The RajaSaab Critic Review and Rating: ది రాజాసాబ్ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది.
ప్రభాస్ తన ఇమేజ్, స్టార్‌డమ్ పక్కన పెట్టి చేసిన చిత్రం ది రాజాసాబ్. ఫ్యామిలీ ఎమోషన్స్, నానమ్మ, మనవడి మధ్య ఉండే భావోద్వేగాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో హారర్, సస్పెన్స్ అంశాలు కొత్త అనుభూతికి గురి చేస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ వర్క్ థ్రిల్ చేస్తుంది. కాబట్టి సంక్రాంతి బరిలో ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుందని అంచనాలు పెంచేశారు.

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా స్థానికంగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రిలీజ్ సిద్దమైంది. అయితే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాను దుబాయ్ సెన్సార్ రివ్యూ సందర్భంగా వీక్షించిన క్రిటిక్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సినిమా గురించి క్రిటిక్ వెల్లడించిన అంశాలు, ఈ సినిమాకు ఇచ్చిన రేటింగ్ వివరాల్లోకి వెళితే..
ది రాజాసాబ్ చిత్రం పక్కా ఎంటర్‌టైనర్. ఈ సినిమా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు కోసం పర్‌ఫెక్ట్‌గా తీసిన చిత్రం. వారిని బాగా ఆలరిస్తుంది. ప్రభాస్, సంజయ్ దత్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఆ ఇద్దరి కాంబినేషన్ హైలెట్ అవుతుంది. అభిమానులను, ప్రేక్షకుల హృదయాలను వారు దోచుకొంటారు. ప్రభాస్‌ను అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు పండుగ భోజనం లాంటింది అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ది రాజాసాబ్ మూవీ చివరి 30 నిమిషాలు ఈ సినిమా అదిరిపోయేలా ఉంటుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు అత్యంత బలం. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి. మిస్ చేసుకోకండి అంటూ తన రివ్యూను ఇచ్చారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 పాయింట్లకు గాను.. 3.5 అని అన్నారు. ఈ సినిమాకు సానుకూలమైన రేటింగ్‌ను రివ్యూ ఇవ్వడంతో అంచనాలు రెండింతలు అయ్యాయి.
దుబాయ్‌కు చెందిన క్రిటిక్ అని చెప్పుకొనే ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు, వెల్లడించించే గాసిప్స్ చాలా కాంప్లికేట్‌గా ఉంటాయి. కొన్నిసార్లు ఈ అసత్యాలుగాను, వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఆయన బాగుందని ఆకాశానికి ఎత్తేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. బాగాలేవు అనే చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ సినిమా గురించి ఆయన ఇచ్చిన రివ్యూపై జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమా గురించి ఫిల్మీబీట్ ఇచ్చే ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, అప్ డేట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











