Thandel Twitter Review: తండేల్ తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. ప్రేమ కథగా, దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.

ఉత్తరాంధ్ర జాలరు కథగా రూపొందిన ఈ సినిమాలో యువ సామ్రాట్ నాగచైతన్య, టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్స్ అనంతరం నెటిజన్లు అభిమానులు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

Thandel Movie Twitter Review

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, గేయ రచయిత శ్రీమణి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాను అమెరికాలో ప్రత్యాంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో గ్రాండ్‌గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు ఈ సినిమా గురించి ఏమంటున్నారంటే..

తండేల్ సినిమా నాగచైతన్యకు కమ్ బ్యాక్ మూవీ. ఆ సినిమా కోసం పెట్టిన హార్డ్ వర్క్, చూపించిన యాక్టింగ్‌ నిజంగా ప్రశంసనీయం. ఎప్పటిలానే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో సాయిపల్లవి రాకింగ్. చందూ మొండేటి దర్శకత్వం, డీఎస్పీ మ్యూజిక్ హైలెట్. యదార్థ సంఘటనలతో తీసిన సినిమా థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

నాగచైతన్య యాక్టింగ్ సూపర్‌గా ఉంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంటాడు. ప్రీ క్లైమాక్స్‌లో నాగచైతన్య క్యారెక్టర్ గురించి పాకిస్థానీ పోలీసులు ఇచ్చే ఎలివేషన్ బాగుంది. వాడు రాడు ఎందుకంటే.. ప్రాంతం ఏదైనా ప్లేస్ ఏదైనా వాడు తండేల్ అనే డైలాగ్ అదిరిపోయింది. ఆ సీన్‌కు డీఎస్పీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వస్తాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తండేల్ సినిమా బాగుంది. మధ్యలో ఎమోషన్స్‌తో సాగదీశారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించేలా ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య సర్‌ప్రైజింగ్ ఫ్యాక్టర్‌గా అనిపించాడు. అతడు కెరీర్ బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు అని నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.

తండేల్ ఫస్టాఫ్ బాగుంది. స్క్రిప్టును పక్కాగా రూపొందించారు. నాగచైతన్య పెర్ఫార్మెన్స్ ప్రశంసనీయంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ఇతర డిపార్ట్‌మెంట్స్ పనితీరు చాలా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తండేల్ సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్టు ఈ సినిమాకు తోపులా అనిపించింది. ఎవరూ ఊహించని విధంగా ఎపిసోడ్ ఉంటుంది. పాటలు చాలా బాగున్నాయి. సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం తోపుగా ఉంది. నాగచైతన్య పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

తండేల్ మూవీ చూడటం ఇప్పడే ఫినిష్ అయింది. ఫస్టాఫ్ బాగుంది. ఈ సినిమా కోసం అనుసరించిన స్క్రీన్ ప్లే బబాగుంది. సాయిపల్లవి మరోసారి చాలా బాగా చేసింది. సెకండాఫ్‌లో ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. దేవీ శ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తండేల్ సినిమా చూశాను. ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంది. కానీ సెకండాఫ్ చాలా బాగుంది. రాజు, సత్యగా చైతన్య, సాయిపల్లవి ఇరుగదీశారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తండేల్ సినిమా ప్రీమియర్లు ప్రారంభానికి ముందు హీరో శ్రీ విష్ణు ట్వీట్ చేసి విష్ చేశారు. నాగచైతన్య అక్కినేని, సాయిపల్లవి, చందూ మొండేటి, డీఎస్పీ, ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీ వాసు, అల్లు అరవింద్ గారికి, ప్రతీ ఒక్కరికి విషెస్ తెలియజేస్తూ భారీ విజయం సాధించాలని కోరుకొంటున్నాను అని అన్నారు.

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేస్తూ.. నాగచైతన్య పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. తండేల్ సినిమా యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెస్ అని కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశారు.


నాగచైతన్య గారు.. తండేల్ సినిమా కోసం మీరు పెట్టిన శ్రమ, హార్డ్ వర్క్ అద్బుతం. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకొంటున్నాను. సాయిపల్లవి గారు ఈ ఇన్ క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ తెరపైన చూడటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. అరవింద్ గారు, బన్నీ వాసు, చందూ మొండేటి గారికి, డీఎస్పీ గారికి ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X