The Girlfriend Review: ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు
రచన, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, కొప్పినీడి విద్య
సమర్పణ: అల్లు అరవింద్
మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వహబ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫి: కృష్ణన్ వసంత్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
రిలీజ్ డేట్: 2025-11-07

రామలింగయ్య కాలేజీలో భమా దేవీ అలియాస్ భూమ (రష్మిక మందన్న), విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) పీజీ కోర్సులో చేరుతారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న విక్రమ్, దుర్గ మంచి స్నేహితులుగా కొనసాగుతూనే భూమాతో ప్రేమలో పడుతాడు. అయితే భూమ అంటే చెప్పలేనంత ప్రేమ ఉండటంతోపాటు పొసెసివ్ నేచర్ ఉంటుంది. తన చెప్పు చేతల్లోనే ఉంచుకోవాలనే స్వభావంతో భూమకు ఓ రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో విక్రమ్‌కు భూమ బ్రేకప్ చెబుతుంది.

The Girlfriend Movie Review

క్లోజ్‌గా ఉన్నప్పటికీ దుర్గాతో విక్రమ్‌కు లవ్ ఎందుకు కలుగలేదు. భూమానే విక్రమ్ ఎందుకు ప్రేమించాడు? భూమాకు తానే ప్రపంచంగా ఎందుకు మారాలనుకొన్నాడు? తన ప్రపంచంలోనే భూమా బతకాలని విక్రమ్ ఎందుకు భావించాడు? తనపై విపరీతమైన ప్రేమను ప్రదర్శించడంపై భూమా రియాక్షన్ ఏమిటి? భూమ, విక్రమ్ అఫైర్‌ చూసి దుర్గ ఫీలింగ్ ఏమిటి? విక్రమ్‌కు భూమ ఎందుకు బ్రేకప్ చెప్పానుకొన్నది? విక్రమ్‌తో అఫైర్ తెలిసిన భూమ తండ్రి ఏం చేశాడు? చివరకు విక్రమ్‌ను భూమ ఎందుకు అసహ్యించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ కథ.

మహిళ స్వేచ్ఛగా బతకాలి.. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదనే విశాలమైన దృక్పథంతో రాహుల్ రవీంద్రన్ రాసుకొన్న పాయింట్ చాలా బాగుంది. కానీ సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో విఫలమయ్యాడు. అసలు సమస్యను కథలోకి తీసుకొచ్చి ప్రేక్షకుడిని కట్టిపడేసే విషయంలో చాలా చాలా సమయం తీసుకొన్నాడు. ఫస్టాఫ్‌లో కథను అక్కడక్కడే తిప్పుతూ కొంత విసుగుపుట్టించాడు. ఎప్పుడైతే సెకండాఫ్‌లో సమస్యను తెరపైకి తెచ్చారో.. అన్ని క్యారెక్టర్లలో చలనం, భావోద్వేగం, ట్రెమండస్ పెర్ఫార్మెన్స్‌లు బయటకు వచ్చాయి. సెకండాఫ్‌లో కథను డీల్ చేసిన విధానం.. అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు రష్మిక పాత్రను తీర్చి దిద్దిన విధానం ఈ సినిమాను ఎమోషనల్‌గాను, ఫీల్‌గుడ్‌గాను మార్చింది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రష్మిక, దీక్షిత్ శెట్టి ఒకరికొకరు పోటీపడి నటించారు. ఆ ఇద్దరు లేకుండా ఈ సినిమాను చూడలేమనేంతగా, ఊహించుకోలేనంతగా పాత్రల్లో జీవించారు. పొసెసివ్ లవర్, టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్, సైకో బిహేవియర్ ఉన్న యువకుడి పాత్రలో దీక్షిత్ శెట్టి అదరగొట్టారు. రష్మికను కొన్నిసార్లు డామినేట్ చేసేంతగా నటించి మెప్పించారు. రష్మిక విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో అమాయకత్వంతో కూడిన అమ్మాయిగా, సెకండాఫ్‌లో ప్రతికూల పరిస్థితులను ఎదురించి.. తెగించే క్యారెక్టర్‌లో విశ్వరూపం చూపించారు. అను ఇమ్మాన్యుయేల్ పాత్ర చిన్నదైనప్పటికీ.. గుర్తుండిపోయే ఫీల్ గుడ్ క్యారెక్టర్. గెస్ట్ రోల్స్ అయినప్పటికీ.. రావు రమేష్, రోహిణి గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. రాహుల్ రవీంద్రన్ సపోర్టింగ్ రోల్‌లో తన వంతు సహాయాన్ని నటుడిగా అందిచారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను బాగా పండించింది. పేలవమైన సీన్లను కూడా తన మార్కు మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి బాగుంది. కాలేజీ వాతావరణాన్ని బ్రిల్లియెంట్‌గా తెరకెక్కించారు. సినిమాను కలర్‌ఫుల్‌గా చూపించాడు. చోటా కే ప్రసాద్‌ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పని ఉందనిపిస్తుంది. ఫస్టాఫ్‌ చాలా ల్యాగ్‌తో సాగడం సినిమాలోని ఎమోషన్స్‌ను, వేగాన్ని మందగించేలా చేశాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, కొప్పినీడి విద్య అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఉమెన్ ఓరియెంటెడ్ మూవీని ఎంచుకోవడం సినిమాపై విద్యకు ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

మహిళలను, యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన లవ్ అండ్ రిలేషన్‌షిప్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. దీక్షిత్, రష్మిక, అను పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఈ మూవీకి పెద్ద అసెట్. జెన్ జీ ఆడియెన్స్‌ను టచ్ చేసే విధంగా, ముఖ్యంగా లవ్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకొంటారమో అనే ఆందోళనలో ఉండే పేరెంట్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. రష్మిక, దీక్షిత్ శెట్టి నటనా ప్రతిభను తెర మీద చూడాలంటే.. ది గర్ల్‌ఫ్రెండ్‌ను మిస్ చేసుకోవద్దు. ఫస్టాఫ్‌ను కొంత బేర్ చేయగలిగితే.. సెకండాఫ్ అదిరిపోయేలా ఉండటంతోపాటు మంచి అనుభూతిని, ఎమోషన్స్‌ను పంచుతుంది. రాహుల్ రవీంద్రన్, రష్మిక చేసిన సిన్సియర్, జెన్యూన్ అటెంప్ట్. కాబట్టి హై పెర్ఫార్మెన్స్‌ను రుచి చూడాలంటే.. ఈ వారం గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకొండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X