The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి నిత్యం మనం తినే ఆహారం ఎలా పాయిజన్‌గా మారుతుంది? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు ఆరోగ్యంపై చూపుతున్న దుష్ప్రభావాల ఆధారంగా ది ఇండియా స్టోరీ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది ఇండియా స్టోరీపై సోషల్ మీడియాలో క్రిటిక్స్, నెటిజన్ల అభిప్రాయాలు పరిశీలిస్తే..

The India Story Movie Twitter Review in Telugu  Is Kajal Aggarwal s Movie hits the bulls eye

తొలిసారి మెగాఫోన్ పట్టిన డీకే చేతన్.. చిన్న వయసులోనే క్యాన్సర్‌కు కారణమవుతున్న ఆహారం, పాలలోని అసలు వాస్తవాలను ఈ సినిమాలో వివరించారు. న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు అందరి కళ్లలోనూ నీళ్లు తెప్పిస్తాయి అని ఓ యూజర్ రాసుకొచ్చాడు

ది ఇండియా స్టోరీ మూవీని సాంప్రదాయ పద్ధతిలో కేవలం వినోదమే ప్రధానంగా రూపొందించలేదు. ఇది మిమ్మల్ని ఆలోచింపజేయడానికి చేసిన ప్రయత్నం. ప్రతిరోజూ మన డైనింగ్ టేబుల్ మీదకి ఏం వస్తుందో చూపించింది. పురుగు మందులతో వ్యవసాయం వల్ల తలెత్తే పరిణామాలు, పెరుగుతున్న క్యాన్సర్ కేసుల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యను భావోద్వేగాలతో నిండిన కోర్ట్ డ్రామాగా ఈ సినిమాను మలిచారు.

ఈ సినిమాలోని అత్యంత హృదయ విదారకమైన ఘట్టాలలో పంజాబ్‌లోని బికనీర్‌కు నడిచే క్యాన్సర్ ట్రైన్ ప్రస్తావన ఒకటిగా నిలిచింది. ఈ కథ కేవలం కల్పితం కాదని, ప్రజలలో ఇప్పటికీ ఆందోళన రేకెత్తిస్తున్న వాస్తవ సమస్యల ఆధారంగా రూపొందించబడింది అనడానికి ఒక భయానక నిదర్శనం. కోర్టు రూమ్ సన్నివేశాలు, నివేదికలు, వాదనలు వాస్తవాలతో నిండి, సమస్య తీవ్రతను నొక్కి చెప్పింది.

శ్రేయాస్ తల్పాడే ఒక తండ్రి ఆవేదనను నిజాయితీతో ఆవిష్కరిస్తూ ఇటీవలి కాలంలో తన అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌లలో ఒకటిగా తన పాత్రలో ఒదిగిపోయారు. న్యాయ పోరాటానికి వెన్నెముకగా నిలిచే పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ కూడా అంతే ఆకట్టుకున్నారు. తన పాత్రకు ఆమె నమ్మకాన్ని తీసుకొచ్చారు. ది ఇండియా స్టోరీ కేవలం ఒక సినిమా కంటే కూడా ఒక చర్చను ప్రారంభించే సాధనంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ఎంపికలు, సేంద్రీయ వ్యవసాయానికి మద్ధతు ఇవ్వడం, గుర్తింపు పొందిన సేంద్రీయ ఉత్పత్తులు కొనడం, ప్యాక్ చేసిన సేంద్రీయ ఉత్పత్తులపై జైవిక్ భారత్ లోగో చూడాలనే విషయాలపై ఈ సినిమా అవగాహన కల్పించింది. కథనం అప్పుడప్పుడు ఒక పాఠంగా అనిపించినప్పటికీ, దాని ఉద్దేశం స్పష్టంగా చెప్పారు.

ఈ సినిమాను చూడటం అంత సులభం కాదు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనసు భారంగా ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. బహుశా మీరు తీసుకునే ఆహారం పట్ల మీ ఆలోచన కూడా మారుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ది ఇండియా స్టోరీ అనేది నిజాయితీతో కూడిన ఆలోచింపజేసే కోర్ట్ డ్రామా అని నెటిజన్ రివ్యూ ఇచ్చారు.

ది ఇండియా స్టోరీ ప్రివ్యూ షోల నుంచి బలమైన, ప్రభావవంతమైన సమీక్షలను అందుకుంటోంది. పురుగు మందులతో వ్యవసాయం, భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు దానికున్న సంబంధంపై లోతుగా విశ్లేషించే ఈ సంచలనాత్మక కోర్టు డ్రామాను ఇప్పుడు థియేటర్లలో చూడండి. పంజాబ్‌లో క్యాన్సర్ ట్రైన్ నుంచి కోర్టు రూమ్‌లో వెల్లడయ్యే విషయాల వరకు, ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడేల నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆలోచింపజేస్తుందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

Read more about: kajal aggarwal The India Story
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X