Thangalaan Review తంగలాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: విక్రమ్, మాళవిక మోహన్, పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్, సంపత్ రామ్ తదితరులు
రచన, దర్శకత్వం: పా రంజిత్
నిర్మాత: కేఈజీ రాజా, పా రంజిత్, జ్యోతి దేశ్ పాండే
సినిమాటోగ్రఫి: కే కిశోర్ కుమార్
ఎడిటింగ్: సెల్వా ఆర్కే
మ్యూజిక్: జీవి ప్రకాశ్ కుమార్
బ్యానర్: స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-08-15

అత్యంత ప్రాచీన గిరిజన తెగకు చెందిన తంగలాన్ అలియాస్ అరణ్య ( విక్రమ్) పేదరికంతో బాధపడుతూ ఆకలికి అలమటిస్తుంటారు. ఆ ప్రాంతంలో బంగారు నిల్వలు పుష్కలంగా ఉండటంతో వాటి కోసం అన్వేషిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఆ క్రమంలో భూస్వాములు ఆ విషయాన్ని గుర్తించి ఈ తెగను వేధింపులు గురి చేస్తుంటారు. వారి భూములను లాగేసుకొని వారిని కూలీలు, బానిసలుగా మారుస్తారు. అయితే భూమిపై హక్కు మనకే ఉందని తంగలాన్ ఆ ప్రాంత తెగను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో బంగారం నిల్వలు లభించడంతో బ్రిటీష్ వారు అత్యాశకుపోయి వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతూ.. విచక్షణా రహిత్యంగా కొడుతూ చంపుతుంటారు.

Thangalaan Movie Review in Telugu  Vikram s Acting excellence and Pa Rajinth taking take next level

ఓ మహిమ కలిగిన ఆ ప్రాంతంలోని బంగారు నిల్వలను రక్షించే బాధ్యతను అరణ్య, ఆరతికి ఎందుకు అప్పగించారు. ఇంతకు అరణ్య, ఆరతి ఎవరు? బంగారు నిల్వల కోసం పోరాటం చేసిన తన తాత స్పూర్తిని తంగలాన్ ఎలా తీసుకొన్నాడు? ఆటవిక ప్రాంతంలో నివసించే నాగవంశానికి చెందిన గిరిజన తెగను ఎలాంటి వివక్షకు గురి చేశారు. చివరకు బ్రిటిష్ వారిని దురాక్రమణలను ఎదురించి వారి హక్కులను ఎలా సాధించుకొన్నారనే కథనే తంగలాన్ సినిమా కథ.

బంగారం కోసం నదీ జలాల్లో, కాలువల్లో అన్వేషించే ఎమోషనల్ పాయింట్‌తో కథను చెప్పిన తీరు బాగుంది. తంగలాన్‌కు తన తాత చేసిన పోరాటం కలల రూపంలో కథను నేరేట్ చేసి తీరు పా రంజిత్ ప్రతిభకు అద్దం పట్టింది. ముతక జీవనం, మట్టి వాసన గుభాలించే ఈ కథను కొంత ఆర్టిస్టిక్ వేలో చెప్పడం వల్ల కనెక్ట్ కావడానికి ఇబ్బంది అవుతుంది. కథలోని ఇంటెన్సిటీని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఫస్టాఫ్ సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ.. స్టోరీలోని ఎమోషన్స్, ప్రజల తిరుగబాటు, ఆకలి బాధలు చూపించిన తీరు సినిమాను మరో లెవెల్‌కు మార్చేలా చేసింది. గిరిజన తెగ మహిళలు తొలిసారి రవికలు ధరించిన ఎపిసోడ్ ఫన్ క్రియేట్ చేసింది. చివర్లో యాక్షన్ సీన్లు, పాముల వేట, దున్నపోతు, క్రూరమృగాలను చంపే సీన్లు కథకు బలంగా మారాయి.

Thangalaan Movie Review in Telugu  Vikram s Acting excellence and Pa Rajinth taking take next level

అయితే తంగలాన్‌గా, అరణ్యగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో విక్రమ్ కనిపించారు. ఇక తన పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం విక్రమ్ కొత్తేమీ కాదు. కథలో ఎక్కడా విక్రమ్ కనిపించకుండా కేవలం తంగలాన్ మాత్రమే కనిపించేలా నటించడం ఈ సినిమాకు ఓ బ్యూటీ. ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడని పాత్రలో విక్రమ్ జీవించాడు. పార్వతి తిరువోత్తు రా, రస్టిక్ క్యారెక్టర్‌లో ఆకట్టుకొన్నది. ఆరతిగా మాళవిక మోహన్, పశుపతి, బ్రిటీష్ అధికారి క్లీమెంట్ క్యారెక్టర్లలో నటించిన వారంతా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగా పనితీరు విషయానికి వస్తే.. కే కిశోర్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఆటవిక ప్రాంతాన్ని, 5వ శతాబ్దం వాతావరణాన్ని అద్బుతంగా చిత్రీకరించడమే కాకుండా మూడ్‌ను క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఇక జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అని చెప్పాలి. ఆర్టిస్టిక్‌గా సాగే కథలోని సన్నివేశాలను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేసిన తీరు సినిమాకు అదనపు బలంగా మారింది. స్టూడియో గ్రీన్ ఎంచుకొన్న సబ్జెక్ట్, దానిని రిచ్‌గా తెరకెక్కించిన తీరు వారి ప్రమాణాలకు మించి ఉంది.

Thangalaan Movie Review in Telugu  Vikram s Acting excellence and Pa Rajinth taking take next level

కోలార్ మైన్స్‌లో బంగారం వెలికితీత సమయంలో ఆ ప్రాంతం గిరిజన, దళిత తెగలపై భూస్వాములు, బ్రీటీష్ వారి అరాచకాలను కళ్లకు కట్టి చూపించే ప్రయత్నంలో పా రంజిత్ సక్సెస్ అయ్యారు. ఎప్పటిలానే దళితవాదాన్ని వెండితెరపై బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే దళితులు గోమాసం, బీఫ్ ఎందుకు తినాల్సి వచ్చిందనే పాయింట్‌ను కన్విన్సింగ్‌గా చెప్పిన తీరు సినిమాలో హైలెట్‌గా నిలిచింది. మట్టివాసనతో గుభాలించిన తంగలాన్ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తక్కువేం లేవు. సింగిల్ పాయింట్‌తో నింపాదిగా సాగే ఈ సినిమాను కొంత సహనంతో చూడాల్సి ఉంటుంది. విభిన్నమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ వారాంతంలో థియేటర్‌లో చూడాలనుకొనే వారికి తంగలాన్ చక్కటి ఆప్షన్.

More from Filmibeat

Read more about: thangalaaan vikram pa ranjith
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X