Thammudu Twitter Review: తమ్ముడు మూవీ ట్విట్టర్ రివ్యూ
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకొన్నది.
పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్ కు సంబంధించిన నెటిజన్ల అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

తమ్ముడు సినిమాలో పాజిటివ్ అంశాలు నితిన్ యాక్టింగ్, విలన్ క్యారెక్టరైజేషన్, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. బీజీఎం డీసెంట్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఇక కథ వీక్ ఉంది. కథనం కూడా అంతంత మాత్రంగానే ఉంది. సాంగ్స్ బాగా లేవు. సీన్లు సాగదీసినట్టు ఉంటాయి. కథ ఈజీగా ఊహించవచ్చు అని నెటిజన్ కామెంట్ చేశాడు. ఓవరాల్ డీసెంట్ మూవీ. ఇంకా బెటర్‌గా చేయాల్సి ఉండేదనిపిస్తుంది.
తమ్ముడు మూవీ ఎమోషనల్ రైడ్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్‌గా సాలిడ్‌గా ఉన్నాయి. యూత్ స్టార్ నితిన్ తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చారు. ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. డైరెక్టర్ వేణు సబ్జెక్ట్‌ను బాగా హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. అజనీష్ బీజీఎం, మ్యూజిక్ అదిరిపోయింది. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ పెర్ఫార్మెన్స్ బాగుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు మరో హిట్ పడినట్టే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
తమ్ముడు సినిమా రొటీన్ స్టోరి కానీ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్‌గా చేశారు. టెక్నికల్‌గా ఇంకా బెటర్‌గా ఉండాల్సిందనిపిస్తుంది. యాక్షన్ సీన్లు చాలా లెంగ్తీగా ఉన్నాయి. బిగ్ హిట్ అవుతుందని భావించడం లేదు కానీ యావరేజ్ మూవీ అని చెప్పవచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమాపై మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో స్పందించాడు. నా సోదరుడు నితిన్, శ్రీరామ్ వేణు, ఈ సినిమా యూనిట్ సభ్యులకు తమ్ముడు సూపర్ సక్సెస్ అందించాలని విషెస్ అందజేస్తున్నాను అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.
వకీల్ సాబ్ సినిమా తర్వాత తమ్ముడు అనే పవర్‌ఫుల్ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ వస్తున్నాడు. నితిన్ కూడా హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ ఇద్దరికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమాకు రావాలని కోరుకొంటున్నాను. శక్తిమంతమైన మహిళలకు ప్రతీకగా తమ్ముడు మూవీ వస్తున్నది. లయ గారు, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసిక తదితరులు నటించారు. సౌరబ్ సచ్ దేవా, అజనీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విజయం లభించాలి అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాతోపాటు 3BHK, Showtime సినిమాలకు సక్సెస్ లభించాలని కోరుకొన్నారు.
తమ్ముడు సినిమా రిలీజైంది. ఈ సినిమా ఒక్క రాత్రిలో జరిగే సంఘటన బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు. మల్టీపుల్ లేయర్స్‌తో కథను రూపొందించారు. ఈ సినిమా కంటెంట్ డ్రైడ్ చేసే మూవీ. ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకొంటున్నాను అని జీవి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











