The Odyssey Critics Review: ది ఒడిస్సీ మూవీ క్రిటిక్స్ రివ్యూ

హాలీవుడ్‌లో పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఫాంటసీ చిత్రం ది ఒడిస్సీ. ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.

ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ముంబైలోను, అలాగే ఇతర దేశాల్లో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన తర్వాత క్రిటిక్స్ వెల్లడించిన తమ అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

The Odyssey Movie Critics Review
ది ఒడిస్సీ సినిమా చూడటం అద్బుతమైన అనుభవం. ఈ సినిమాను దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రిచ్ ఎమోషన్స్‌తో కన్నుల పండువగా విజువల్స్‌ను చిత్రీకరించారు. నేను ఎక్కువగా భావోద్వేగానికి గురవుతానని ఊహించలేదు. 3 వేల సంవత్సరాల క్రితం నాటి దేవుళ్లు, దేవతలు, భూతాలు, జంతువులుకు సంబంధించిన కథ ఈ తరానికి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంది. మరోసారి ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఎదురు చూస్తున్నాను అని క్రిటిక్ అనుపమ్ చోప్రా తన ట్వీట్‌తో రివ్యూ చేశారు.


క్రిస్టఫర్ నోలన్ ట్రేడ్ మార్క్‌కు తగినట్గుగా సినిమాటోగ్రఫి అదిరిపోయింది. ఈ సినిమా స్కేల్ ఓ రేంజ్‌లో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథను హై రేంజ్‌లో ఎలివేట్ చేసింది. కథలో లీనమయ్యేలా చేసింది. మూడు గంటలపాటు చెప్పలేని అనుభూతికి గురయ్యాను. సినిమా చూసినంత సేపు ఎమోషనల్‌గా ఫీలయ్యాను అని ప్రియాంక రాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


ది ఒడిస్సీ సినిమాను చూశాను. ప్రేక్షకులే కాదు.. దేవుళ్లు కూడా ఈ సినిమాను చూడటానికి ప్రిపేర్ అవుతారు. ఊహకు అందని విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చూసినంత సేపు పొందిన అనుభూతిని నేను ఎప్పటికీ మరచిపోలేను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ది ఒడిస్సీ సినిమా ఇన్‌క్రెడిబుల్. ఈ సినిమా చూసినంత సేపు నిజంగా ఎమోషనల్‌గా బరస్ట్ అయ్యాను. నటీనటుల పెర్ఫార్మెన్స్ దగ్గర నుంచి.. ప్రతీ ఒక్క విభాగం నుంచి క్రిస్టఫర్ రాబట్టుకొన్న పనితీరు హైలెట్‌గా ఉంది. మీరు ఒకవేళ ఈ సినిమాను ఐమాక్స్, 70ఎంఎం స్క్రీన్‌లో చూస్తే.. గుండె జారిపోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ అంటూ ఓ క్రిటిక్ తన రివ్యూను పోస్ట్ చేశారు.


ది ఒడిస్సీ సినిమాపై చెప్పలేనంత ప్రేమ కలిగింది. క్రిస్టఫర్ నోలన్ కథను తెరకెక్కించిన విధానం.. గ్రీక్ దేవతలను, దుష్ట శక్తులను చూపించిన విధానం.. స్క్రీన్ ప్లే మ్యాజిక్, రియలిజం చూస్తే.. ఆయన గ్రేటెస్ట్ ఫిలిం మేకర్స్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కర్మ సిద్దాంతం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మాట్ డెమన్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాటిన్సన్ తన పాత్రలో కమాండింగ్‌గా కనిపించాడు. ఈ సినిమా ష్యూర్ షాట్‌గా బ్లాక్‌బస్టర్. ప్రతీ ఒక్కరు మళ్లీ మళ్లీ చూడాలనుకొనే సినిమా. ఎంతో కమర్షియల్ పవర్ ఉన్న సినిమా అని క్రిటిక్ కామెంట్ చేశాడు.


ది ఒడిస్సీ సినిమాను చూశాను. ఈ సినిమాకు నేను ఇచ్చే 10/10 రేటింగ్ ఇస్తాను. బిగ్ స్క్రీన్ మ్యాజిక్ ఏమిటో ఈ సినిమా చూసిన తర్వాతే తెలిసింది. ఒక నిమిషం కూడా బోరింగ్ సీన్లు లేవు. సినిమాలో యాక్షన్, ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మాట్ డెమాన్, టామ్ హాలెంట్, పాటిన్సన్ పాత్రలు, పెర్ఫారెన్స్‌తో అదరగొట్టారు. తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమా అని క్రిటిక్ తన రివ్యూను పోస్టు చేశారు.


ది ఒడిస్సీ సినిమా చూసిన తర్వాత క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లో ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా ఫుల్ ఎంగేజింగ్‌గా ఉంది. కొన్నిసార్లు కంటతడి పెట్టాను. సినిమా చూసినంత సేపు నా హృదయం భావోద్వేగానికి లోనైంది. కథలోని ఇంటెన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్ సూపర్ అని ఓ క్రిటిక్ తన రివ్యూను పోస్ట్ చేశాడు.


ది ఒడిస్సీ సినిమా చూడటం పూర్తయింది. ఓ మై గాడ్.. ఈ మూవీ చూడటం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్, టామ్ హాలెండ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ప్రతీ సీన్‌లోని కమాండింగ్‌గా నటించాడు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ఎవరూ ఆపలేరు అని క్రిటిక్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X