twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Baker & The Beauty Review : ఆకట్టుకున్న క్యూట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

    |

    Rating: 2.75/5

    ఈ మధ్యకాలంలో తెలుగు వెబ్ సిరీస్ లు కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి వచ్చేస్తున్నాయి. అయితే పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ఆహాలో విడుదలైన ది బేకర్ అండ్ ది బ్యూటీ వెబ్ సిరీస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆహాలో విడుదల చేసే అన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్ విషయాలకు వస్తే గట్టిగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఎందుకో తెలియదు కానీ ఈ సిరీస్ విషయంలో అంత స్థాయి ప్రమోషన్స్ కనిపించలేదు. అయితే హీరోగా వరస సినిమాలు చేస్తున్న సంతోష్ లీడ్ రోల్ లో నటించడం బుల్లితెర సెన్సేషన్ విష్ణుప్రియ ఇందులో ఒక భారీ రోల్ చేయడంతో ఈ వెబ్ సిరీస్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది లేదా అనేది తెలుసుకుందాం

    ది బేకర్ అండ్ ది బ్యూటీ కథ ఏంటంటే?

    ది బేకర్ అండ్ ది బ్యూటీ కథ ఏంటంటే?

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఐరా వాసిరెడ్డి బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడుతుంది. అయితే రెండేళ్ల రిలేషన్షిప్ తర్వాత ఆమె అతనితో విడిపోయి మళ్లీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. అదే సమయంలో విజయ్(సంతోష్ శోభన్) తన తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) బేకరీలో పనిచేస్తూ అమ్మ (ఝాన్సీ) సూపర్ మార్కెట్ విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటూ తనకు ఇష్టమైన పెయింటింగ్స్ గీసుకుంటూ సాదాసీదా జీవితం గడిపేస్తుంటాడు.

    అతని గర్ల్ ఫ్రెండ్ మహేశ్వరి(విష్ణు ప్రియ) తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరిన సమయంలో అనుకోకుండా ఐరాతో విజయ్ కు పరిచయం ఏర్పడుతుంది. మిడిల్ క్లాస్ కుర్రాడికి ఒక హీరోయిన్ తో పరిచయం ఏర్పడడమే గొప్ప అనుకుంటే వారిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ కూడా పుడుతుంది, అయితే చివరికి ఏం జరిగింది ? విజయ్ ఐరా కలుస్తారా? లేక విజయ్ మహేశ్వరిని పెళ్లి చేసుకుంటాడా అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

    ది బేకర్ అండ్ ది బ్యూటీలో ట్విస్టులు

    ది బేకర్ అండ్ ది బ్యూటీలో ట్విస్టులు

    ఒకరకంగా ఈ సిరీస్ లో పెద్ద ట్విస్టులు ఊహించలేము, కానీ జరగబోయేది ఇదే అని మనం అనుకున్న ప్రతిసారి దర్శకుడు మనల్ని మాయ చేసే ప్రయత్నం చేశాడు, ఒకరకంగా ఏ మాత్రం ఊహించని విధంగా జరగబోయే విషయాలు ఆసక్తికరంగా చూపిస్తూ పెద్ద ట్విస్టులు లేకుండానే ప్రతి చిన్న విషయాన్ని ట్విస్ట్ చేస్తూ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా రూపొందించారు.

    అసలు ఐరా విజయ్ తో ఎలా ప్రేమలో పడుతుంది ? ఆమె మేనేజర్ లక్ష్మి వీరిద్దరి ప్రేమను విడదీయడానికి ఏం చేశాడు ? విజయ్ చేతిలో మోసపోయాను అని భావించిన మహేశ్వరి లక్ష్మీతో చేతులు కలిపి ఏం చేసింది? చివరికి విజయ్ కలిసారా లేదా ? అనే సంఘటనల సమాహారమే ఈ వెబ్ సిరీస్.

    దర్శకుడి డీలింగ్ ఎలా ఉందంటే

    దర్శకుడి డీలింగ్ ఎలా ఉందంటే

    తెలుగు ప్రేక్షకులకు జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే పేరు చాలా కొత్తగానే ఉంది ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు అనే విషయాలు తెలియవు కానీ ఈ వెబ్ సిరీస్ ని డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకునే విధంగా సాగింది. అయితే ఒక సినిమా చేయదగ్గ కథతో వెబ్ సిరీస్ చేయడం వలన కాస్త లాగ్ వచ్చిన ఫీలింగ్ ఫీల్ అవుతాం.

    కానీ ఈ లైన్ తీసుకుని కూడా ఒక వెబ్ సిరీస్ చేయొచ్చు అనుకొన్న దర్శకుడి ఆలోచన మెచ్చుకుని తీరాల్సిందే. ఒక సినిమాకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈ వెబ్ సిరీస్ ని దర్శకుడు రూపొందించాడు అని చెప్పక తప్పదు, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం కావడంతో ఎక్కడా కూడా తగ్గకుండా వెబ్ సిరీస్ ని రూపొందించారు.

     లీడ్ యాక్టర్స్ విషయానికి వస్తే

    లీడ్ యాక్టర్స్ విషయానికి వస్తే

    ఈ సిరీస్ లో లీడ్ యాక్టర్స్ గా నటించిన సంతోష్ శోభన్, టీనా శిల్ప రాజ్, విష్ణు ప్రియ ఈ ముగ్గురు కూడా చాలా సహజంగా నటించారు, ఎక్కడా మనం ఒక వెబ్ సిరీస్ చూస్తున్న భావన కలగదు ఎక్కడో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లను కళ్ళ ముందే చూస్తున్నామనే భావన కల్పించారు. సినిమాల్లో హీరోగా రాణిస్తున్న సంతోష్ శోభన్ చాలా సహజమైన నటనతో మిగతా అందరినీ డామినేట్ చేశాడు అని చెప్పవచ్చు.

    ఒక కన్ఫ్యూజన్ తో ఉండే మిడిల్ క్లాస్ కుర్రాడు క్యారెక్టర్లో సంతోషం ఒదిగిపోయి నటించిన తీరు ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. లేడీ లీడ్ యాక్టర్స్ గా నటించిన టీనా శిల్ప రాజ్, విష్ణు ప్రియ కూడా చాలా సహజంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు అని చెప్పవచ్చు.

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    ఇక ఈ సిరీస్ లో నటించిన మిగతా నటీనటులు శ్రీకాంత్ అయ్యంగార్, వెంకట్, ఝాన్సీ, సాయి శ్వేతా మొదలైనవారు కూడా తనదైన మార్కు వేసుకునే ప్రయత్నం చేశారు. వెంకట్ కి చాలా కాలం తర్వాత మంచి రోల్ దొరికినట్లైంది. హీరోయిన్ మేనేజర్ అంటే ఇలాగే ఉంటారేమో అని సాధారణ ప్రేక్షకులు భావించే విధంగా వెంకట్ నటించాడు. శ్రీకాంత్ కూడా చాలా సహజంగా నటించగా ఝాన్సీ చాలా కాలం తర్వాత మరో మంచి రోల్ చేశారు ఇక సాయి శ్వేతా నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    అమ్మాయిలను ఇష్టపడుతున్నాను అనే విషయాన్ని తన కుటుంబానికి చెప్పాల్సిన సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులకు నచ్చే తీరుతుంది. మరో ముఖ్యమైన నటుడి గురించి చెప్పాలి. అతనే సంతోష్ రియల్ తమ్ముడు సంగీత్, నిజ జీవితంలో ఎలా ఉంటాడో సిరీస్లో కూడా అలాగే నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇద్దరికీ కూడా చాలా దగ్గరగా ఉండడంతో అతనికి బాగా కలిసి వచ్చింది.

    అయితే టెక్నికల్ విషయానికి వస్తే

    అయితే టెక్నికల్ విషయానికి వస్తే

    ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం ది బేకర్ అండ్ ది బ్యూటీకు స్పెషల్ అట్రాక్షన్. కథను మరింత ఆహ్లాదంగా మలచడంలో, ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయడానికి ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ అందించిన డైలాగ్స్, సాహిత్యం ఈ వెబ్ సిరీస్ కు అదనపు ఆకర్షణ. చాలా కంట్రోల్‌గా, భావోద్వేగంతో ఉన్న డైలాగులు ప్రేక్షకులను మరింత ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఇది వెబ్ సిరీస్ కాబట్టి కొన్ని కొన్నిచోట్ల సీన్స్ లాగ్ అనిపిస్తాయి.

    ఫైనల్ గా చెప్పాలంటే

    ఫైనల్ గా చెప్పాలంటే

    మన తెలుగు వెబ్ సిరీస్ ల సంగతి పక్కనపెడితే హిందీ వెబ్ సిరీస్ అన్నీ క్రైమ్, అశ్లీలత, అసభ్యతో మునిగిపోయి ఉంటున్నాయి అనుకుంటున్న నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ చాలా క్లీన్ గా అనిపించింది అని చెప్పవచ్చు. ఒక సినిమా హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మధ్య ప్రేమ కథ చాలా హృద్యంగా చూడచక్కగా అదేదో మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల సమాహారమా అని అనిపిస్తుంది. ఈ వీకెండ్లో బింగే వాచ్ చేయాల్సిన వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఆహా యాప్ లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకండి మరి.

    Recommended Video

    Shabeer Kallarakkal As dancing rose is the latest social media sensation.
    నటీనటులు

    నటీనటులు

    సంతోష్ శోభన్, విష్ణు ప్రియ, టీనా శిల్ప రాజ్, వెంకట్, సంగీత్ శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఝాన్సీ, సాయి శ్వేత తదితరులు
    కథ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ : జోనాథన్ ఎడ్వర్డ్స్
    ప్రొడక్షన్ కంపెనీ : అన్నపూర్ణ స్టూడియోస్
    సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
    సినిమాటోగ్రాఫర్ : సురేష్ రగుతు
    ఎడిటింగ్ : నాగేశ్వర రెడ్డి బొంతల
    రిలీజ్ డేట్ : 10 సెప్టెంబర్ 2021
    రిలీజ్ ఓటీటీ : ఆహా యాప్

    English summary
    "The Baker and the Beauty" starring young hero Santosh Shobhan and Tina Shilparaj is being streamed on Aaha from today on the occasion of Vinayaka Chaviti. How is the web series? How many marks did the audience put up.? Let's see in this review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X