The Rajasaab First Review: ది రాజాసాబ్ మూవీ ఫస్ట్ రివ్యూ
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమాకు సెన్సార్ అధికారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ మూవీకి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు రాజవంశం వారసత్వం ఉన్న రాజాసాబ్ (ప్రభాస్), నానమ్మ గంగాదేవి అలియాస్ గంగవ్వ (జరీనా వాహెబ్) ఆర్థికంగా చితికిపోయి సాధారణ జీవితం కొనసాగిస్తుంటారు. అయితే తమ వారసత్వ కట్టడం మయసభ లాంటి అతి పురాతన భవనంలోకి రాజాసాబ్ అడుగుపెడుతాడు. ఆ ఇంటి నుంచి బయటకు రావాలంటే.. తాత (ప్రభాస్) సంతకం కావాల్సి ఉంటుంది. ఆ మాయసభ లాంటి భవనంలోకి వెళ్లాక ఏం జరిగింది? తిరిగి తమ వారసత్వ సంపదను రాజాసాబ్ ఎలా దక్కించుకొన్నాడు? తాతను రాజాసాబ్ ఎలా మెప్పించాడు? అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా తాత మనవడు, నానమ్మ మనవడు మధ్య జరిగే ఎమోషనల్ బాండింగ్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన భైరవిగా మాళవిక, అనితగా రిద్ది కుమార్ నటించారు. కీలక పాత్రల్లో సంజయ్ దత్, నిధి అగర్వాల్ నటించారు.
ఇలాంటి హారర్, థ్రిల్లర్, ఎమోషన్స్‌తో ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు రివ్యూ చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌ను స్వల్ప మార్పులు చేయాలని సలహాలు, సూచనలు అందించారు. సెన్సార్ ఆదేశాల మేరకు టీమ్ సవరణలు చేసుకొన్నది. దాంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఈ సినిమా క్లియరెన్స్ లభించింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ప్రభాస్ నటించిన ఈ సినిమాపై సెన్సార్ బోర్డు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ మూవీకి యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్లకుపైబడిన వారు ఎలాంటి అనుమతుల్లేకుండా చూడొచ్చు. 16 ఏళ్లకు లోబడి ఉండే వాళ్లు మాత్రం తల్లిదండ్రులు పర్యవేక్షణలో వారి మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో అధికారులు వెల్లడించారు.
ప్రభాస్ కెరీర్‌లో కొత్త జోనర్‌గా రూపొందిన ఈ సినిమాను కథ డిమాండ్ మేరకు ఫన్ ఏ మాత్రం మిస్ కాకుండా, రెబల్ స్టార్ అభిమానులను సంతృప్తి పరిచేలా కట్ చేశారు. దాదాపు 45 నిమిషాలకుగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఉంటుంది. దాంతో ఈ సినిమా నిడివి సుమారుగా 3 గంటల 10 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే సుమారుగా 190 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ మూవీని ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది.
ది రాజా సాబ్ చిత్రం కోసం వేసిన సెట్స్, ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఈ సినిమా కథ, కథనాలు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ను యాక్షన్ హీరోగానే చూశాం. కానీ ఈ సినిమా ద్వారా రొమాంటిక్, ఎంటర్‌టైనర్‌గా కొత్త రూపాన్ని చూడనున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ మూడ్‌ను ప్రతిబింబించేలా మారుతి తెరకెక్కించారనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











