.. ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమాను 16 ఏళ్లు దాటిన పిల్లలందరూ చూడటానికి అనుమతి ఇచ్చారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు అంటే 140 నిమిషాలు ఫిక్స్ చేశారు. పాండిరాజ్, విజయ్ సేతుపతి ఫస్ట్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











