The Family Man 3 Twitter Review: ది ఫ్యామిలీ మ్యాన్ 3 ట్విట్టర్ రివ్యూ

భారతీయ సినిమా రంగంలో ప్రముఖ దర్శక, నిర్మాతలు రాజ్ అండ్ డీకే రూపొందించిన పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్లు స్ట్రీమింగ్ అవుతూ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి, సమంత రుత్ ప్రభు కీలక పాత్రలను పోషించారు. కీషోర్ కుమార్, గుల్ పనాగ్, శ్రేయా ధన్వంతరి, సందీప్ కిషన్, సన్నీ హిందూజా, అభయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ వెబ్ సిరీస్‌కు సచిన్ జిగర్ సంగీతం, కేతన్ సోదా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అజిమ్ మూలన్, నిగమ్ బోంజన్ సినిమాటోగ్రపి, సుమతి్ కొటియాన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. డీ2R బ్యానర్‌పై రూపొందిన మోస్ట్ వెయిటింగ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 3 నవంబర్ 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయాల్లోకి వెళితే..

The Family Man 3 Twitter Review

మనోజ్ బాజ్‌పేయి నటనకు గ్యారంటీ. ది ఫ్యామిలీ మెన్ 3 దేశభక్తి, ఫ్యామిలీ డ్రామాల పరిపూర్ణమైన సమ్మేళనంగా కనిపిస్తోంది. సూపర్ స్ప+ సూపర్ డాడ్ = రియల్ హీరో అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

క్రియేటర్స్.. దీ ఫ్యామిలీమెన్ x ఫర్జీ క్రాస్ ఓవర్‌ని ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది నా పరిశీలన మాత్రమే. కానీ అద్భుతంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ -నటీనటులు, సిబ్బంది, రచయితలు, దర్శకులు మొత్తం బృందానికి అభినందనలు అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

ది ఫ్యామిలీమెన్ సీజన్ పూర్తయింది. నిజాయితీగా చెప్పాలంటే నేను ఆశ్చర్యపోయను. దర్శకత్వం బాగుంది, కథ చాలా బాగుంది, ప్రతి ఒక్క నటుడు పవర్‌ఫుల్ యాక్టింగ్ చేశాడు. ఊహించని విధంగా విజయ్ సేతుపతి ఎంట్రీ నిజంగా ఆశ్చర్యం కలిగించింది అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

ది ఫ్యామిలిమెన్ సీజన్ 3ని ఇష్టంగా చూశాను. జైదీప్ అహ్లావత్, మనోజ్ బాజ్‌పేయి గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. కథ బాగుంది, అయితే సీజన్‌ను ముగించాల్సింది. 5కి 4 స్టార్స్ ఇస్తున్నా.. సీజన్‌ను బాగా ముగించనందుకు 1 స్టార్ ఇవ్వడం లేదు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X