The Girlfriend First Review: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ రివ్యూ

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.

ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహాి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

The Girlfriend Review By Censor Board

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ విషయానికి వస్తే.. భూమిక అలియాస్ భూమ (రష్మిక మందన్న), విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమ కథనే కాకుండా, వారిద్దరి రిలేషన్‌షిప్ స్టోరి. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధాలు, సంబంధాలు, భావోద్వేగాలు వారి ప్రేమకు, వారి నిర్ణయాలకు పరీక్ష పెడుతాయి. ఈ ఇద్దరి మధ్య సంఘర్షణలో విక్రమ్ స్నేహితురాలు (అను ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటి? భూమ, విక్రమ్ రిలేషన్‌షిప్‌కు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కథ.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. కానీ కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్మిక, దీక్షిత్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు, లిప్ లాక్స్‌పై అభ్యంతరం తెలిపారు. లిప్‌లాక్ నిడివిని తగ్గించాలంటూ సూచించారు. కొన్ని చోట్ల కొన్ని కత్తెర్లు వేశారు. పేరెంట్స్‌ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయనే సన్నివేశాలపై చాలా సున్నితంగా స్పందించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ వారి సలహాలను పరిగణనలోకి తీసుకొని సినిమాను కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ కథ ఆలోచింపజేసేలా ఉంటుంది. రేపటి సమాజానికి ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. రష్మిక మందన్న ఈ సినిమా కథలో జీవించారు. దీక్షిత్ శెట్టి పెర్ఫార్మెన్స్ హైలెట్. రోహిణి, రావు రమేష్, అను ఇమ్మాన్యుయేల్ పాత్రలు భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా గుర్తుండిపోయేలా ఉంటాయి అనే విషయాన్ని సెన్సార్ ప్రతినిధులు చిత్ర యూనిట్‌తో పంచుకొన్నారు.

ఇక ఎమోషనల్‌గా, బోల్డుగా సాగే కథకు సెన్సార్ అధికారులు యూ/ఏ (UA+16) సర్టిఫికెట్ జారీ చేశారు. 16 సంవత్సరాలు నిండిన యువత ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్ల లోపు పిల్లలు పేరెంట్స్ పర్యవేక్షణలో అనుమతించాలని సూచించినట్టు సమాచారం. ఈ సినిమాను ఏ మాత్రం సాగదీయకుండా కథకు అనువైన నిడివిని ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివి 138 నిమిషాలు అంటే.. 2 గంటల 18 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ మూవీ గురించి వెల్లడించే రివ్యూ, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X