The Kerala Story 2 First Review: ది కేరళ స్టోరీ 2 మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన చిత్రం ది కేరళ స్టోరి 2 గోస్ బియాండ్. ఈ సినిమాకు కామఖ్య నారాయణ్ సింగ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు.

విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌పై జరుగుతున్న రగడ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

The Kerala Story 2 First Review

ది కేరళ స్టోరీ 2 సినిమా కథ విషయానికి వస్తే.. సురేఖ (ఉల్కా గుప్తా), దివ్య (అదితి భాటియా), నేహా (ఐశ్వర్య ఓజా) ముగ్గురు యువతులు తమ కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయలకు విరుద్దంగా ముస్లిం యువకులతో ప్రేమలో పడి మతాంతర వివాహం చేసుకొంటారు. తల్లిదండ్రులు వారించినా ప్రేమ మత్తులో తమ జీవిత భాగస్వాములను నమ్ముతారు. పెళ్లి తర్వాత తమ భర్తలపై ఉన్న భ్రమలు తొలుగుతాయి? వారి నిజస్వరూపాలు ఈ ముగ్గురు యువతులకు స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తాయి. తమ స్వేచ్ఛను హరించే చేష్టలు, బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడం లాంటి అంశాలతో ఈ ముగ్గురు యువతులు తమ స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల కోసం భర్తలపై తిరుగుబాటు చేస్తారు. ఈ ముగ్గురు యువతుల జీవితాల్లో ఏం జరిగింది? తిరుగుబాటుతో వారు చేసిన పోరాటం ఎలా సాగింది? అనేది ఈ సినిమా కథ.

భావోద్వేగాలు, శారీరక, మానసిక దాడుల నేపథ్యంగా సాగిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ముగ్గురు తమ పాత్రల్లో జీవించారు. వారి పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అవుతుంది. కామఖ్య నారాయణ సింగ్ ఈ కథను రూపొందించిన విధానం.. తెరపైకి తెచ్చిన తీరు బాగుంది అని సెన్సార్ బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

ఇలాంటి సున్నితమైన, వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసే సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయగా చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించి వాటిని తొలగించారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 16 ఏళ్లు దాటిన ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్ల లోపు వారికి ఈ సినిమా చూడటానికి అనుమతి ఉండదు అని స్పష్టం చేశారు.

ఈ సినిమా ద్వారా మత మార్పిడి వల్ల హిందూ అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం, లవ్ జిహద్‌తో హిందూ మతంపై జరుగుతున్న దాడిని బట్టబయలు చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించడం వల్ల.. ముఖ్యంగా కథను సూటిగా చెప్పే ప్రయత్నం చేశాం. కథను సాగదీయకుండా చేయడం వల్ల ఈ సినిమాను 2 గంటల 11 నిమిషాల నిడివితో సరిపెట్టాం. అంటే 131 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశాం అని చిత్ర యూనిట్ సెన్సార్ సర్టిఫికెట్ గురించి క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ సినిమాకు UA16+ సర్టిఫికెట్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు, వాదనలు భారీగా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌తో రూపొందే సినిమాలకు A సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారు. జన నాయగన్ లాంటి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఆపారు. ఇలాంటి ద్వంద ప్రమాణాలు పాటించడం తగదు అనే కామెంట్స్ భారీగా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X