For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Legend Movie Review: ‘ది లెజెండ్’ సినిమా రివ్యూ.. ట్రోల్స్ కు గురైన సినిమా ఎలా ఉందంటే?

  |

  రేటింగ్: 1.5/5

  కొన్ని సినిమాలు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే కొన్ని సినిమాలు మాత్రం ట్రోల్స్ అలాగే మీమ్స్ ద్వారా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. అదే విధంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ది శరవణ స్టోర్స్ యజమాని అరుళ్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమా కూడా ఎక్కువగా ట్రోల్ మెటీరియల్ లాగానే ప్రేక్షకులందరికీ పరిచయమైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

   ది లెజెండ్ కథ ఏమిటంటే?

  ది లెజెండ్ కథ ఏమిటంటే?

  డాక్టర్ శరవణన్(శరవణన్) తెలంగాణలోని వనపర్తిలో పుట్టి పెరిగి అమెరికా వెళ్లి డాక్టర్ కోర్స్ చదివి బయో టెక్నాలజీలో అనేక సంస్కరణలు తీసుకువస్తారు. అనేక వ్యాధులకు మందులు కూడా కనిపెడతారు. అయితే స్వగ్రామానికి ఒక సందర్భంలో వచ్చిన నేపథ్యంలో తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి షుగర్ వ్యాధితో చనిపోతే ఆ షుగర్ వ్యాధికి మందు కనిపెట్టాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతారు. ఆ సమయంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మెడికల్ మాఫియా మట్టు పెడుతుంది. ఆ మెడికల్ మాఫియా అంతు చూడటం కోసం తెలంగాణ నుంచి కాశ్మీర్ వెళ్లిన సమయంలో ఆయనకు మధు(ఊర్వశి రౌటేలా) పరిచయమవుతుంది. ఆ తర్వాత ఆయన షుగర్ వ్యాధికి మందు కూడా కనిపెడతారు. అయితే షుగర్ వ్యాధి మందు కనిపెట్టిన తర్వాత అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ షుగర్ వ్యాధి మందుని ఆయన ప్రజల ముందుకు తీసుకు వచ్చారా? తీసుకురావడానికి ఆయనకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? చివరికి శరవణన్ ఏం చేశారు అనేది ఈ సినిమా కథ.

  ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే:

  ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే:


  ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే సినిమా ప్రారంభమైన వెంటనే శరవణన్ గురించి ఆయన ఎంట్రీ ఉంటుంది. భారతదేశం గర్వించదగ్గ ఒక శాస్త్రవేత్త అంటూ ఆయనను పరిచయం చేస్తారు. తరువాత ఆయన జన్మించిన ఊరికి రావడం ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కొత్త విషయం కాకపోయినప్పటికీ కొత్తగా ట్రీట్ చేయడానికి దర్శకులు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు ఎందుకంటే బాగా సంపాదించిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఊరికి ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్ ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసే ఉన్నాం. ఈ సినిమా కూడా అందుకు ఏమీ మినహాయింపు కాదు. దాదాపుగా మొదటి భాగం అంతా ఆయన ఇంటికి తిరిగి రావడం తిరిగి వచ్చిన తర్వాత షుగర్ మందు కనుక్కోవాలనుకోవడం అనే విషయం మీద సాగుతూ ఉంటుంది.

  సెకండ్ హాఫ్ విషయానికి వస్తే:

  సెకండ్ హాఫ్ విషయానికి వస్తే:


  ఇక రెండో భాగం విషయానికి వస్తే భార్యను దూరం చేసుకున్న తర్వాత శరవణన్ మెడికల్ మాఫియా పని పట్టడం కోసం కాశ్మీర్ వెళ్లడం అక్కడ ఒక అమ్మాయి పరిచయం కావడం తన గురువు ప్రోత్సాహంతో మెడికల్ మాఫియా మీద యుద్ధం ఆపి షుగర్ వ్యాధికి మందు కనిపెట్టడం కోసం రంగంలోకి దిగటం లాంటి ఆసక్తికర సన్నివేశాలతో చూపించాలని ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా రెండో భాగం అంతా కూడా ఎక్కడ ఏం జరగబోతోంది అనే విషయం ముందే ఆడియన్స్ కి అర్థం అయిపోతుంది. స్క్రీన్ ప్లే పగడ్బందీగా ఉన్నా సరే గతంలో ఎన్నో సినిమాలలో చూసిన కథనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ మాత్రం ప్రేక్షకులకు కలుగుతుంది.

  నటీనటుల విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే


  ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన అరుల్ శరవణన్ తమిళనాడు వ్యాప్తంగా ఉన్న శరవణన్ స్టోర్స్ యజమానిగా అందరికీ సుపరిచితమే. అసలు ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడంటేనే బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఆయన నటన కూడా అలాగే అనిపించింది. కొన్నిసార్లు నిజంగా అక్కడ శరవణన్ ఉన్నారా లేక ఏదైనా యానిమేటెడ్ కార్టూన్ తో యాక్షన్ చేయిస్తున్నారా అనే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. నిజానికి మరి డూప్ తో ఏమైనా షూట్ చేశారో లేదో తెలియదు కానీ ఆయన నటన కొన్నిసార్లు పరవాలేదు అనిపించినా కొన్నిసార్లు మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కాకపోతే స్వయంగా తానే నిర్మాత కాబట్టి ఆయన ధైర్యంగా సినిమాలో తన స్థాయి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆయన తర్వాత ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా దివంగత వివేక్ తన కామెడీతో ఆలోచించే ప్రయత్నం చేశారు. కానీ పసలేని కామెడీ కావడంతో అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక ప్రభు, విజయ్ కుమార్ లాంటి అనేకమంది నటీనటులు కనిపిస్తారు కానీ వారికి నటించే స్కోప్ దక్కలేదు. ఇక ఊర్వశి రౌటేలా మాత్రం తనదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

   టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే:

  టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే:


  ఈ సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమా దర్శకులు జెడి- జెర్రీ ఇద్దరూ కూడా సాధారణ కథను ఒక అద్భుతమైన సూపర్ మాన్ స్టోరీలా చూపించడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ భారీగా ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు కానీ అది కొంతమేరకే సఫలం అయింది. సినిమా ఆద్యంతం కూడా సాదాసీదాగా సాగిపోతుంది. కాకపోతే కాసేపటికి ఒక ఫైట్ సీన్ లేదా సాంగ్ వస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. పాటల్లో ఏదో ఒక పదప్రయోగం చేసి పాటలను పూరించడానికి ప్రయత్నం చేశారు కానీ అవి ఏమాత్రం అర్థవంతంగా ఉండవు కాకపోతే సంగీతం మాత్రం కాస్త వినసొంపుగా అనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా సంగీతం కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

   ఫైనల్ గా :

  ఫైనల్ గా :


  ఒక్క చెప్పాలంటే ఈ సినిమా మొత్తం కూడా ఒక ట్రోల్ మెటీరియల్ లాగా అనిపించక మానదు. సాధారణ కథే కావడంతో ప్రేక్షకులు కూడా సినిమాకి అంత త్వరగా కనెక్ట్ అవుతారు అని చెప్పలేం.

   నటీనటులు

  నటీనటులు


  నటీనటులు: అరుళ్‌ శరవణన్‌, ఊర్వశి రౌతేలా, గీతిక, వివేక్, నాజర్, ప్రభు, విజయకుమార్, యోగిబాబు, తదితరులు
  దర్శకత్వం: జేడీ- జెర్రీ
  సంగీతం: హారిస్ జయరాజ్‌
  నిర్మాత: అరుళ్‌ శరవణన్‌

  English summary
  the saravana stores owner saravanan starrer The Legend Movie's exclusive filmibeat Review in telugu is here.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X