The Great Pre-Wedding Show Review: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ
మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులు
రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
నిర్మాత: అగరం సందీప్
సహ నిర్మాత: కల్పనా రావు
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి: సోమశేఖర్
ఎడిటర్: నరేష్ అడుప
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రజ్నయ్ కొనిగిరి
ప్రొడక్షన్ డిజైనర్: ఫణి తేజ మూసి
సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్
బ్యానర్: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2025-11-07
శ్రీకాకుళంలోని ఓ గ్రామంలోని రమేష్ (తిరువీర్) ఫోటో స్టూడియోను నడిపుతూ పెళ్లి, గ్రామంలోని ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అదే గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో పనిచేసే సెక్రెటరీ హేమ (టీనా శ్రావ్య)తో ప్రేమలో ఉంటాడు. ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన ఆనంద్ (నరేంద్ర రవి)కి సౌందర్య (యామిని)కి పెళ్లి నిశ్చయం అవుతుంది. తన మండలంలోనే ఎవరూ షూట్ చేయించుకోలేని విధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని ముచ్చట పడి రమేష్‌తో డీల్ కుదర్చుకొంటాడు. దాంతో ఆనంద్, సౌందర్య ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ బ్రహ్మండంగా కెమెరాలో బంధిస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్ ఇస్తే.. దానిని తన అసిస్టెంట్ (మాస్టర్ రోహన్) ఎక్కడో పారేస్తాడు. ఆ తర్వాత ఆనంద్, సౌందర్య పెళ్లి ఆగిపోతుంది.

రమేష్, తన అసిస్టెంట్ మధ్య ఫన్ రిలేషన్ ఎలా సాగింది? సౌందర్యతో రమేష్ లవ్ ట్రాక్ ఎలా నడిచింది? సౌందర్య కుటుంబ సభ్యులు ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఎందుకు అభ్యంతరం చెప్పారు? చివరకు ఆనంద్ ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ ఏ రేంజ్‌లో షూట్ చేశాడు? ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన చిప్ ఎలా మిస్ అయింది? ఆనంద్, సౌందర్య పెళ్లిని రమేష్, తన అసిస్టెంట్, లవర్‌తో ఎందుకు చెడగొట్టాలని ప్లాన్ వేశాడు? ఆనంద్, సౌందర్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటి? ఆనంద్ పెళ్లి ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆనంద్ పెళ్లిని జరిపించాలని రమేష్, సౌందర్య ఎందుకు తాపత్రయపడ్డారు? చివరకు ప్రీ వెడ్డంగ్ షూట్ చిప్ దొరికిందా? ఆనంద్, సౌందర్య పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కథ.
య్యూటూబ్‌లో షార్ట్ ఫిలింస్ వీడియోల ద్వారా టాలెంట్‌ను నిరూపించుకొన్న రాహుల్ శ్రీనివాస్ నిజాయితీగా రాసుకొన్న రూరల్ డ్రామా ఇది. అతిశయోక్తులకు, ఎలివేషన్స్, కమర్షియల్ అంశాలను బేరీజు వేసుకోకుండా జెన్యూన్‌గా కథను, కథనాన్ని, సన్నివేశాలు రాసుకొన్న తీరును ముందుగా అభినందించాలి. తన కథను మాత్రమే చెప్పాలని.. అంతా కొత్తవారిని, ప్రతిభావంతులైన యాక్టర్లతో తన విజన్‌ను తెరపైకి తెచ్చిన విధానంపై ప్రశంసలు గుప్పించాలి. కథలో ఎలాంటి డీవియేషన్ లేకుండా ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సినిమాను పరుగెత్తించిన విధానం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. ముఖ్యంగా శ్రీకాకుళం మట్టివాసనను తన సినిమా ద్వారా గుభాలించడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. సినిమాలోని క్యారెక్టర్లను డీల్ చేసిన విధానమే ఈ మూవీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సినిమాలో కొన్ని లోపాలు, సాగదీత ఉన్నప్పటికీ.. అవేమీ పెద్దగా పట్టించుకోనవసరం లేదు. స్టార్ వాల్యూ కాదు.. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే సూత్రాన్ని నమ్మి చేసిన ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ మూవీకి తిరువీర్ షో రన్నర్. అన్ని పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ.. తన మార్కు నటనతో ఆకట్టుకొన్నాడు. చాలా ఒద్దికగా, హానెస్ట్‌గా తన పాత్రను పండించాడు. ఇతర పాత్రలు తెరపైన రాణించడానికి తన వంతు క్రియేటివిటిని అందించి సినిమా అవుట్‌పుట్ బాగా రావడానికి సహాయపడ్డారు. తన పాత్ర పరిధి విషయంలో ఎలాంటి అభద్రతాభావం చూపించకుండా జెన్యూన్‌గా తన ప్రతిభను చాటుకొన్నాడు. ఇక ఈ సినిమా కథకు నూతన నటుడు నరేంద్ర రవి హీరోగా మారాడు. కొత్తవాడైనా విభిన్నమైన నటన, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో నటించడమే కాకుండా ఇండస్ట్రీకి మరో మంచి నటుడు లభించాడనే ఫీలింగ్ కల్పించాడు. హేమగా టీనా శ్రావ్య, సౌందర్యగా యామిని ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడానికి అవసరమైన ఎలిమెంట్స్‌ను అందించారు. మాస్టర్ రోహన్ కథను మలుపుతిప్పే పాత్రలోనే కాకుండా హాస్యాన్ని పండించే పాత్రలో ఒదిగిపోయాడు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు అద్బుతంగా నటించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు ఆయన అందించిన రీ రీకార్డింగ్ ప్లస్ పాయింట్. శ్రీకాకుళం అందాలను, పల్లె వాతావరణాన్ని సోమశేఖర్ కే తన కెమెరాలో అద్బుతంగా ఒడిసిపట్టుకొన్నారు. పాత్రలు అత్యంత సహజసిద్దంగా బిహేవ్ చేసేలా అవుట్‌పుట్‌ను తెర మీద చూపించారు. నరేష్ అడుపా ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండటం వల్ల సినిమా ఫీల్‌గుడ్‌గా సాగుతూ పరుగులు పెట్టింది. నిర్మాత అగరం సందీప్, సహ నిర్మాత కల్పనా రావు అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఎక్కడా రాజీ పడని విధంగా సినిమాను అందించారనే విషయం సినిమా చూసినంత సేప్ ఓ ఫీల్ కలిగింది.
మానవ సంబంధాలు, పల్లె జీవుల భావోద్వేగాల చుట్టూ అల్లుకొన్న రూరల్ వెడ్డింగ్ డ్రామా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్. నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు మాత్రమే కాకుండా దర్శకుడు రాసుకొన్న కథ, మాటలు, అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా మారాయి. తొలి చిత్ర దర్శకుడైనా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను నడిపించాడు. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు కనిపించని స్వచ్ఛమైన హాస్య చిత్రం. ఎలాంటి అంచనాలు ఉన్నా.. మిమ్మల్ని సంతృప్తి పరిచే సినిమా ఇది. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా తప్పకుండా చూడండి..


Click it and Unblock the Notifications











