The Greatest of All Time Review: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరీ, త్రిషా కృష్ణన్, శివకార్తీకేయన్, యోగిబాబు తదితరులు
దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాతలు: కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
బ్యానర్: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్: 2024-09-05

యాంటీ టెర్రరిస్ట్ టీమ్‌లో ఆఫీసర్‌గా పనిచేసే గాంధీ (విజయ్) తన టీమ్ కల్యాణ్, సునీల్, అజయ్ (ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్)తో ఆపరేషన్స్ నిర్వాహిస్తుంటాడు. భార్య అను (స్నేహ)కు, కుమారుడు జీవన్ (విజయ్) కి తెలియకుండా తన ఉద్యోగాన్ని చేస్తుంటాడు. అయితే తన భార్తపై అనుకి అనేక అనుమానాలు కలుగుతుంటాయి. అయితే థాయ్ లాండ్ వెకేషన్‌కు వెళ్లిన గాంధీ కుటుంబంపై టెర్రిరిస్టుల ఎటాక్ జరుగుతుంది. ఆ సమయంలో అనుకి అసలు విషయం తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో థాయ్‌లాండ్‌‌లో చనిపోయాడని అనుకొన్న జీవన్ తిరిగి వచ్చి గాంధీ ఇంటిలోనే ఉంటూ తండ్రిపై ఎటాక్ చేస్తుంటాడు.

The Greatest Of All Time Movie Review in Telugu and Rating  Vijay s hits bulls eye with Commercial Elements

భర్త గాంధీపై ఎలాంటి అనుమానాలు అనుకి కలుగుతుంటాయి. జీవన్ ఎలా తప్పిపోయాడు? తప్పిపోయిన జీనన్ చనిపోయాడని టెర్రిరిస్టు టీమ్ ఎలా భ్రమను కలిగించాయి. తండ్రి గాంధీపై జీవన్ ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు? జీవన్ ఎక్కడ? ఎవరి వద్ద పెరిగాడు? గాంధీపై జీవన్‌కు కోపం కలగడానికి కారణాలు ఏమిటి? తండ్రిపై పగ తీర్చుకోవడానికి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను ఎలా టార్గెట్ చేసుకొన్నాడు? ధోని మ్యాచ్ ఆడుతుండగా స్టేడియాన్ని పేల్చివేయాలనే కుట్రను జీవన్ ఎలా ప్లాన్ చేశాడు? జీవన్ ఎటాక్‌ను గాంధీ ఎలా అడ్డుకొన్నాడు అనేది సినిమా కథ.

వెంకట్ ప్రభు ఎంచుకొన్న కథ, రాసుకొన్న కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. రెగ్యులర్, రొటీన్, ముతక సబ్జెక్ట్‌తో సాహసమే చేశాడనే చెప్పాలి. అయితే విజయ్ ఫ్యాన్స్ ఏం కోరుకొంటారనే కమర్షియల్ అంశాలన్నీ పేర్చుకొంటూ వెళ్లి ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం లేదు. ప్రతీ సన్నివేశం, రాబోయే సీన్లు ఊహించినట్టే ఉంటాయి. తొలి భాగం చూసేటప్పుడు ఎలాంటి థ్రిల్స్ లేకుండా ఆడియెన్ మెదడకు ఎలాంటి పని లేకుండా రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కల్పించాడు. ఇక జీవన్ క్యారెక్టర్‌ను తెరపైకి తెచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమాను ఓ మలుపు తిప్పాడనే చెప్పాలి.

The Greatest Of All Time Movie Review in Telugu and Rating  Vijay s hits bulls eye with Commercial Elements

సెకండాఫ్‌ను పక్కాగా కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూస్‌తో డిజైన్ చేసుకొన్నాడు. గాంధీ, జీవన్ పాత్రల మధ్య సీన్లు నువ్వా? నేనా అనే విధంగా రాసుకొన్న సీన్లు కొన్ని వర్కవుట్ అయ్యాయి. ఇక విలనిజాన్ని జీవన్ పాత్ర ద్వారా కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో త్రిషా ఐటెమ్ సాంగ్, చివర్లలో శివకార్తీకేయన్ గెస్ట్ ఎంట్రీ సినిమాకు హై వాల్యూస్ క్రియేట్ చేశాయి. చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్‌ను బేస్ చేసుకొని క్లైమాక్స్‌ను డిజైన్ చేసిన విధానం సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం అనేక సందేహాలకు, అనుమానాలకు పుల్ స్టాప్ పెట్టేలా వెంకట్ ప్రభు డిజైన్ చేసిన క్లైమాక్స్‌తో సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్‌ను కల్పించి తన సత్తాను చాటుకొన్నాడు.

ఇక విజయ్ ద్విపాత్రాభినయంతో గాంధీ, జీవన్ పాత్రల్లో డిఫరెంట్‌గా కనిపించారు. విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫ్యాన్స్‌ ఏం కోరుకొంటారో అవన్నీ పేర్చుకొంటూ వెళ్లాడు. పాటలు, ఫైట్స్, డ్యాన్సులతో కేక పెట్టించాడు. ఇక ప్రభుదేవా, ప్రశాంత్ క్యారెక్టర్ల మధ్యఎమోషనల్ సీన్లు బాగున్నాయి. ప్రభుదేవా తన క్యారెక్టర్‌లో ఉండే కొంత ట్విస్టుతో ఆకట్టుకొన్నాడనేచెప్పాలి. మీనాక్షి చౌదరీ గ్లామరస్‌గా, హాట్ హాట్‌గా కనిపించింది. ఆమెది చిన్నపాత్ర అయినప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. స్నేహ బ్యూటిఫుల్‌గా, గ్లామరస్‌గా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపించింది. యోగిబాబు, ప్రేమ్ జీ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. శివకార్తీకేయన్ గెస్ట్ రోల్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసింది కావడంతో ఉన్నంత సేపు థియేటర్లలో కేకలు వినిపించాయి. త్రిషా ఐటెం సాంగ్ మూవీకి ప్లస్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు మంచి స్కోప్ కలిగించేలా వెంకట్ ప్రభు రాసుకోవడం బలంగా కనిపించింది

The Greatest Of All Time Movie Review in Telugu and Rating  Vijay s hits bulls eye with Commercial Elements

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్ట్రెంగ్త్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్‌లో పాటలు చెత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫి బాగుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఏజీఎస్ బ్యానర్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమాను రిచ్‌గా రూపొందించారు. సినిమా క్వాలిటీ కోసం, పాత్రల కోసం ఎంచుకొన్న నటీనటులను చూస్తే.. సినిమా నిర్మాణంపై వారికి ఉన్న అభిరుచి, తపన తెలుస్తుంది.

ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్స్ చిత్రం పక్కా కమర్షియల్ సినిమా. స్టార్ హీరోకు ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. కొత్దదనం కోరుకొనే వారికి ఈ సినిమా పెద్దగా కిక్కు ఇవ్వకపోవచ్చు. విజయ్ ఫెర్ఫార్మెన్స్, వెంకట్ ప్రభు టేకింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు. స్నేహ, మీనాక్షి చౌదరీ, త్రిష లాంటి వాళ్లు తమ అందచందాలతో జోష్ కలిగిస్తారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. వినోదాన్ని, స్టార్ హీరో సినిమాను ఎంజాయ్ చేద్దామని అనుకొనే ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. వీకెండ్‌లో మాస్, కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X