Thamma Twitter Review: థామా మూవీ ట్విట్టర్ రివ్యూ

బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థామా. యువ దర్శకుడు ఆదిత్య సర్పోదార్ రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి లాంటి తారలు అతిథి పాత్రల్లో కనిపించారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయింది.

మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో పెన్ మరుదార్, ఓవర్సీస్‌లో యష్ ఫిలింస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పాటలు, ప్రమోషనల్ వర్క్‌కు భారీ స్పందన లభించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై క్రిటిక్స్, నెటిజన్లు, సినీ ప్రేక్షకులకు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

Thamma Hindi Movie Twitter Review

థమ్మా సినిమా చూశాను. మడోక్ ఫిల్మ్స్ మరోసారి మంచి సినిమాను అందించి విజేతగా నిలిచింది. రొమాన్స్, సూపర్ నేచురల్, హ్యుమర్ ఎలిమింట్స్‌ను కలిపి మంచి ఫీస్ట్‌గా అందించారు. ఈ సినిమా కథ విభిన్నంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా సన్నివేశాలు ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య తన సత్తాను చాటుకొన్నడు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ఈ సినిమా మరో రేంజ్‌కు తీసుకెళ్లారు అని తరుణ్ ఆదర్ కామెంట్ చేశారు.


థమ్మా సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది. ఈ సినిమా నాకు పూర్తి సంతృప్తిని అందించింది. ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు దర్శకుడు ఆదిత్య డైరెక్షన్ చేసిన విధానం సింప్లీ, సూపర్బ్. ఈ సినిమాను తీర్చి దిద్దిన విధానం, ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు చేసిన కసరత్తు బాగుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమా హై ఎనర్జీతో తిర్చిదిద్దిన పర్‌ఫెక్ట్ దీవాళీ గిఫ్ట్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

థమ్మా మూవీ చూశాను. ఈ సినిమాలో ఓ పాపులర్ యాక్టర్ అతిథి పాత్ర అదిరిపోయింది. ఆ తర్వాత ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. థమ్మా పర్‌పెక్ట్‌గా కమర్షియల్ వాల్యూస్‌తో ప్యాక్ చేసిన మంచి ఎంటర్‌టైనర్. అంచనాలు పెట్టుకోకుండా వెళితే.. దీపావళీ పండుగ సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

థమ్మా మూవీ మంచి హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో నలుగురు టాప్ యాక్టర్ల కెమియోలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమాలో ఆయుష్మాన్, ఖురానా, రష్మిక మందన్న పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఈ సినిమా ద్వారా మడోక్ ఫిలింస్ మరో హిట్ తన ఖాతాలో వేసుకొన్నారు అని నెటిజన్ కామెంట్ చేశారు.

థామా టోటల్ ఎంటర్‌టైనర్. హ్యుమర్, హారర్, ఎమోషన్స్‌తో రూపొందిన గ్రామీణ కథా చిత్రం. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా కెరీర్ బెస్ట్ ఇచ్చారు. రష్మిక మందన్న పవర్‌ఫుల్ రోల్ నటించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్ అతిథి పాత్రలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X