Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
మ్యూజిక్: అజనీష్ లోకనాథ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2025-07-04

జై (నితిన్), స్నేహలత అలియాస్ ఝాన్సీ(లయ) అక్కా, తమ్ముడు. చిన్నతనంలో జై చేసిన ఓ తప్పు కారణంగా ఇద్దరు విడిపోతారు. అయితే విలు విద్య క్రీడాకారుడైన జై ప్రొఫెషనల్‌గా గురి తప్పుతుంటాడు. తన అక్కకు చేసిన అన్యాయమే అందుకు కారణమని మానసికంగా భావిస్తుంటాడు. తన అక్కకు న్యాయం చేయాలని నిర్ణయించుకొంటాడు. కానీ వైజాగ్ ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్త అజర్వాల్(సౌరభ్ సచ్ దేవ) కారణంగా తన అక్క ఝాన్సీకి ముప్పు ఉందని తెలుసుకొంటాడు. తన స్నేహితురాలు చైత్ర (వర్ష బొల్లమ్మ)తో కలిసి తన సోదరి ఫ్యామిలీకి అండగా నిలువాలని నిర్ణయించుకొంటాడు.

జై, స్నేహలతకు మధ్య దూరం ఎందుకు పెరిగింది? జై, స్నేహలత ఎందుకు విడిపోయారు? స్నేహలత ఎందుకు ఝాన్సీగా మారింది. ఝాన్సీకి అజర్వాల్ నుంచి ఎందుకు ముప్పు ఏర్పడింది. వైజాగ్‌లో కెమికల్ ఫ్యాక్టరీకి బలైన మృతుల కుటుంబాలు అజర్వాల్ పై ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఆంధ్ర, చత్తీస్‌ గడ్ ప్రాంతంలో స్నేహలత కుటుంబంపై అజర్వాల్ ఎందుకు దాడికి ప్లాన్ చేశారు. ఆ దాడిని జై ఎలా అడ్డుకొన్నాడు? అజర్వాల్‌కు ఎలా బుద్ది చెప్పారు అనేది ఈ సినిమా కథ.

Thammudu Movie Review and Rating in Telugu  Dil Raju  Nithiin s emotional drama

వైజాగ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. అయితే బాధితులకు నష్టపరిహారం చెల్లించుకుండా తప్పించుకోవాలని చూసిన అజర్వాల్ పాయింట్‌తో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ పాయింట్‌ ఆధారంగా చేసుకొని అక్కా, తమ్ముడి కథను లింక్ చేసిన తీరు కూడా బాగుంది. కానీ కథలోని సన్నివేశాలు, కథనం చాలా రెగ్యులర్, రొటీన్‌గా ఉంది. ఈ సినిమాలో ఎమోషన్స్ అసలు పండలేదు. బ్రదర్, సిస్టర్ మధ్య ఉన్న డ్రామాలో భావోద్వేగాలు పండించడానికి చాలా స్కోప్ ఉంది. కానీ సరైన రీతిలో కథ, కథనాలు, సన్నివేశాల రూపకల్పనలో సరిగా కసరత్తు జరగలేదనే విషయం ఆరంభంలోనే అర్ధమవుతుంది. కానీ ఈ లోపాలను టెక్నికల్ అంశాలు, అటవీ ప్రాంతంలోని టేకింగ్‌తో సరిపెట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

ఇక సెకండాఫ్‌లోనైనా అక్కా, తమ్ముడి మధ్య ఎమోషనల్ బాండింగ్‌తో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? అని వేచి చూసిన వారికి నిరాశే ఎదురవుతుంది. కానీ అడవిలో ఆ యువతి ప్రసవం సీన్ బాగా, గుండెను పిండేసేలా చిత్రీకరించారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి మాస్, రెగ్యులర్ ఫైట్స్, యాక్షన్ సీన్లతో హడావిడిగా ముగించేయడం ఈ సినిమాకు మైనస్‌గా కనిపిస్తుంది. ఓవరాల్‌గా రెగ్యులర్, మాస్, యాక్షన్ సినిమాగా ముగించారనిపిస్తుంది. కొత్తదనం లేని సిస్టర్, బ్రదర్ సెంటిమెంట్ సినిమాగా మారింది.

ఈ సినిమాలో లయ, నితిన్ మధ్య బాండింగ్ బాగా కుదిరింది. కానీ ఎమోషనల్ సీన్లు లేకపోవడం వల్ల , గొప్పగా సినిమాలో కంటెంట్ ప్రొజెక్ట్ కాలేకపోవడం వల్ల ఆ కాంబినేషన్ పర్పస్ సాల్వ్ చేయడానికి వారు చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. నితిన్ మెచ్యుర్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. లయ అందం, అభినయంతో ఆకట్టుకొన్నారు. సప్తమీ గౌడ చిలిపిగా, ఎమోషనల్ పాత్రలో కనిపించారు. స్వసిక నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కొత్తదనం తీసుకొచ్చారు. హరితేజకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లభించింది. సౌరబ్ సచ్ దేవా ఓ గమ్మత్తైన పాత్రలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగతం ఏ పాత్రకు ఆ పాత్ర బాగానే ఉన్నా.. టీమ్‌గా ఫుల్లుగా జెల్ కాలేకపోయింది.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అక్కడక్కడా బాగుంది. కొన్ని సీన్లను సౌండ్‌తో అరిపించాడు. సీన్లలో కంటెంట్ లేకపోవడం వల్ల తను కూడా ఏమీ చేయలేకపోయాడు. కేవీ గుహన్ ఫారెస్ట్ ఎపిసోడ్స్ బాగా పిక్చరైజ్ చేశాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ సినిమాకు మైనస్. సెకండాఫ్‌లో చాలా అనవసరమైన సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి ఉంటే.. కొంత ఫీల్ అయినా మిగిలి ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దిల్ రాజు మూవీ అంటే కథ, కథనాలు పకడ్బందీగా ఉంటాయి. ఈ సినిమా విషయంలో కొంత ల్యాగ్ కనిపించింది. నితిన్ ఫ్యాన్స్, సిస్టర్, బ్రదర్ సెంటిమెంట్ తరహా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంపైనే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

More from Filmibeat

Read more about: dil raju nithiin thammudu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X