ఫర్వాలేని కామెడీ చిత్రం!

By Staff

 Thank you Subbarao
- జలపతి
చిత్రం: థాంక్యూ సుబ్బారావు
నటీనటులు: శ్రీహరి, ప్రకాష్‌ రాజ్‌, అభిరామి, ఎల్బీశ్రీరాం
మాటలు: మరుధూరి రాజా
నిర్మాత: కె.చంద్రశేఖర్‌
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

శ్రీహరి తన యాక్షన్‌ హీరో ఇమేజ్‌ మార్చుకునేందుకు చేసిన కామెడీ చిత్రం ఇది. పాటలు లేకుండా పూర్తిస్థాయి కామెడీ చిత్రం రూపొందించడం ఒక విధంగా ప్రయోగం. కంప్లీంట్‌ గా ఈ సినిమా కామెడీ. ఇవివి సత్యనారయణ శ్రీహరిని కామెడీ హీరోగా ఎస్టాబ్లిష్‌ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అందులో పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయారు. మాటలు, కొన్ని సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఐనా చిత్రం పూర్తిగా వినోదాన్ని కలిగించలేకపోయింది. ప్రధాన కారణం- శ్రీహరి నటనే. శ్రీహరి సీరియస్‌ గా ఉంటూ నవ్వించడం దర్శక, రచయితలు ఒక కొత్త పద్దతి అనుకోవచ్చు. కానీ అది సరిగా పండలేదు.

శ్రీహరి తన పద్దతి ప్రకారమే నటించడం, కామెడీకి అవసరమైన మాడ్యులేషన్‌ లేకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం. దీంతో పాటు, ఇవివి సత్యనారయణలో అప్పుల అప్పారావు, హలోబ్రదర్‌ టైప్‌ కామెడీ టచ్‌ ఇందులో లేదు. చాలావరకు పాత టైపు జోకులే. మరుధూరి రాజా డైలాగ్‌ లే ఈ చిత్రానికి ప్రాణం. అవే ఈ చిత్రంలో నవ్విస్తాయి.

శ్రీహరి నిరుద్యోగి. ఏజ్‌ బారవడంతో ఉద్యోగం దొరకదు. ఆ సమయంలో ఓ ప్రైవేట్‌ డిటక్టివ్‌ ఏజెన్సీ పెడుతాడు. ప్రకాష్‌ రాజ్‌, శ్రీహరికి ఒక పని అప్పచెప్పుతాడు. అభిరామిని తాను పెళ్ళిచేసుకోబోతున్నాని, తన గురించి పూర్తిగా తెలుసుకొని ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలని కోరుతాడు. ఇది సీక్రెట్‌ గా ఉంచాలని చెప్పుతాడు. సో..శ్రీహరి ఆ పని మీదే ఉంటాడు. కానీ అతను అభిరామి ప్రేమలో పడిపోతాడు. అందుకని అభిరామి మంచది కాదనీ చెప్పుతాడు. వీరిద్దరి పెళ్ళి కాకుండా చూసేందుకు శ్రీహరి చేసే ప్రయత్నాలే ఈ చిత్రంలోని కామెడీకి వస్తువు.

కానీ అసలు విషయం ఏమిటంటే- అభిరామి, ప్రకాష్‌ రాజు ఇద్దరు భార్యభర్తలు. మనస్పర్ధల వల్ల వీరిద్దరూ విడిపోతారు. ఆ విషయం తెలిసిన తర్వాత శ్రీహరి వీరిని కలపడంతో సినిమా ముగుస్తుంది. శ్రీహరి మాస్‌ యాక్షన్‌ చిత్రాల నుంచి ఇంకా బైటపడలేదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం బాగా చేశాడు. ఇక ప్రకాష్‌ రాజు నటన బాగానే ఉంది. అభిరామి డిగ్నిఫైడ్‌ గా నటించింది. ఎల్బీశ్రీరాం, కుక్క పాత్ర కామెడీ బాగుంది. పాటలు లేకుండా ఈ చిత్రం తీయడం నిజంగానే ప్రయోగం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X