Thammudu Movie First Review: తమ్ముడు మూవీ ఫస్ట్ రివ్యూ
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా బడ్జెట్, కథా విశేషాలు, సెన్సార్ అధికారుల రివ్యూ వివరాల్లోకి వెళితే..
పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

మారుమూల గ్రామీణ ప్రాంతమైన అంబరగొడుగు అనే ప్రాంతం బ్యాక్ డ్రాప్‌తో జరిగే కథ ఇది. ఈ చిత్రంలో నితిన్ విలు విద్య క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్, చైల్డ్ సెంటిమెంట్‌తో సాగే కథను యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు.
ఓ ప్రాంతంలో ఆపదలో చిక్కుకొన్న సోదరి, ఆమె కూతుర్ని ఎలా రక్షించుకొన్నాడు? వారికి కలిగిన ముప్పు ఏమిటి? బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవ క్యారెక్టర్ ఏమిటి? స్వస్తిక, సప్తమీ గౌడ, హరితేజ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేవి ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేశాయి.
24 గంటల వ్యవధిలో జరిగే తమ్ముడు సినిమా కథ మొత్తంగా 80 శాతం అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించారు. ఈ చిత్రంలో 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. విజువల్, సౌండ్ అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ క్రేజీగా ఉంటుంది. సౌండ్ డిజైన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చిత్ర యూనిట్ చెప్పింది.
అయితే ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులకు ప్రివ్యూ షోను ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన తర్వాత పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ కొన్ని సీన్లను కట్ చేస్తే.. U/A సర్టిఫికెట్ ఇస్తే యూ/ఏ లేదా ఏ సర్టిఫికెట్ ఇస్తామని సూచించారు. అయితే ఈ సినిమాలోని అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను కట్ చేయడానికి నిర్మాత, దర్శకుడు నిరాకరించారు. దాంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ సెన్సార్ అధికారులు జారీ చేశారు. అయితే అడల్ట్ కంటెంట్ గీత దాటి ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమని చిత్ర యూనిట్ వెల్లడించింది.
దిల్ రాజు నిర్మించే సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ బ్యానర్ నుంచి 50 సినిమాలు వస్తే.. గతంలో రామయ్య వస్తావయ్యా.. ఎవడు సినిమాలకు ఏ సర్టిఫికెట్స్ లభించాయి. ఆ తర్వాత ఈ సినిమాకు మళ్లీ ఇలాంటి సర్టిఫికెట్ లభించింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ చూడకూడనటువంటి సన్నివేశాలు ఏమీ లేవు అని చిత్ర యూనిట్ భరోసాను ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2.25 గంటలు అంటే 145 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











