The Girlfriend Twitter Review: ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో తెరకెక్కిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్‌లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ది గర్ల్ ఫ్రెండ్‌కు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు.

వరుస విజయాలతో రష్మిక మందన్న మంచి ఊపు మీదున్న నేపథ్యంలో ది గర్ల్‌ఫ్రెండ్‌పై అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. నవంబర్ 7వ తేదీన ది గర్ల్‌ఫ్రెండ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు నవంబర్ 6వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

The Girlfriend Movie Twitter Review in Telugu  Will Rashmika Mandanna hits bulls eye

ది గర్ల్ ఫ్రెండ్ ఫస్టాఫ్ రివ్యూ.. డీసెంట్ లవ్ స్టోరీ, రష్మిక నటన బాగుంది. ఇంటర్వెల్‌లో ఇన్‌సెక్యూర్ లవ్ స్టోరీని చాలా బాగా చేసిందని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

రాహుల్ రవీంద్రన్‌ స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్ ఎక్స్‌లెంట్. రష్మిక మందన్న తన నటనతో అద్భుతం చేసింది. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నానని ఓ అభిమాని రాసుకొచ్చాడు.

నటిగానే కాదు.. ఆమె పాత్రగానూ మారుతుంది. దీక్షిత్ శెట్టి అన్న ప్రతి మాట రష్మిక మందన్నపై గౌరవాన్ని పెంచుతుంది. రష్మిక తెరపైనా, తెర వెలుపల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నారు అని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ది గర్ల్ ఫ్రెండ్ రివ్యూ: రాహుల్ రవింద్రన్ నిజాయితీగా కష్టపడ్డాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన అమాయకపు నటనతో ఔట్‌ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆమె నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ప్రధానంగా రాహుల్ రవింద్రన్ రచన, సంభాషనలు అందరికీ గట్టిగా తగులుతాయి. దీక్షిత్ నటన చాలా బాగుంది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేనికి కంగ్రాట్స్.

ది గర్ల్‌ఫ్రెండ్ ఫస్టాఫ్ ఇప్పుడే ముగిసింది. తొలుత స్లోగా మొదలైనా నెమ్మదిగా కథతో టాక్సిక్ రిలేషన్ ఏర్పడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. రష్మిక మందన్న నటన అద్భుతంగా ఉంది.

ది గర్ల్‌ఫ్రెండ్ చాలా అందమైన చిత్రం.. ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ సిబ్బందికి అభినందనలు. బిగ్‌స్క్రీన్‌లో తప్పకుండా చూడండి మిత్రులారా అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

చివరి పది నిమిషాలు రష్మిక మందన్న నట విస్ఫోటనమేనంటూ ఓ ఎక్స్ యూజర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఇది ప్రేమ, భావోద్వేగాలను చిత్రీకరించే చక్కకగా రూపొందించబడిన ప్రేమకథ. రష్మిక మందన్న చాలా బాగా చేశారు. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. దీక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్ అత్యుద్బుతంగా ఉంది. రాహుల్ రవీంద్రన్‌కు ప్రత్యేక ప్రశంసలు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

ది గర్ల్ ఫ్రెండ్ అనేది కన్విగ్టింగ్‌గా చెప్పిన ఓ కఠినమైన చిత్రం. ప్రేమలో, గందరగోళ సంబంధాలలో ఉన్న వ్యక్తులకు ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నిజాయితీగా ప్రయత్నించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రష్మిక మందన్న పరిణతి చెందిన, పవర్‌ఫుల్ యాక్టింగ్‌ చేశారు. అక్కడ రష్మిక నటన అద్భుతం. అను ఇమ్మాన్యుయేల్ నటనను అభినందించాల్సిందే. చివరిగా దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించారు. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్‌కు అండగా నిలిచినందుకు గీతా ఆర్ట్స్, ధీరజ్ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు అభినందనలు అని ఓ వ్యక్తి రివ్యూ ఇచ్చాడు.

బలవంతపు సంబంధం చుట్టూ తిరిగే సినిమా. అది ఊహించని పరిస్ధితులకు దారి తీస్తుంది. రాహుల్ రవీంద్రన్ రచన, కథన శైలి సెంటర్ స్టేజ్‌ను తీసుకుంటుంది. హేషమ్ సంగీతం బాగుంది. రష్మిక మందన్నది ఫైర్ పర్ఫార్మెన్స్‌. ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దీక్షిత్ శెట్టి తన పాత్రను అలవోకగా చేసుకెళ్లాడు. ది గర్ల్‌ఫ్రెండ్‌కు 3.5 రేటింగ్ ఇస్తున్నానని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X