For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thalaivii movie review and Rating: అమ్మగా అదరగొట్టిన కంగన రనౌత్

  |

  Rating:
  3.0/5
  Star Cast: కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని
  Director: ఏఎల్ విజయ్

  భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ప్రముఖుల జీవితం ఆధారంగా ఎన్నో బయోపిక్ మూవీలు వచ్చాయి. అందులో కొందరు సినీ ప్రముఖులు, మరికొందరు క్రీడాకారులు, ఇంకా రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అయితే తాజాగా సినీ, రాజకీయ లెజెండ్‌గా నిలిచిన దక్షిణాది అగ్రనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జే జయలలిత జీవితం ఆధారంగా సినిమా వస్తుందనే విషయం ఆ సినిమా ఆసక్తినే కాకుండా భారీ అంచనాలు పెంచాయి. జయలలిత జీవితంలో కోణాలను తెర మీద ఎలా ఆవిష్కరించారనే విషయం తెలుసుకోవాలంటే తలైవి చిత్రాన్ని సమీక్షించాల్సిందే..

   తలైవి కథ గురించి

  తలైవి కథ గురించి

  పేదరికం, కుటుంబ పరిస్థితులు, తల్లి (భాగ్యశ్రీ) బలవంతం పెడితే జయ (కంగన రనౌత్) సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంది. తొలి అవకాశమే తమిళనాడు సూపర్ స్టార్ ఎంజేఆర్ (అరవింద్ స్వామి) పక్కన నటించే ఛాన్స్ వస్తుంది. వెండితెర మీద ఎంజేఆర్, జయ జంటకు మంచి క్రేజ్ వస్తుంది. ఎంజేఆర్‌తో జయ సాన్నిహిత్యం నచ్చని కొందరు వారిద్దరిని విడదీస్తారు. దాంతో ఎంజేఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతాయి. దాంతో మళ్లీ వారిద్దరు కలిసి నటిస్తారు. అయితే ఊహించని కారణంగా ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. మళ్లీ ఎంజేఆర్ వర్గం జయను ఆయన నుంచి విడదీస్తారు.

  తలైవిలో ట్విస్టులు ఇలా..

  తలైవిలో ట్విస్టులు ఇలా..

  జయ కుటుంబ నేపథ్యం ఏమిటి? ఎందుకు పేదరికంలోకి జయ కుటుంబం కూరుకుపోతుంది? ఎందుకు కోసం ఎంజేఆర్ సన్నిహితుడు వీరప్పన్ (సముద్రఖని) జయను దూరం చేయాలని ప్రయత్నిస్తాడు? తల్లి మరణం, ఎంజేఆర్ దూరమైన తర్వాత జయ పరిస్థితి ఎలా మారింది. ఎంజేఆర్ ఆరోగ్యం క్షీణించిన సమయంలో జయ ఎలాంటి బాధ్యతను భుజానికి ఎత్తుకొన్నది? తమిళనాడు అసెంబ్లీలో కరుణ (నాజర్) జయ వస్త్రాపరణ చేసి అవమాన పరిచాడు. ఎంజేఆర్ మరణం తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో జయ తనకు ఇష్టం లేని రాజకీయాల్లోకి ప్రవేశించారు? తమిళ రాజకీయాల్లో జయ ఆధిపత్యం ఎలా కొనసాగింది అనే ప్రశ్నలకు సమాధానమే తలైవి సినిమా కథ.

  తలైవి కథ ఎలా సాగిందంటే..

  తలైవి కథ ఎలా సాగిందంటే..

  తలైవి చిత్రం తమిళనాడు అసెంబ్లీలో దుశ్శాసన పర్వంతో జయను అవమానించే ఎపిసోడ్‌తో సినిమాను ఓ రేంజ్‌లో స్టార్ట్ చేశాడనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం నిధానంగా, ఫ్లాట్‌గా సాగడం కథలో పసలేదా అనిపిస్తుంది. అయితే వివాదాల జోలికి పోకుండా ఆత్మరక్షణ ధోరణిని అవలంభించినట్టు కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో జయ జీవితంలో కొన్ని బలమైన సంఘటనలు, ఎమోషనల్ అంశాలను కలబోసి పూర్తిగా మెప్పించాడని చెప్పవచ్చు. చివరి 15 నిమిషాలు కథ, కథనాలు ఆయువుపట్టుగా మారాయి. వీరప్పన్ క్యారెక్టర్ జయను కలిసిన తర్వాత కథా స్వరూపమే మారినట్టు కనిపిస్తుంది.

  దర్శకుడు విజయ్ టేకింగ్

  దర్శకుడు విజయ్ టేకింగ్

  తలైవి సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు ఏఎల్ విజయ్ చాలా సేఫ్ గేమ్ ఆడినట్టు కనిపిస్తుంది. సినిమాలో ఫీల్‌గుడ్ అంశాలనే ఎంచుకొని.. జయ జీవితంలోని అనేక వివాదా అంశాలను పక్కన పెట్టి ఈ సినిమాను రూపొందించారు. ఫస్టాఫ్‌లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. చిన్న చిన్న గొడవలతో స్క్రిప్టు రాసుకొని ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే జయలలిత తెలుగు, కన్నడ భాషల్లో తన నట ప్రస్థానాన్ని టచ్ చేయకపోవడం కొంత మేరకు స్క్రిప్టులో ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు. సినిమా చూసిన తర్వాత ఫస్టాఫ్‌ను డిఫెన్స్‌గా, సెకండాఫ్‌ను కొంత ఇంట్రెస్టింగ్‌గా మలిచారనే ఫీలింగ్ అనిపిస్తుంది.

   కంగన రనౌత్ వన్ ఉమెన్ షో

  కంగన రనౌత్ వన్ ఉమెన్ షో

  తలైవి సినిమాలో సింహభాగం కథను నడిపించే బాధ్యతను కంగన రనౌత్ తన భుజాలపై వేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. కొన్ని సన్నివేశాల్లో జయలలిత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో మేకప్ సరిగా సెట్ కాకపోవడం వల్ల కొన్ని సీన్లలో జయగా తేలిపోయినట్టు అనిపిస్తుంది. తమిళ అసెంబ్లీ ఎపిసోడ్, అలాగే జయను ఎంజేఆర్‌ వదిలేసే సన్నివేశాలు, అలాగే పార్లమెంట్‌లో మరో సీన్‌లో కంగన రనౌత్ అదరగొట్టింది. జయ పాత్రను సజీవంగా మార్చడంలో కంగన కృషిని అభినందించాల్సిందే.

  అరవింద్ స్వామి, సముద్రఖని ఫెర్ఫార్మెన్స్

  అరవింద్ స్వామి, సముద్రఖని ఫెర్ఫార్మెన్స్

  ఇక ఎంజేఆర్ పాత్రలో అరవింద్ స్వామి జీవించాడనే చెప్పాలి. ఎంజేఆార్ పాత్రకు సంబంధించిన మేకప్ చక్కగా కుదరడంతో ప్రేక్షకులు ఆ పాత్రకు తొందరగా కనెక్ట్ కావడానికి అవకాశం దక్కింది. జయ క్యారెక్టర్‌తో కెమిస్ట్రీని మంచి పండించాడు. కథ అరవింద్ కోణంలో సాగకపోవడం వల్ల ఆ పాత్రను కొంత పక్కన పెట్టారనే అంశం సులభంగానే అర్దమవుతుంది. కరుణగా నాజర్ ఫర్వాలేదనిపించాడు. తలైవి సినిమాలో కంగన తర్వాత అద్బుతంగా వీరప్పన్ పాత్రను సముద్రఖని పండించాడు. ఏ కోణంలో కూడా సముద్రఖని కనిపించడు. కేవలం వీరప్పన్ మాత్రమే కనిపించేంతగా అద్భుతంగా తెరపైన రాణించాడని చెప్పవచ్చు.

  సినిమాటోగ్రఫి, డైలాగ్స్ ఎలా అంటే

  సినిమాటోగ్రఫి, డైలాగ్స్ ఎలా అంటే

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే... విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణ. ఆర్ట్ విభాగం ప్రతిభతో 80, 90 దశకాల నేటివిటిని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తెరమీద జయ అని (నమ్మించే) విధంగా మేకప్ గురించి మరికొంత శ్రద్ద తీసుకొని ఉంటే ఇంకా ఫీల్ పెరిగి ఉండేది. జయ, ఎంజేఆర్ కౌగిలింత సన్నివేశం, జయ, వీరప్పన్ మధ్య మినప వడ సన్నివేశాల్లో డైలాగ్స్ బాగున్నాయి. పార్లమెంట్‌లో కంగన రనౌత్‌తో చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్క బొడిచేలా ఉన్నాయి.

  సంగీతం, విజయేంద్ర ప్రసాద్ రచన

  సంగీతం, విజయేంద్ర ప్రసాద్ రచన


  ఇక జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం విషయానికి వస్తే రీరికార్డింగ్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు. పాటల్లో ఎమోషన్ ఉండి ఉంటే కథ మరింత భావోద్వేగంగా మారి ఉండేది. పాటలు ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. కేవీ విజయేంద్ర ప్రసాద్ రచన సహకారం సినిమాను మరో రేంజ్‌కు చేర్చింది.

  నిర్మాణ విలువలు గురించి

  నిర్మాణ విలువలు గురించి

  తలైవి సినిమాకు నిర్మాతలుగా విష్ణు‌వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ వ్యవహరించారు. పాత్రలకు నటీనటుల ఎంపికతోనే సంగం సక్సెస్‌ను అందుకొన్నారని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బ్రహ్మండంగా ఉన్నాయి. కాకపోతే కథ విషయంలో రాజీ పడకుండా పూర్తి అంశాలతో సినిమా నిర్మించి ఉంటే డెఫినెట్‌గా ఓ ఎమోషనల్, రొమాంటిక్, పొలిటికల్ థ్రిల్లర్ అయి ఉండేది.

   ఫైనల్‌గా ఎలా ఉందంటే

  ఫైనల్‌గా ఎలా ఉందంటే


  భావోద్వేగాలు, రొమాన్స్, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల లాంటి అంశాలతో రూపొందించిన చిత్రం తలైవి. అయితే జయలలిత జీవితంలో తెర వెనుక జరిగిన విషయాలు, కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించని విషయాలను చెప్పకపోవడం చూస్తే దర్శక, నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడారని అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు కంగన రనౌత్, సముద్రఖని పాత్రలు బలంగా మారితే.. నాజర్ పాత్ర మరీ బలహీనంగా కనిపించింది. జయలలిత జీవితం, తమిళనాడు రాజకీయ చరిత్ర తెలియని వారికి ఈ సినిమా అద్భుతంగా కనిపిస్తుంది. చరిత్ర తెలిసిన వారికి మాత్రం కొంత అసంతృప్తి కలగడం సహజం. కంగన రనౌత్ నటన, జయలలిత జీవితం చూడాలనుకొనే వారికి తలైవి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

  Recommended Video

  Kangana Ranaut True Admirer Of Jayalalitha | Thalaivii Interview
  నటీనటులు, సాంకేతి నిపుణులు

  నటీనటులు, సాంకేతి నిపుణులు


  నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు
  దర్శకత్వం: ఏఎల్ విజయ్
  రచన: కేవీ విజయేంద్ర ప్రసాద్
  నిర్మాతలు: విష్ణు వర్ధన్ ఇందూరి
  సినిమాటోగ్రఫి: విశాల్ విట్టల్
  ఎడిటింగ్: ఆంథోని, బల్లు సలూజ
  మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
  బ్యానర్లు: గోతిక్ ఎంటర్‌టైన్‌మెంట్, విబ్రి మోషన్ పిక్చర్స్
  రిలీజ్ డేట్: 2021-09-10

  English summary
  Thalaivii movie review and Rating: Kangana Ranaut steals the show as J Jayalalithaa, Aravind Swamy, Nazar, Samudra Kani are in life size roles. This movie released on September 10
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X