The Devil First Review: ది డెవిల్ ఫస్ట్ రివ్యూ
కన్నడ సినిమా పరిశ్రమలో మోస్ట్ కాంట్రవర్షియల్ స్టార్ హీరో దర్శన్ నటించిన తాజా చిత్రం ది డెవిల్. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న సమయంలో ఈ చిత్రం విడుదల కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. వైష్ణో స్టూడియోస్, జై మాతా కంబైన్స్ బ్యానర్లపై దర్శకుడు ప్రకాశ్, జే జయమ్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచన రాయ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మాండ్రే, శోభరాజ్, తులసి శివమణి తదితరుల కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినమిాకు సుధాకర్ ఎస్ రాజ్ సినిమాటోగ్రఫిని, బీ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ను అందించారు. యాక్షన్, డ్రామాగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా 5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రానికి లభించిన సెన్సార్ రివ్యూ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత అనే వివరాల్లోకి వెళితే...

దర్శన్ ఇమేజ్‌కు తగినట్టుగా ఈ సినిమాను యాక్షన్ ప్రధానంగా రూపొందించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో సెన్సార్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సెన్సార్ వారి సూచనలు, సలహాలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ బోర్డు అధికారులు ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ది డెవిల్ సినిమాను అన్ని రకాలుగా రివ్యూ చేసిన తర్వాత ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రానికి యూఏ (U/A 16+) సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సినిమా సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు దాటిన యువతి, యువకులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మూవీని చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సినిమాను చూడాల్సి ఉంటుందని సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌లో వెల్లడించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ది డెవిల్ సినిమాను నిడివిని భారీగానే పెంచినట్టు రన్ టైమ్ చూస్తే అర్ధమవుతుంది. కథ, కథనాలు, యాక్షన్ సన్నివేశాలు డిమాండ్ చేయడంతో రన్ టైమ్ కూడా ఎక్కువైంది. ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 49 నిమిషాల 16 సెకన్లు అంటే.. 169 నిమిషాల 16 సెకన్ల రన్ టైమ్ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ప్రత్యేక పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కథనాల కోసం ఫిల్మిబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











