twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ది మమ్మీ మూవీ రివ్యూ

    మమ్మీల నేపథ్యంలో ఉన్న సినిమాలా కాకుండా ఏదో హారర్ యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    Star Cast: టామ్ క్రూయిజ్, అన్నాబెల్లె వాలిస్, సోఫియా బౌటెల్లా, రస్సెల్ క్రోవ్, జేక్ జాన్సన్
    Director: అలెక్స్ కౌర్ట్మెన్

    ఈజిప్టు మమ్మీల నేపథ్యంలో ఇప్పటి వరకు హాలీవుడ్లో మూడు సిరీస్ సినిమాలు వచ్చాయి. అన్నీ బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే ఈ సారి హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూయిస్ కూడా మమ్మీకి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

    ఇప్పటి వరకు వచ్చిన మమ్మీలన్నీ ఈజిప్ట్ నేపథ్యంలో సాగాయి. అయితే ఈ సినిమా మాత్రం మెసపటోనియా(ఇప్పటి ఇరాక్), లండన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన మమ్మీ సినిమాలకు భిన్నంగా ఇందులో ఏమైనా కొత్తగా చూపించారా? ప్రేక్షకులను ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

    కథ విషయానికొస్తే...

    కథ విషయానికొస్తే...

    మూడువేల సంవత్సరాల క్రితం సజీవంగా సమాధి చేయబడ్డ ఈజిప్ట్ యువరాణి ఆమెనెంట్(సోఫియా బౌటెల్లా) కథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఆమెనెంట్ గొప్ప అందగత్తె. యుద్ధవిధ్యల్లో ఆరితేరిన యువరాణి. దీంతో పాటు ప్రేమ, దయ లేని ఒక క్రూరురాలు. తన తండ్రి తర్వాత తనకే రాజ్యాధికారం దక్కుతుందనే ఆశతో ఉంటుంది. అయితే తన తండ్రి, సవతి తల్లికి మగబిడ్డ జన్మించడంతో తనకు పోటీగా వారుసుడు వచ్చాడని మదనపతుంది. ఎలాగైనా రాజ్యాధికారం దక్కించుకోవాలనే కాంక్షతో రగిలిపోయిన ఆమె..... దుష్టశక్తులను ఆశ్రయిస్తుంది.

    మృత్యుదేవుడు

    మృత్యుదేవుడు

    దుష్టశక్తుల సహాయంతో తండ్రిని, సవతి తల్లిని, వారికి జన్మించిన కుమారుడిని హతమారుస్తుంది. మృత్యుదేవుడిని వశం చేసుకుని.... జనన మరణాలను తన అదుపులో ఉంచుకునే శక్తిని పొందడానికి మృత్యుదేవుడు ఎంపిక చేయబడ్డ వ్యక్తిని శక్తులు కలిగిన ఖడ్గంతో చంపి ప్రపంచాన్ని ఏలే పవర్స్ పొందడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమెనెంట్ కుట్రను ఈజిప్టుకు రాజ్యానికి సైనికులు భగ్నం చేస్తారు. ఆమెను బంధించి...... ఈజిప్టకు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్న మెసపటోనియాలో సమాధి చేస్తారు.

    వేల సంవత్సరాల తర్వాత ఇరాక్‌లో

    వేల సంవత్సరాల తర్వాత ఇరాక్‌లో

    సైనిక గూడచారి అయిన నిక్ మార్టన్ (టామ్ క్రూయిజ్) ఆర్కియాలజిస్ట్ అయిన జెన్నీ(అన్నాబెల్లే వాలిస్) ద్వారా ఇరాక్‌లో సమాధి చేయబడ్డ మమ్మీ గురించి తెలుసుకుని అందులో ఏమైనా నిధులు దొరుకుతాయని వెతుకుతూ ఇరాక్ వెలుతాడు. అక్కడ ఓ సొరంగమార్గంలో ఆమెనెంట్ మమ్మీ బయట పడుతుంది. ఆమెనెంట్ మమ్మీని సైనిక విమానంలో లండన్ తీసుకెలుతుండగా మేల్కొన్న ఆమెనెంట్ విమానాన్ని క్రాష్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా చనిపోయినా..... టామ్ క్రూయిజ్ మాత్రం ఒక్క గాయం కూడా లేకుండా బయట బయటపడతాడు.

    అతడే ఎంపిక చేయబడ్డ వ్యక్తి

    అతడే ఎంపిక చేయబడ్డ వ్యక్తి

    విమాన ప్రమాదంలో టామ్ క్రూయిజ్ చావకుండా కాపాడింది మరెవరో కాదు..... ఆమెనెంట్. గతజన్మలో మృత్యుదేవుడు ఎంపిక చేయబడ్డ వ్యక్తి ఇతడే. ఎంపికచేయబడ్డ వ్యక్తి(టామ్ క్రూయిజ్‌)ని శక్తులు కలిగిన ఖడ్గంతో చంపి పవర్స్ పొందాలని, ప్రపంచాన్ని ఏలాలని ఆమెనెంట్ ప్రయత్నిస్తుంది. మరి ఆమెనెంట్ భారి నుండి ఈ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడు అనేది తర్వాతి స్టోరీ.

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    యాక్షన్ సీన్లలో టామ్ క్రూయిజ్ అదరగొట్టాడు. ఈజిప్టు యువరాణి గా, మమ్మీ ఆమెనెంట్ పాత్రలో సోఫియా బౌటెల్లా అద్భుతంగా నటించింది. ఆర్కియాలజిస్ట్ జెన్నీ పాత్రలో అన్నాబెల్లేవాలిస్ మెప్పించింది. పెర్ఫార్మెన్స్ పరంగా ఇతర నటీనటులంతా ఓకే...

    ఒళ్లుగగుర్బొడిచే గాఫిక్స్‌

    ఒళ్లుగగుర్బొడిచే గాఫిక్స్‌

    హాలీవుడ్ సినిమాలు అంటేనే గ్రాఫిక్స్ ఓ రేంజిలో ఉంటాయి. దాదాపు 800 కోట్ల ఖర్చు, టామ్ క్రూయిజ్ లాంటి స్టార్స్ నటిస్తున్న సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలోని గ్రాఫికల్ సీన్లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.

    ఉత్కంఠరేపే సన్నివేశాలు

    ఉత్కంఠరేపే సన్నివేశాలు

    సినిమాలో కొన్ని సీనూ ఉత్కంఠగా.... మరికొన్ని సీన్లు బోరింగ్ గా సాగాయి. సినిమా మొదటి నుండి చివరి వరకు కాస్త గజిబిజి గంధరగోళంగా స్క్రీన్ ప్లే ఉంది. కొన్ని చోట్లు మమ్మీలకు సంబంధించిన ఒళ్లుగగుర్బొడిచే సీన్లు ప్రేక్షకులను కాస్త భయాన్ని కలిగిస్తాయి.

    ఆ స్థాయిలో లేదు

    ఆ స్థాయిలో లేదు

    గతంలో వచ్చిన మమ్మీ సినిమాలతో పోలిస్తే, ఈ చిత్రం ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. మరి ఈజిప్టు నేపథ్యంలో సినిమా లేక పోవడమో, మరో కారణమో కానీ థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.

    కారణం అదే...

    కారణం అదే...

    గతంలో వచ్చిన మమ్మీ సినిమాల్లో మనుషులను చంపే వింత పురుగులు, ప్రేక్షకులు ఊహకు అందని ఆపదలు థ్రిల్ చేస్తాయి. అలాంటివి ఇందులో లేక పోవడం వల్ల ఇది మమ్మీల నేపథ్యంలో ఉన్న సినిమాలా కాకుండా ఏదో హారర్ యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

    ఫైనల్ వర్డ్...

    ఫైనల్ వర్డ్...

    గతంలో వచ్చిన మమ్మీ సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు వెళితే నిరాశే మిగులుతుంది. రెగ్యులర్ గా హాలీవుడ్ మూవీస్ చూసే వారికి కూడా ఈ సినిమా పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వకపోవచ్చు.

    ది మమ్మీ

    ది మమ్మీ

    తారాగణం: టామ్ క్రూయిజ్, అన్నాబెల్లె వాలిస్, సోఫియా బౌటెల్లా, రస్సెల్ క్రోవె, జేక్ జాన్సన్
    దర్శకత్వం: అలెక్స్ కౌర్ట్మెన్

    English summary
    The Mummy Movie Review: Tom Cruise's Film Is Thrilling Sometimes But Mostly Cumbersome. The big thrills and few laughs are no match for the cumbersome, convoluted story, not to mention the nonexistent chemistry between Tom Cruise and Annabelle Wallis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X