For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tharagathi Gadhi Daati Web Series reveiw.. ఫీల్‌గుడ్ టీనేజ్ లవ్ స్టోరీ!

  |

  థియేటర్లకు సమాంతరంగా ఓవర్ ది టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ వినోదాన్ని అందిస్తున్న నేపథ్యంలో దర్శకులు, రచయితలకు వినూత్నమైన ఆలోచనలు, సృజనాత్మకత కూడిన కంటెంట్‌ చేస్తున్న ప్రయోగాలు సత్పలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు యువ ఫీల్మ్ మేకర్లు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. ఆ కోవలోనే తాజాగా ఆహా ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ తరగతి గది దాటి. నలుగురు ఇంటర్మీడియెట్ స్టూడెంట్ జీవితంలో జరిగిన భావోద్వేగమైన సంఘర్షణకు రూపంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే

  తరగతి గది దాటి కథ ఏమిటంటే

  తరగతి గది దాటి కథ ఏమిటంటే

  రామ్, మధు, కృష్ణ ఒకే ట్యుటోరియల్‌లో చదువుకొనే స్నేహితులు. అనుకోకుండా ట్యుటోరియల్ ఓనర్ కుమారుడు కృష్ణ ఆలియాస్ కిట్టూ జాస్మిన్ అమ్మాయిని చూసి ఇష్టపడుతాడు. అయితే అదే ట్యుటోరియల్‌కు ట్యూషన్‌కు రావడంతో జాస్మిన్‌కు దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో జాస్మిన్, కిట్టుకు మధ్య అపార్దాలు చోటు చేసుకొంటాయి.

   తరగతి గది దాటిలో ట్విస్టులు

  తరగతి గది దాటిలో ట్విస్టులు

  జాస్మిన్‌తో కిట్టుకు ఎందుకు విభేదాలు చోటుచేసుకొంటాయి? జాస్మిన్‌, కిట్టుకు మధ్య అపార్ధం రావడానికి కారణం ఏమిటి? జాస్మిన్, కిట్టును కలిపేందుకు రామ్, మధు ఏం చేశారు? తనను ఇష్టపడిన కిట్టుపై జాస్మిన్ ప్రేమను కురిపించిందా అనే ప్రశ్నలను గణిత శాస్త్రంతో ముడిపెట్టి చెప్పిన కథనే తరగతి గది దాటి.

  దర్శకుడి, ప్రతిభ, టేకింగ్

  దర్శకుడి, ప్రతిభ, టేకింగ్

  దర్శకుడు మల్లిక్ రామ్ తాను ఎంచుకొన్న పాయింట్‌‌ను మంచి కథ, కథనాలుగా మార్చడంలోను సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. చిన్న కథను హృదయానికి టచ్ చేసేలా చెప్పడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. కాలేజీ, క్లాసుల్లో జరిగే సినిమాలు చాలానే చూసి ఉంటాం. ట్యూషన్ తరగతి గది దాటి కథలు పెద్దగా పుట్టలేవు. ఆ ప్రయత్నం చేసి మల్లిక్ రామ్ ఆకట్టుకొన్నారు. సాధారణంగా స్కూలు, కాలేజీ క్లాస్లుల్లో జరిగే వ్యవహారాల కంటే ట్యూషన్లలో టీనేజ్ యువకుల్లో జరిగే హృదయ సంఘర్షణను దర్శకుడు గట్టిగానే ఒడిసి పట్టుకొన్నాడని చెప్పవచ్చు. టీనేజ్ యువతీ, యువకుల్లో అప్పుడే మొగ్గ తొడిగే ప్రేమను అశ్లీలత, అసభ్యతకు చోటు లేకుండా ఫ్యామిలీ మొత్తం చూడదగిన విధంగా తెరక్కించినందుకు అభినందించాల్సిందే.

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  ఇక రామ్‌గా హర్షిత్ రెడ్డి, మధుగా స్నేహ కామత్, కృష్ణగా నిఖిల్ దేవాదుల, జాస్మిన్‌గా పాయల్ రాధాకృష్ణ ఎవరికి వారే తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలాంటి తడబాటు లేకుండా చాలా సహజంగా నటించారు. క్లాసు రూమ్‌లో బిహేవ్ చేసిన మాదిరిగా కెమెరా ముందు కనిపించారు. హర్షిత్ రెడ్డి రామ్‌ పాత్రలో ఒదిగిపోయి హ్యాపీడేస్‌లోని నిఖిల్‌ను గుర్తు చేశారు. మధుగా స్నేహ కంపోజ్డ్‌గా నటించింది. కిట్టుగా నిఖిల్ ఎమోషన్స్ పండించడంతో మంచి ఈజ్ కనబరిచారు. ఇక కిట్టుకు తండ్రిగా తనికెళ్ల భార్గవ్ లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్ అంటూ ఈ వెబ్ సిరీస్‌కు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారారు. ఇక 30 వెడ్స్ 21లో కార్తీక్‌గా క్లీన్ కామెడీతో ఆకట్టుకొన్న మహేంద్ర మరోసారి తన కామెడీ టైమింగ్‌ను రుచి చూపించారు.

  సాంకేతిక అంశాలు..

  సాంకేతిక అంశాలు..

  సాంకేతిక విభాగంలో మనీష్ భూపతిరాజు అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరు వాతావరణం, సముద్ర తీరం అందాలు, నటీనటులు హావభావాలను చక్కగా కెమెరాలో బంధించారు. ఆద్యంతం, ఎమోషన్స్‌, ఫీల్‌గుడ్‌గా సాగే సీన్లను తన మ్యూజిక్, రీరికార్డింగ్‌తో నరేన్ ఆకట్టుకొన్నాడు. కిట్టు విస్పాప్రగడ అందించిన డైలాగ్స్ వెబ్ సిరీస్‌కు స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటర్‌గా వినయ్, ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. వెబ్ సిరీస్ అంటే క్రైమ్, హారర్, అశ్లీలత, అసభ్యత అనే విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలంటే భయపడుతున్న ప్రస్తుత రోజుల్లో తరగతి గది దాటి వెబ్ సిరీస్‌ను ఉత్తమ విలువలతో నిర్మాత: అరుణబ్ కుమార్ అందించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

   ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  తరగతి గది దాటి వెబ్ సిరీస్ అందర్ని మెప్పించే ఫీల్‌గుడ్ టీనేజ్ లవ్ స్టోరి. ఓహో చెలియా నా ప్రియ సఖియా, ఈనాడే ఏదో అయ్యింది, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, నువ్వక్కడ, నేనిక్కడ అంటూ ఐదు భాగాలు ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రతీ ఒక ఎపిసోడ్ కేవలం 30 నిమిషాల్లోపే నిడివి ఉంది. వినోదం, భావోద్వేగం, కొంత అల్లరి, చిన్న సెంటిమెంట్‌తో సాగదీయకుండా మంచి ఫీలింగ్ కలిగించేలా ఉంటుంది. వీకెండ్‌లో తీరిక చేసుకొని ఫ్యామిలీ అంతా చూసే వెబ్ సిరీస్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.

  Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు
  నటీనటులు: హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల, స్నేహ కామత్, తనికెళ్ల భార్గవ్, మహేంద్ర తదితరులు
  దర్శకత్వం: మల్లిక్ రామ్
  నిర్మాత: అరుణబ్ కుమార్
  సినిమాటోగ్రాఫర్: మనీష్ భూపతిరాజు
  మ్యూజిక్ డైరెక్టర్: నరేన్ ఆర్కే సిద్దార్థ
  డైలాగ్స్: కిట్టు విస్పా‌ప్రగడ
  స్క్రీన్ ప్లే సహకారం: ప్రణీత్ ప్రత్తిపాటి
  ఎడిటర్: వినయ్
  ఓటీటీ రిలీజ్: ఆహా యాప్

  English summary
  Tharagathi Gadhi Daati Web Series reveiw: AHA's OTT aap's latest web series Tharagathi Gadhi Daati is feel good teenage love story. Director, actors team effort made magic on the screen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X