Thandel First Review: తండేల్‌పై సెన్సార్ రివ్యూ ఏంటి? చైతూ, సాయిపల్లవి కెమిస్ట్రీపై షాకింగ్ రిపోర్ట్!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాపై సెన్సార్ అధికారులు ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
ఇటీవల విడుదలైన ట్రైలర్ తండేల్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ స్టాటస్‌ను అందించేలా చేశాయి. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి మధ్య నడించే లవ్ సన్నివేశాలు, ఆ సీన్లలో వారిద్దరూ కెమిస్ట్రీ యూత్‌లో క్రేజ్‌ను నింపాయి. ఇక హీరో దేశభక్తి ఈ మూవీలో కోర్ పాయింట్‌గా మారడంతో సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుందనే విషయం బలంగా వినిపిస్తున్నది. కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు పాకిస్థాన్‌లో ఎలా చిక్కుకుపోయాడు. అతడిని ఎలా సాయిపల్లవి రక్షించుకొన్నదనేది ఈ సినిమా కథ.

తండేల్ ప్రమోషన్స్ ఓ వైపు ఊపందుకోవడంతోపాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు. ఈ సినిమాను చూసిన తర్వాత సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ మూవీకి క్లీన్ సర్టిఫికెట్ అందించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమాకు యూఏ (U/A) సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక తండేల్ సినిమా ఎక్కువగా సాగదీయకుండా.. తగినంత మేర లెంగ్త్‌ను కట్ చేశారు. కథలో ఉండే ఎమోషన్స్‌ను నీరుకారకుండా సన్నివేశాల మధ్య ఉండే భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా ఎడిటర్ కట్ బాగుందనే విషయం బయటకు వచ్చింది. అన్ని రకాల యాడ్స్‌తోపాటు ఈ సినిమా నిడివి దాదాపు సుమారుగా 2.32 గంటలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొన్నారు అనే విషయం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్న తర్వాత క్లారిటీ ఇచ్చారు.

తండేల్ సినిమా తెలుగు నేటివిటీతో ముడిపడిన ఎమోషనల్ లవ్ స్టోరీనే మాత్రం కాకుండా దేశభక్తిని రగిలించే కథ. ఈ సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరించిన విధానంపై సెన్సార్ అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ లభిస్తుంది. వారికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌తో మంచి అనుభూతిని పంచుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని టీమ్ వెల్లడించింది. సెన్సాన్ రిపోర్టుతో ఈ సినిమా సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్‌లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమా యూనిట్ ఉందనే విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











