The Girl Friend Censor Review: రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ రివ్యూ… నేషనల్ అవార్డు పక్కా..

The Girl Friend Censor Review: రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నేషనల్ క్రష్‌, వరుసగా అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల "థామా" సినిమా ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక, ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే సినిమా "ది గర్ల్ ఫ్రెండ్" (The Girl Friend). ఈ మూవీపై సెన్సార్ బోర్డు రివ్యూ ఇచ్చింది. ఇంతకీ మూవీ రివ్యూ ఏంటీ? ఏమన్నారు?

"ది గర్ల్ ఫ్రెండ్" (The Girl Friend)సినిమాలో హీరోయిన్ రష్మిక సరసన దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) హీరోగా నటించారు. ఈ సినిమాకు నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 7న పాన్‌ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

The Girl Friend Censor Review  Rashmika Mandanna   s Film Impresses Board     Called a Potential National Award Winner

ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసిన తర్వాత దీన్ని ఎంతో మెచ్చుకున్నారని సమాచారం. సినిమాకు U/A సర్టిఫికేట్ లభించినట్టు తెలుస్తోంది. అయితే అంతకంటే ముఖ్యమైన విషయం సెన్సార్ సభ్యులు సినిమా ముగిసిన తర్వాత దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడితో సుదీర్ఘ చర్చలు జరిపారట. ఆ చర్చలో వారు సినిమా పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, రష్మిక పోషించిన పాత్ర బాగుందని, ప్రతి యువతికి బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారని తెలుస్తోంది. అంతేకాదు, వారు ఈ సినిమాను "జాతీయ అవార్డు దక్కే స్థాయి కృతి" అని అభివర్ణించారట.

అలాగే.. రాహుల్ రవీంద్రన్ మొదటి చిత్రం "చిలసౌ" (Chi La Sow)ను లాగా ఉన్నట్టు తెలిపారట. ఆ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కింది. ఆ సినిమాను రూపొందించిన రాహుల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన్ "ది గర్ల్ ఫ్రెండ్" కూడా అంతే స్థాయి కథనంతో ఉండటమే కాకుండా, భావోద్వేగాలు, సంబంధాల సున్నితతను అద్భుతంగా చూపించిందని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారని తెలిసింది.వారు రాహుల్ రవీంద్రన్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, "మీరు మళ్లీ ఆ అవార్డు స్టేజ్‌ పై నిలబడబోతున్నారు" అని చెప్పినట్టుగా సమాచారం.

ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా ముఖ్యమని యూనిట్ సభ్యులు పేర్కొన్నారట. ఓ సాధారణ యువతీ జీవితంలోని ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రేమ, బాధ, ఆత్మ గౌరవం వంటి అంశాలను అద్భుతంగా ప్రతిబింబించే పాత్రను ఆమె పోషించిందట. ఈ పాత్ర ద్వారా రష్మిక నటనలో మరో కొత్త కోణం ప్రేక్షకులు చూడబోతున్నారు. సెన్సార్ సభ్యులు కూడా రష్మిక నటనను ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఈ పాత్రతో రష్మికనటిగా తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోనుంది" అని వారు చెప్పినట్టు సమాచారం.

అయితే.. సెన్సార్ బోర్డు నుండి ఇలాంటి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం చాలా అరుదు. ఈ సమాచారం బయటకు రాగానే సోషల్ మీడియాలో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రెండింగ్ గా మారిపోయింది. జాతీయ అవార్డు పక్కా అంటూ రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా భారీ అంచనాల నడుమ నవంబర్ 7న థియేటర్లలోకి రానున్న "ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నిజంగా నేషనల్ అవార్డ్స్ వేదికపై నిలుస్తుందా? అని తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X