The Birthday Boy Review ది బర్త్ డే బాయ్ మూవీ రివ్యూ

Rating: 2.75/5

నటీనటులు: ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు
దర్శకత్వం: విస్కి
నిర్మాత: ఐ.భ‌ర‌త్‌,
డీఓపీ : సంకీర్త్ రాహుల్‌,
సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి,
ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా,
సింక్ సౌండ్ డిజైన్‌:సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి,
సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌,
మేక‌ప్ చీఫ్‌: వెంక‌ట్ రెడ్డి,
డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో
బ్యానర్: బొమ్మ బొరుసా ప‌తాకం
రిలీజ్ డేట్: 2024-07-18

బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి (మణి, వెంకీ, రాజా అశోక్, అరుణ్,రాహుల్) ఐదుగురు స్నేహితులు. అమెరికాలో చదువుకొనే స్టూడెంట్స్. బాలు బర్త్ డే కావడంతో సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ బర్త్ డే పార్టీలో పీకల దాక తాగి.. బాలుపై శృతిమించి దాడి చేస్తారు. ఆ నేపథ్యంలో బాలు (మణి) చనిపోతాడు. దాంతో నలుగురికి ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోతారు. దాంతో అర్జున్ (వెంకీ) సోదరుడైన లాయర్ భరత్ (రవికృష్ణ)ను పిలుస్తారు. అయితే క్రమంలో బాడీని మాయం చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇండియా నుంచి బాలు తల్లిదండ్రులు (ప్రమోదిని, రాజీవ్ కనకాల) ఇద్దరు అమెరికాకు వస్తారు.

The Birthday Boy Movie Review in Telugu

స్నేహితుల దాడి వలన బాలు చనిపోయాడా? బాలు డెడ్ బాడీని ఎలా మాయం చయాలనుకొన్నారు? బాలు మరణాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు? నలుగురు స్నేహితులపై బాలు తండ్రి రియాక్షన్ ఏమిటి? బాలు శవాన్ని చివరకు ఏం చేశారు? అర్జున్ సోదరుడు భరత్ లాయర్‌గా ఎలాంటి వ్యూహాన్ని రచించాడు? చివరకు బాలు శవాన్ని ఏం చేశారు అనేది సినిమా కథ.

ది బర్త్ డే బాయ్ సినిమా కథ, కథనాల విషయానికి.. బర్త్ డే పార్టీకి సంబంధించిన ఎన్విరాన్ మెంట్‌ను ఓ పాటతో ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ విస్కి ఎలాంటి సుత్తి లేకుండా నేరుగా కథలోకి వెళ్లాడు. బాలు క్యారెక్టర్‌ను డెడ్ బాడీగా మార్చిన తర్వాత పండించిన డ్రామా, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక రవికృష్ణ, సమీర్ మళ్లా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టోరీ నరేషన్ మరో జోన్‌లో వెళ్లడంతో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక డెడ్ బాడీ చుట్టు కథను నడిపించి..ఫ్యామిలీ ఎమోషన్స్‌తో డ్రామా పడించిన తీరు బాగుంది.

ఇక సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు బాగా వర్కువుట్ అయ్యాయి. అయితే కొన్ని సీన్లు చాలా స్లోగా ఉండటంతో కథా వేగానికి కొంత బ్రేక్ వేసినట్టు అనిపించాయి. ఇక ప్రమోదిని, రాజీవ్ కనకాల ఎంట్రీ తర్వాత సినిమా మరో జోన్‌లోకి వెళ్లిందనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్వీస్టులు, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుడిని కట్టిపడేలా ఉంటుంది. చివరి 20 నిమిషాలు కథను నడిపించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టాయి.

The Birthday Boy Movie Review in Telugu

టెలివిజన్, బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, రాజీవ్ కనకాల మాత్రమే ఈ సినిమాలో తెలిసిన నటులు. మిగితా పాత్రల్లో అంతా కొత్త వాళ్లే.. అయితే వారెప్పుడూ.. ఏ సీన్‌లో కూడా తడబాటు లేకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయి సినిమాకు ప్లస్‌గా మారారు. రవికృష్ట తన క్యారెక్టర్‌ను పూర్తిస్థాయిలో పండించాడు. సీరియస్, ఎమోషనల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇక రాజీవ్ కనకాల కనిపించేది చాలా కొన్నిసీన్లే అయినా తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ప్రతీ పాత్ర ఈ సినిమాకు స్సెషల్ ఎట్రాక్షన్ చెప్పాలి.

ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ స్పెషల్ ఎట్రాక్షన్. సంకీర్త్ రాహుల్ చాలా సీన్లను బాగా ఎలివేట్ చేశారు. ఇక ప్రశాంత్ శ్రీనివాస్ తన మ్యూజిక్‌తో సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చాడు. నిర్మాత భరత్, బొమ్మ బొరుసా పతాకం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వారు ఎంచుకొన్న కథ, సినిమాను తెర మీద అందించిన విధానం సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజెప్పింది.

ఇక బర్త్ డే బాయ్ యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగి ఉన్న మర్డర్ మిస్టరి. ఈ సినిమాలో పాత్రలను డిజైన్ చేసిన తీరు ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే తో కథను గ్రిప్పింగ్‌గా చెప్పిన విధానం బాగుంది.ఈ సినిమాకు సంబంధింనంత వరకు సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక పక్కాగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా ఇది. వాస్తవ సంఘటనలో రూపొందిన ఈ చిత్రాన్ని సినిమా లవర్స్ ఓ సారి థియేటర్‌లోనే చూడొచ్చనేది నా అభిప్రాయం.

More from Filmibeat

Read more about: the birth boy ravi krishna whisky
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X