For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Family Man 2 Review: సీజన్ 1కు మించిన థ్రిల్లర్‌గా.. సమంత, మనోజ్ బాజ్‌పేయ్ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

  |

  Rating:
  3.5/5
  Star Cast: మనోజ్ బాజ్‌పేయ్, సమంత అక్కినేని, ప్రియమణి
  Director: రాజ్ అండ్ డీకే

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu

  ఓటీటీలో అత్యంత టాప్ రేటింగ్‌‌ను సొంతం చేసుకొన్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 తర్వాత ఈ వెబ్ సిరీస్ సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. దాంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు సీజన్ 2 చూసే అవకాశం దక్కింది. జూన్ 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే...

  ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ

  ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ

  తమిళ టెర్రిరిస్టు సుబ్బు అరెస్ట్‌తో ఆసక్తికరంగా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎపిసోడ్ ప్రారంభమైంది. తమిళ టెర్రిరిస్ట్‌ను పట్టుకొనే సన్నివేశాలు ఉత్కంఠంగా సాగాయి. ఇక ఎన్ఎస్‌జీ నుంచి విరమించుకొన్న శ్రీకాంత్ తివారీ ఓ కార్పోరెట్ ఆఫీస్‌లో చేరడం, అతని అసహనం, దేశం కోసం పడే ఆరాటం కనిపిస్తుంది. ఇక బ్రిటన్, చెన్నైలో జరిగే సంఘటనలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. రాజ్ అండ్ డీకే కథ, కథనాలు అద్భుతంగా ఉన్నాయి. భావోద్వేగంతో ఈ సిరీస్ సాగుతున్నది. ఫస్ట్ సీజన్ మరిపించేలా ఈ సీజన్ ఉందనే ఫీలింగ్‌ను ఫస్ట్ ఎపిసోడ్ కలిగించిదని చెప్పవచ్చు

  సెకండ్ ఎపిసోడ్ రివ్యూ

  సెకండ్ ఎపిసోడ్ రివ్యూ

  సెకండ్ ఎపిసోడ్‌లో సమంత అక్కినేని ఎంట్రీ ఎమోషనల్ నోట్‌తో మొదలైంది. లైంగిక వివక్షకు గురయ్యే రాజీ పాత్రలో కనిపించింది. కంపెనీలో పనిచేసే కూలీ పాత్రలో సమంత డీ గ్లామరైజ్డ్‌గా నటించింది. ఇక సెకండ్ ఎపిసోడ్‌ చివర్లలో సమంత ఫెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంది. సమంత పాత్ర చేంజ్ ఓవర్ అదరగొట్టింది. సమంత చెప్పిన డైలాగ్స్ రక్తం ఉప్పొంగేలా చేస్తాయి. అలాగే శ్రీకాంత్ తివారీ కూతురు ఆమె బాయ్‌ఫ్రెండ్ సీన్లు ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచేలా చేశాయి. శ్రీకాంత్ తివారీకి సంబంధించిన సీన్లు, సమంత, అలాగే తమిళ టెర్రిరిస్టు సుబ్బుకు సంబంధించి కోర్టు బ్లాస్ట్ సీన్ కథను మలుపు తిప్పింది. తమిళ పోరాటం నుంచి విరమించుకొన్న సుబ్బు సోదరుడు భాస్కరన్ మళ్లీ టీమ్‌ను జత చేయడం అందుకోసం సమంతకు ఫోన్ చేయడం సెకండ్ ఎపిసోడ్‌ను మరింత ఇంట్రెస్ట్‌గా మార్చింది. మ్యూజిక్, కెమెరా పనితనం చాలా బాగుంది. కథను రాజ్ అండ్ డీకే డీల్ చేసిన విధానం ఎపిసోడ్‌కు ఎపిసోడ్‌కు మంచి అంచనాలు పెంచుతూ పోయింది.

  థర్డ్ ఎపిసోడ్ రివ్యూ

  థర్డ్ ఎపిసోడ్ రివ్యూ

  మూడో ఎపిసోడ్ కాస్త నెమ్మదించిందనే ఫీలింగ్ కొంచెం కలిగినప్పటికీ.. చివర్లో ఇచ్చిన ట్విస్టులు బ్రహ్మండమైన ఫీలింగ్స్‌ను కలిగిస్తాయి. శ్రీకాంత్ తివారీ, తన భార్య (ప్రియమణి) మధ్య జరిగే సంభాషణ కథను మరింత భావోద్వేగం మలిచింది. భార్యభర్త మధ్య లైంగిక బంధాలు గురించి చర్చించిన తీరు ఆసక్తికరంగా సాగింది. తన కంపెనీలో సీఈవోను కొట్టి శ్రీకాంత్ తివారీ జాబ్‌కు రిజైన్ చేయడం, ఆ తర్వాత ఎన్ఐఏలో చేరడం కథలో ఆసక్తికరమైన మలుపు. అలాగే ఎపిసోడ్ ఎపిసోడ్‌కు సమంత క్యారెక్టర్‌ రేంజ్‌ను పెంచడం ఆకట్టుకొనేలా ఉంది. ప్రతీ ఎపిసోడ్‌లో సమంత క్యారెక్టర్ గ్రాఫ్‌ పెంచుతూ రాజ్ అండ్ డీకే అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్‌పై ఉత్కంఠను కలిగించేలా చేసిందని చెప్పవచ్చు.

  4వ ఎపిసోడ్‌ రివ్యూ

  4వ ఎపిసోడ్‌ రివ్యూ

  నందా హత్య తర్వాత సమంత (రాజ్యలక్ష్మి) పరిస్థితి కష్టంగా మారుతుంది. తనపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన నందాను మట్టుపెట్టడంతో పోలీసుల వేట మొదలవుతుంది. దాంతో తప్పించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఆ క్రమంలో శ్రీకాంత్ తివారీకి ఎదురుపడుతుంది. సమంత ఇంటిలోకి వెళ్లిన శ్రీకాంత్ తివారీ తన సహచరుడిని హత్యకేసులో పోలీసులు అనుమానితులుగా అరెస్ట్ చేస్తారు. సమంత తప్పించుకొని మళ్లీ తమిళ టెర్రరిస్టుల గ్రూప్ చేయడం మరో ట్విస్టుగా మారింది.

  5వ ఎపిసోడ్‌ రివ్యూ

  5వ ఎపిసోడ్‌ రివ్యూ

  సమంత చెన్నై నుంచి తప్పించుకొని శ్రీలంకకు వెళ్లే క్రమాన్ని కూడా దర్శకులు ఆసక్తిగా మలిచారు. అలాగే శ్రీకాంత్ తివారీ బృందం ఇన్వెస్టిగేషన్ కోణంలో కథను నడిపించిన తీరు కాస్త నెమ్మదించినట్టు కనిపిస్తుంది. మొదటి మూడు పవర్‌ఫుల్ ఎపిసోడ్స్ తర్వాత కాస్త బోర్ అనిపిస్తుంది. కానీ సమంతకు సన్నివేశాలకు సంబంధించిన సీన్లు మళ్లీ ఎపిసోడ్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందా అనిపిస్తుంది.

  6వ ఎపిసోడ్‌ రివ్యూ

  6వ ఎపిసోడ్‌ రివ్యూ


  ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ 2కు 6వ ఎపిసోడ్ హైలెట్‌గా నిలుస్తుంది. పోలీసుల చేతిలో చిక్కిన సమంత (రాజీ) తప్పించుకోవడానికి చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పవచ్చు. సమంత పోలీసులకు చిక్కడం ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌పై జరిగే దాడి మరో హైలెట్. ఈ రెండు కూడా వెబ్ సిరీస్‌ను నంబర్ వన్‌గా నిలిచేలా చేస్తాయనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రీకాంత్ తివారీని నిలువరించడానికి టెర్రరిస్టు గ్రూపులు ఆయన కుమార్తెను ట్రాప్ చేసే సన్నివేశాలు మరింత ఎమోషనల్‌గా మార్చాయని చెప్పవచ్చు.

  7 ఎపిసోడ్ రివ్యూ

  7 ఎపిసోడ్ రివ్యూ

  ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఓ వైపు సమంత (రాజీ) కోసం శ్రీకాంత్ తివారీ ప్రయత్నిస్తుంటే.. టెర్రిరిస్టు గ్రూప్ తన కూతురిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేయడం కథను మరోసారి మలుపు తిప్పేలా చేసింది. అంతేకాకుండా హై రేంజ్ ఎమోషన్స్ పండించేలా చేసింది. కథను నడిపించిన తీరు దర్శకుల ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. తన కూతురు కిడ్నాప్ అయిందనే విషయం తెలిసిన తర్వాత మనోజ్ బాజ్‌పేయ్ పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక తన కూతురు కిడ్నాప్ ఇన్వెస్టిగేషన్ మరింత ఆసక్తిగా నడిచేలా దర్శకులు తగు జాగ్రత్తలు తీసుకొన్నారు.

  8 ఎపిసోడ్ రివ్యూ

  8 ఎపిసోడ్ రివ్యూ


  శ్రీకాంత్ తివారీ కూతురు కిడ్నాప్ వ్యవహారం హైడ్రామాగా సాగుతుంది. సాజిద్, సల్మాన్ ఆచూకీ కోసం ప్రయత్నించిన తీరు స్క్రిప్టు బలమేమిటో చెప్పింది. మరోవైపు రాజీ డెన్‌ను ట్రేస్ చేయడానికి ఎన్ఐఏ అధికారి జేకే, మరో అధికారితో కథ నడిపించిన తీరు మరింత ఆసక్తిని రేపుతుంది. కిడ్నాప్ గురైన తివారీ కూతురు విడిపించే యాక్షన్ ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఇక తప్పిపోయిన జేకేను వెతకడం, అలాగే సమంతను వెతికే వ్యవహారం మొదలవుతుంది. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. తొమ్మిది ఎపిసోడ్స్ సిరీస్‌లో ఇది కూడా ఒక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు.

  9వ ఎపిసోడ్ రివ్యూ

  9వ ఎపిసోడ్ రివ్యూ

  చెన్నైలో జరిగే ఇండియా ప్రధాని, శ్రీలంక రాష్ట్రపతి సమావేశాన్ని టార్గెట్‌గా రాజీ టీమ్ ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ భగ్నం చేయడానికి శ్రీకాంత్ తివారీ తన బృందంతో ఆ ప్రాంతానికి చేరుకొంటారు. జేకే అచూకీ కొనగొనడం జరుగుతుంది. ఇక రాజీ ఉన్న ప్రాంతాన్ని శ్రీకాంత్ తివారీ ముట్టడిస్తారు. ఆ తర్వాత శ్రీకాంత్ తివారీ ఆపరేషన్ ఏం జరిగింది. రాజీ లొంగిపోయిందా? లేక రాజీ ఆపరేషన్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే చివరి, తొమ్మిదో ఎపిసోడ్‌లో కీలకంగా మారుతుంది. శ్రీకాంత్ తివారీకి ఈ ఆపరేషన్ సక్సెస్‌గా నిర్వహించినందుకు ప్రధాని ప్రశంసతోపాటు మెడల్ లభిస్తుంది. శ్రీకాంత్, సుచి (ప్రియమణి) మధ్య సంబంధాలు ఎలాంటి స్థితికి చేరుకొన్నదనే విషయం ఈ కథకు ముగింపు.

  ది ఫ్యామిలీ మ్యాన్ 3 సీజన్‌ హింట్

  ది ఫ్యామిలీ మ్యాన్ 3 సీజన్‌ హింట్

  ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ ముగిసిన తర్వాత మూడో సీజన్ కూడా ఉందనే విషయం కొసమెరుపుగా మారింది. కోల్‌కతాను కేంద్రంగా చేసుకొని చైనా దేశీయులు కరోనావైరస్ వ్యాప్తి చేయడం అనేది మూడో సీజన్‌కు ముడిసరుకుగా మారింది. ఆసక్తికరమైన రీతిలో ముగింపు ఇచ్చి మూడో సీజన్ కోసం ఎదురు చూసేలా చేశారు దర్శక, నిర్మాతలు రాజ్ అండ్ డీకే.

  English summary
  The Family Man 2 web series released on Amazon prime video on June 4th. In this series, Manoj Bajpayee, Samantha Akkineni, Priyamani roles are well defined. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X