Thank you movie review నాగచైతన్య పెర్ఫార్మెన్స్ తప్ప.. మిగితాది అంతా..!

Rating: 2.75/5

Recommended Video

Sorry, నేను థాంక్యూ మూవీ చూసి వచ్చాను - Thank You Movie రివ్యూ *Reviews | Telugu OneIndia

జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకొన్న తర్వాత అందుకు కారణమైన తన బాల్య స్నేహితులు, కాలేజ్, ఇతర సందర్భాల్లో తారసపడిన వ్యక్తులను ఓ వ్యక్తి వెతుక్కొంటూ వెళ్లి.. తన అనుభూతులను నెమరువేసుకొనే కథలతో సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రతీ చిత్రం ఒక కొత్త కోణంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. అలాంటి రీ యూనియన్ లాంటి కథతో వచ్చిన చిత్రం Thank You. ఫీల్, ఎమోషన్స్ లాంటి అంశాలతో పలు చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్, యువ హీరో నాగచైతన్య, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా రావడంతో ఏదో మ్యాజిక్ ఉంటుందనే అంచనా ఏర్పడింది. జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన థ్యాంక్యూ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేసిందనే విషయంలోకి వెళితే...

థ్యాంక్యూ కథ ఏమిటంటే?

థ్యాంక్యూ కథ ఏమిటంటే?


తల్లి చాటు ప్రేమలో పెరిగిన పేద కుటుంబానికి చెందిన అభిరామ్ హాకీ ప్రేయర్. తండ్రి కలను సాకారం చేయడానికి జాతీయ హాకీ జట్టుకు ఆడాలని కలలు కంటాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా హాకీని వదిలేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారి వైద్య అనే యాప్‌ను క్రియేట్ చేసి అమెరికాలో బిలియనీర్ అవుతాడు. తన ఎదుగుదలకు కారణమైన ప్రియతో సహజీవనం చేస్తుంటాడు. ఈ క్రమంలో తాను పెళ్లి ప్రపోజ్ చేయగా.. ప్రియ రిజెక్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతాడు.

 థ్యాంక్యూలో ట్విస్టులు ఇలా..

థ్యాంక్యూలో ట్విస్టులు ఇలా..


హాకీ నేషనల్ టీమ్‌కు ఆడాలని కలలు కన్న అభిరామ్ ఆ గేమ్‌ను ఎందుకు వదిలేశాడు? తండ్రి కలను మధ్యలోనే అభిరామ్ వదిలేయాల్సి వచ్చింది. అమెరికాలో తనకు ఆశ్రయం ఇచ్చిన కన్సల్టెంట్ రావు (ప్రకాశ్ రాజ్) మరణానికి అభిరామ్ ఎలా కారణమయ్యాడు? అభిరామ్‌ మ్యారేజ్ ప్రపోజల్‌ను ప్రియ ఎందుకు రిజెక్ట్ చేసింది. ప్రియ వదలేసి వెళ్లిన తర్వాత అభిరామ్ పరిస్థితి ఏమిటి? తన జీవితంలో పార్వతి ( మాళవిక నాయర్), చిన్ను (అవికా గోర్) ఎలాంటి పాత్ర పోషించారు? అభిరామ్‌పై పార్వతి తన ప్రేమను ఎందుకు త్యాగం చేసింది? అభిరామ్‌కు చిన్ను ఎలాంటి ప్రేరణను కలిగించింది? తన జీవితానికి ఆసరాగా, స్పూర్తిగా నిలిచిన వ్యక్తులకు అభిరామ్ ఎందుకు థ్యాంక్యూ చెప్పాలనుకొన్నాడు? తన జీవితంలో ఎవరెవరికి అభిరామ్ థ్యాంక్యూ చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే Thank You movie కథ.

థ్యాంక్యూ ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?

థ్యాంక్యూ ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే?


థ్యాంక్యూ మూవీ కథ.. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ నుంచి వైద్య సంస్థ అధినేతగా అభిరామ్ ఎలా మారాడనే అమెరికాలో అతడి జర్నీతో కథ మొదలవుతుంది. ప్రియతో లవ్ అఫైర్, రావు గారితో విభేదాలు లాంటి అంశాల గురించి అతిగా సాగదీయకుండానే.. తక్కువ సమయంలోనే అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రియతో బ్రేకప్ తర్వాత అభిరామ్‌లో ఆత్మ సంఘర్షణ మొదలవ్వడం ఈ సినిమాకు మేజర్ బ్రేక్ పాయింట్. అయితే ఆ పాయింట్‌ను ఎమోషనల్‌గా ఫ్లాష్ బ్యాక్‌కు కనెక్ట్ చేయలేకపోవడం మైనస్‌గా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో పార్వతితో ప్రేమ కథలో స్వచ్ఛత కనిపిస్తుంది. హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ లేకపోవడం వల్ల కథ అలా నింపాదిగా సాగినట్టు అనిపిస్తున్న సమయంలో మంచి ట్విస్టుతో తొలి భాగాన్ని ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచడం జరుగుతుంది.

క్లీన్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా

క్లీన్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా


ఇక సెకండాఫ్‌లో వైజాగ్ నేపథ్యంగా శర్వా (సాయి సుశాంత్) కాలేజ్‌ వైరుధ్యాలు, ఫైట్లు, ఆధిపత్యం లాంటి అంశాలతో సినిమాను యూత్‌కు కనెక్ట్ చేసే ప్రయత్నాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ చేశాడు. అయితే అంతగా ఎఫెక్టివ్‌గా లేకపోవడం వల్ల మళ్లీ అదే సాదాసీదాగా కథ సాగడంతో వైవిధ్యమైన, వినోదభరితమైన సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. ఇక క్లైమాక్స్‌లో శర్వా క్యారెక్టర్‌కు సంబంధించి చిన్న చిన్న ట్విస్టులు మినహాయిస్తే.. కూడా అంతా ఊహించినట్టే జరగడం వల్ల వావ్.. హమ్మయ్య అనే ఫీలింగ్ క్రియేట్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే ఎమోషన్స్ లేని ఓ క్లీన్ లవ్, యాక్షన్ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

దర్శకుడు మ్యాజిక్ మిస్

దర్శకుడు మ్యాజిక్ మిస్


దర్శకుడు విక్రమ్ కుమార్ అంటే.. ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్‌ను మేళవిస్తారనే మంచి అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అవే అంశాలను నమ్ముకొని మరోసారి విక్రమ్ మంచి పాయింట్‌తోనే ఫీల్‌గుడ్ మూవీని తెరకెక్కించే ప్రయత్నం జరిగిందనే అభిప్రాయం కలిగింది. ఎపిసోడ్ వారిగా చూసే సినిమా బాగానే ఉందనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్స్ కలిపి చూస్తే ప్యాకేజ్‌గా ఏదో కనెక్షన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతీ సినిమాలో ఉండే మ్యాజిక్ ఉండే ఈ సినిమాలో కూడా ఉంది. థ్యాంక్యూ విషయానికి వస్తే హై రేంజ్‌లో అది ఫైర్ కాలేదనిపిస్తుంది. కాకపోతే మరోసారి మంచి కథతో అన్ని వర్గాల చేరువయ్యే ప్రయత్నాన్ని థ్యాంక్యూ ద్వారా చేశారని చెప్పవచ్చు.

డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో నాగచైతన్య

డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో నాగచైతన్య


నాగచైతన్య అభిరామ్‌గా మరోసారి సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశాడని చెప్పవచ్చు. అభిరామ్ జర్నీలో మూడు ముఖ్యమైన ఎపిసోడ్‌లో గెటప్, బాడీ లాంగ్వేజ్, లుక్‌తో ఆకట్టుకొన్నాడు. ఎప్పటిలానే లవ్, యాక్షన్ సీన్లలో అలరించాడు. పాత్రతోపాటు ట్రావెల్ అవుతూ అభిరామ్‌గా పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకొంటాయి. చైతూకు ఇది మరో ప్రేమమ్ లాంటి సినిమానే తప్ప.. తన కెరీర్‌లో మరో విధంగా గొప్పగా హైలెట్ అయ్యే సినిమా మాత్రం కాకపోవచ్చు. అభిరామ్ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశాడని చెప్పవచ్చు.

రాశీఖాన్నా, మాళవిక, అవికో గోర్ పాత్రలు

రాశీఖాన్నా, మాళవిక, అవికో గోర్ పాత్రలు


ప్రియ చుట్టే కథ తిరిగినట్టు అనిపిస్తుంది కానీ.. ఆ రోల్ పెద్దగా ఎలివేట్ కాకపోవడం, కథలో ఆ పాత్ర ట్రావెల్ ఎఫెక్టివ్‌గా లేకపోవడం క్యారెక్టర్‌పరంగా రాశీఖాన్నా మైనస్. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అనే యువతి పాత్ర భారంగాను, ఎమోషన్స్‌ను పండించడానికి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ ప్రియది. కానీ కథ పరంగా ఆ స్కోప్ కనిపించకపోవడం వల్ల రాశీఖాన్నా బ్యాక్ సీట్‌లోకి వెళ్లిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రకాశ్ రాజ్, ఈశ్వరీరావు, తులసి ఉన్నంత సేప్ భావోద్వేగానికి గురిచేస్తారు. సెకండాఫ్‌లో సాయి సుశాంత్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకొంటాడు. ఫస్టాఫ్‌లో మాళవిక, సెకండాఫ్‌లో అవికా గోర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌గా నిలిచారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. థ్యాంక్యూ సినిమాకు అసలు సిసలైన హీరో పీసీ శ్రీరాం. ప్రతీ ఫ్రేమ్‌ను అద్బుతంగా తీర్చిదిద్దాడు. అమెరికాలో నగరాన్ని ఎంత అద్బుతంగా చూపించాడో.. ఏపీలోని పల్లెటూరుకు సంబంధించిన సీన్లను కూడా అదే అద్బుతంగా చిత్రీకరించారు. ఇటీవల కాలంలో సక్సెస్ జోరును కొనసాగిస్తు్న తమన్ థ్యాంక్యూ సినిమా విషయంలో నిరాశను కలిగించాడు. సెకండాఫ్‌లో ఫేర్‌వేల్ సాంగ్‌తో పూర్తిగా డిజాపాయింట్ చేయడమే కాకుండా మరో ఇంటర్వెల్‌ ఛాన్స్ ఇచ్చాడనిపించాడు. ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాయికి తగినట్టే నిర్మాణ విలువలు ఉన్నాయి. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే ఈ బ్యానర్‌లో మరో మంచి సినిమా అవ్వడానికి ఛాన్స్ ఉండేది.

ఫైనల్‌గా సినిమా పరిస్థితి ఇలా..

ఫైనల్‌గా సినిమా పరిస్థితి ఇలా..


ప్రతీ మనిషి జీవితంలో డిఫరెంట్ టైమ్ పిరియడ్‌లో అనుభూతులు, అనుభవాలను గుర్తు చేసే సినిమా Thank You. ఇలాంటి సినిమాలకు హయ్యెస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఎమోషన్స్. థ్యాంక్యూ విషయానికి వస్తే హృదయాన్ని భావోద్వేగానికి గురిచేసే అంశాలు లేకపోవడం మైనస్. అయితే ప్రేక్షకుల మనసులను దోచుకొనేంతగా థ్యాంక్యూ ఫెంటాస్టిక్ మూవీ కాదు. సేమ్ టైమ్ బ్యాడ్ మూవీ కాదు. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ కలిసి థియేటర్‌లో చూడటానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. కమర్షియల్‌గా ఎలాంటి సక్సెస్ అందుకొంటుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు


పాజిటివ్ పాయింట్స్
నాగచైతన్య ఫెర్ఫార్మెన్స్
పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి
ప్రొడక్షన్ వ్యాల్యూస్

మైనస్ పాయింట్స్
రొటీన్, రెగ్యులర్ కథ
ఆకట్టుకోని కథనం
ఎంటర్‌టైనింగ్‌గా లేకపోవడం
ఎమోషనల్‌గా ఆకట్టుకోలేకపోవడం

థ్యాంక్యూలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

థ్యాంక్యూలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: నాగచైతన్య, రాశీఖన్నా, ప్రకాశ్ రాజ్, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, తులసి, ఆర్జే హేమంత్ తదితరులు
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: విక్రమ్ కుమార్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
కథ: బీవీఎస్ రవి
డైలాగ్స్: వెంకట్ఓ డీ పాటి, మిథున్ చైతన్య
సినిమాటోగ్రఫి: పీసీ శ్రీరాం
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: తమన్ ఎస్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2022-07-22

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X