The Ba***ds Of Bollywood First Review: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ రివ్యూ అండ్ రేటింగ్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Ba***ds of Bollywood). యాక్షన్, కామెడీ, సెటైరికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆర్యన్ ఖాన్ తల్లి గౌరీ ఖాన్ స్వయంగా నిర్మించారు. ఈ సిరీస్‌లో బాబీ డియోల్, లక్ష్య లల్వానీ, సాహెర్ బాంబా, మోనా సింగ్, అన్యా సింగ్, గౌతమీ కపూర్, అర్షద్ వార్సీ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ గురించి క్రిటిక్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

ఈ సిరీస్‌లో తమన్నా భాటియా, షారుక్ ఖాన్, గౌరీ ఖాన్, సుహానా ఖాన్, సాజిద్ నాడియాడ్ వాలా, ఇమ్రాన్ హష్మీ, అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అమీర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, ఆలియాభట్ తదితరులు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సిరీస్‌కు జయ్ పినాక్ ఓజా సినిమాటోగ్రఫి, నితిన్ బేద్ ఎడిటర్‌గా వ్యవహరించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందించారు.

The Ba   ds Of Bollywood Review

ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సిరీస్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సిరీస్‌ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వెబ్ మూవీకి మంచి రెస్పాన్స్ కూడా వస్తున్నది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌ ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీన ముంబైలో భారీగా ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ ప్రీమియర్‌కు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో యాక్టర్, క్రిటిక్ కుల్దీ్ గడ్వీ తన రివ్యూను అందించారు. ఈ సిరీస్‌పై ఆయన సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందించాడు.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ చూశాను. అద్బుతమైన అనుభూతిని అందించింది. ఆర్యన్ ఖాన్ తన టాలెంట్‌తో మ్యాజిక్ చేశాడు. ఆన్ స్క్రీన్ మీద తుఫాన్ క్రియేట్ చేశావు. నేను ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన సిరీస్‌లో నీవు తిసిన సిరీస్ ది బెస్ట్. ఈ సిరీస్ చూసిన తర్వాత మాటల్లేవ్. స్టోరీ అదిరిపోయింది. బాలీవుడ్ చరిత్రను, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కగా చూపించావు. మార్వలెస్‌గా ఉంది అని కుల్దీప్ గాడ్వీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌ సిరీస్‌లో బాబీ డియోల్, మనోజ్ పహ్వా, గౌతమ్ కపర్, రాఘవ్ జుయల్ తమ పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్ స్పెషల్ ఎంట్రీ సిరీస్‌ను మరింత ఎలివేట్ చేసి నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ సిరీస్‌కు నా రేటింగ్ 5/5. తప్పకుండా చూడండి.. మిస్ చేసుకోవద్దు అని కుల్దీప్ తన పోస్టులో తెలిపారు.

More from Filmibeat

Read more about: aryan khan shah rukh khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X