For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Ghost movie review.. ప్రవీణ్ సత్తారు టేకింగ్ స్టైలిష్‌గా, నాగార్జున హిట్ కొట్టాడా అంటే?

  |

  Rating: 2.5/5

  గరుడవేగ లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ఆకట్టుకొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి రూపొందించిన చిత్రం ది ఘోస్ట్. యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు టీజర్లు, ట్రైలర్లు పెంచిన అంచనాలను ఈ సినిమా చేరుకొన్నదా? గరుడవేగ లాంటి భారీ సక్సెస్‌ను ప్రవీణ్ సత్తారు అందుకొన్నారా? అనే విషయాల్లో వెళితే..

  ది ఘోస్ట్ కథ ఏమిటంటే?

  ది ఘోస్ట్ కథ ఏమిటంటే?

  దుబాయ్‌లో విక్రమ్ (నాగార్జున) తన ప్రేయసి ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలసి దుబాయ్‌లో పనిచేస్తుంటాడు. మాఫియాను మట్టుబెట్టే ఓ మిషన్‌లో జరిగిన ఓ సంఘటనకు మనస్తాపం చెందిన విక్రమ్.. తన ప్రియురాలు, ఉద్యోగానికి దూరంగా ఉంటాడు. మాఫియా కార్యక్రమాలను అడ్డుకొనే మిషన్స్‌లో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఉండే విక్రమ్‌కు అను (గుల్ పనాగ్) నుంచి ఫోన్ వస్తుంది. తాను, తన కూతురు అదితి (అనిఖా సురేంద్రన్) ఆపదలో ఉన్నామని అను చెబుతుంది.

   ది ఘోస్ట్‌లో ట్విస్టులు

  ది ఘోస్ట్‌లో ట్విస్టులు


  ఇంటర్‌పోల్‌లో ఉద్యోగానికి విక్రమ్ ఎందుకు రాజీనామా చేశాడు? లవర్ ప్రియకు విక్రమ్ ఎందుకు దూరంగా ఉన్నాడు? అనుకు విక్రమ్‌కు ఎలాంటి సంబంధం ఉంది? అదితికి ఎలాంటి ముప్పు ఎవరి నుంచి ఏర్పడింది? అను, అదితిని కాపాడటానికి విక్రమ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నారు? విక్రమ్‌కు ది ఘోస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ది ఘోస్ట్ సినిమా కథ.

   ప్రవీణ్ సత్తారు టేకింగ్

  ప్రవీణ్ సత్తారు టేకింగ్


  దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ఓరియెంటేషన్‌తో ఎంచుకొన్న ఫ్యామిలీ డ్రామా పాయింట్ బాగుంది. కానీ పర్‌ఫెక్ట్‌గా ఎమోషన్స్‌ను యాక్షన్‌కు మిక్స్ చేయలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అత్యున్నత ప్రమాణాలతో యాక్షన్ సీన్లు చిత్రీకరించిన తీరు బాగుంది. స్టైలిష్ మేకింగ్, నాగార్జున, సోనాల్ చౌహాన్ లుక్‌ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. యాక్షన్ మూవీకి కావాల్సిన ఎన్విరాన్‌మెంట్‌ను బాగానే క్రియేట్ చేశాడు. కానీ ఒక మంచి యాక్షన్ మూవీకి కావాల్సిన బలమైన సన్నివేశాలను తెరకెక్కించే విషయంలో తడబాటు కనిపిస్తుంది. యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌తో స్టైలిష్ మేకర్‌గా ఆకట్టుకొన్నారని చెప్పవచ్చు.

   నాగ్, సోనాల్ చౌహాన్ పెర్ఫార్మెన్స్

  నాగ్, సోనాల్ చౌహాన్ పెర్ఫార్మెన్స్


  టాలీవుడ్‌లో యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలి ఎమోషన్స్ చిత్రాల్లో నటించి మెప్పించిన ట్రాక్ రికార్డు నాగార్జునకు ఉంది. కానీ ఒక పూర్తిస్థాయి యాక్షన్ జోనర్‌లో నాగ్ చేస్తున్న అటెంప్ట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. అయితే బలమైన కంటెంట్‌తో లేకపోవడం వల్ల తన టార్గెట్‌కు దూరంగా ఉంటున్నారనిపిస్తుంది. ది ఘోస్ట్ విషయంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా, లవర్‌గా, ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఇక సోనాల్ చౌహాన్‌ను ఇప్పటి వరకు రొమాంటిక్ హీరోయిన్‌గానే చూశాం. కానీ ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్‌తో కొత్త సొనాల్‌ను చూడటానికి అవకాశం ఏర్పడింది.

  మిగితా పాత్రల గురించి

  మిగితా పాత్రల గురించి


  మిగితా పాత్రల్లో అనుగా బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్.. అదితిగా అనికా సురేంద్రన్ నటించారు. ఎమోషనల్ సీన్లలో గుల్ పనాగ్, అనికా తమ పాత్రలకు న్యాయం చేశారు. రవివర్మ, శ్రీకాంత్ అయ్యాంగర్, ఇతర విలన్ పాత్రలు పెద్దగా ప్రభావితం చేయలేకపోవడం వల్ల వారు తేలిపోయారనే చెప్పవచ్చు. బలమైన నాగ్, సోనాల్ పాత్రలకు దీటుగా మిగితా పాత్రలు తెరపైన కనిపించలేకపోవడం సినిమా నెక్ట్స్ లెవల్‌కు చేరుకోవడంలో ఊగిసలాడిందనిపిస్తుంది.

  టెక్నికల్ అంశాల గురించి

  టెక్నికల్ అంశాల గురించి


  టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రాఫర్‌గా ముఖేష్ జీ పనితీరు బాగుంది. భరత్, సౌరభ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాగుంది. సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించడం చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజేసింది.

   ది ఘోస్ట్ గురించి ఫైనల్‌గా..

  ది ఘోస్ట్ గురించి ఫైనల్‌గా..


  యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలి, ఎమోషనల్ డ్రామాగా ది ఘోస్ట్ రూపొందింది. ఒక థ్రిల్లర్ కావాల్సిన అంశాలన్నీ చక్కగా కుదిరాయి. కానీ ఫ్యామిలీ డ్రామాను పూర్తిస్థాయి ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించి ఉంటే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా మారి ఉండేదనిపిస్తుంది. బిజినెస్ డ్రామాను ఆసక్తికరంగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయలేకపోవడం ఈ సినిమాకు మైనస్. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండేది. ఈ సినిమా కమర్షియల్ స్టామినా బాక్సాఫీస్ వద్ద కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాను ఆదరించే వారికి ది ఘోస్ట్ నచ్చడానికి అవకాశం ఉంది.

  English summary
  Nagarjuna Akkineni and Praveen Sattaru's stylish Action Thriller The Ghost movie has released on Octobrer 5th. Here is the Telugu filmibeat review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X