The Greatest of All Time X Review: ది గోట్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ హిట్టు కొట్టాడా?
తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAt). ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు తదితరులు నటించారు. సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.
ఇళయ దళపతి విజయ్ తండ్రి కొడుకులుగా డబుల్ రోల్‌లో కనిపించిన ఈ చిత్రంలో భారీ తారాగణంతోపాటు ఇండియాలోనే టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌కు స్కోప్ ఉన్న చిత్రం కావడంతో భారీ బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ది గ్రెటెస్ట్ ఆల్ ది టైమ్ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల్లో రికార్డు కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది గోట్ సినిమాకు గతంలో అనిరుధ్ అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కానీ ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేశారు. అయితే అనిరుధ్ కంటే బెటర్‌గా ఇచ్చారా లేదా అనేది ఆయనపై ఒత్తిడి ఉంది. యువన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని నమ్ముతున్నాం అని అన్నారు.
తన సినిమా రిలీజ్‌కు ముందు దర్శకుడు వెంకట్ ప్రభు ట్వీట్ చేస్తూ.. ఓ కామెంట్ పోస్టు చేశారు. రికార్డులను బ్రేక్ చేయాలంటే అతడికే సాధ్యం అవుతుంది. విజిల్ పాటకు రికార్డు వ్యూస్ వచ్చాయి అని అన్నారు.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ సినిమా చూశాను. ఓపెనింగ్ బ్లాక్ బాగుంది. ఈ సినిమాకు సస్పెన్స్ ప్రధానమైన పాజిటివ్ అంశంగా మాిరంది. విజయ్ వేసిన స్టెప్పులకు విజిల్స్ వేయాల్సిందే. ఇప్పటి వరకు విజయ్‌లో చూడని చార్మింగ్, ఫన్ సైడ్ ఈ సినిమాలో చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్. ఫస్టాఫ్ చాలా సూపర్‌గా ఉంది అని ఆడియెన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని సినిమా ఇది. ఫస్టాఫ్ చాలా వేగంగా సాగిపోతుంది. ఊహించని హీరో ఇంట్రడక్షన్ ఉంది. విజిల్స్ వేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్‌కు పండగలాంటి మూవీ. ఎవరూ ఊహించని ట్విస్టులు, టర్న్‌లు ఉన్నాయి. ఈ సినిమా ఓ రోలర్ కోస్ట్ రైడ్. హాలీవుడ్ స్థాయిలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. విజయ్ ఫెర్ఫార్మెన్స్, దళపతి సన్నివేశాలు, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఓవరాల్‌గా థియేటర్‌లో బ్లాస్ అయ్యే సినిమా అని నెటిజన్ కామెంట్ చేశారు.
ది గోట్ సినిమా ఫస్టాఫ్ బాగుంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్ పీక్స్. ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది. దళపతి వర్సెస్ ఇళయ దళపతి అనేలా ఉంది. నిడివి అనేది సమస్యే కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సినిమా ఆరంభంలో 15 నిమిషాల ఓపెనింగ్ బ్లాక్ బాగుంది. టైటిల్ కార్డు ఇంకా సూపర్, విజయ్ డ్యాన్సులకు విజిల్స్ కొట్టాల్సిందే. సినిమాలో వినోదం బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











