The RajaSaab Twitter Review: ది రాజాసాబ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా ముందస్తుగానే ప్రీమియర్లు, పెయిడ్ షోలు ప్రదర్శించారు. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

The RajaSaab Twitter Review

రాజాసాబ్ సినిమా ఫస్ట్ రివ్యూ. ఈ సినిమా పర్‌ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. ప్రభాస్, సంజయ్ దత్ కాంబో అదిరిపోతుంది. వారిద్దరూ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకొంటారు. ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌‌కు పర్‌ఫెక్ట్ ట్రీట్. సినిమా చివరి 30 నిమిషాలు కేక పెట్టిస్తుంది. ఈ సినిమాను మిస్ చేసుకోకండి అంటూ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.

ప్రభాస్ ఎంట్రీ బాగుంది. నిధి అగర్వాల్ ఎంట్రీ సీన్ బాగుంది. సహానా సహానా సాంగ్ కూల్‌, థమన్ బీజీఎం ఎక్కడా తగ్గలేదు. ప్రభాస్- నిధి అగర్వాల్ లవ్‌స్టోరీ బాగుంటాది. ఫన్నీ సీన్స్ సూపర్బ్. ఓవరాల్‌‌గా నైస్ ఫస్టాఫ్ అని యూజర్ ట్వీట్ చేశాడు.

ఫస్టాఫ్ పూర్తయ్యింది. ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ బ్లాస్టే. నిధి ఏంజెల్ డ్రెస్‌లో ఎంట్రీ సూపర్ ఉంటాది చారి. థమన్ అన్న బీజీఎం సూపర్. సహానా సహానా సాంగ్ బిగ్ స్క్రీన్ మీద ఫీస్ట్. ప్రభాస్, నిధి కెమిస్ట్రీ బాగుంది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

ప్రభాస్ ఎంట్రీ సీన్ మెస్సీగా ఇంపాక్ట్‌ ఫుల్‌గా ఉంది. థమన్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లు స్టన్నింగ్‌గా ఉన్నారు. ఎవ్వరూ ఊహించని ఒక పాత్ర ది రాజా సాబ్‌లో ఉంది. సంజయ్ దత్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది, హార్రర్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్బ్ అంటూ ఓ డార్లింగ్ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ ఫైర్. మాళవిక ఫైట్ బాగుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. థమన్ బీజీఎం భయపెట్టింది. ప్రభాస్‌ను ఇలా చూపించినందుకు డైరెక్టర్ మారుతిగారికి థ్యాంక్స్ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

ది రాజా సాబ్ ఎప్పటిలాగే ప్రభాస్ వన్‌మెన్ షో. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్‌ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. దర్శకుడు మారుతి .. రాజ్‌సాబ్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. సెకండాఫ్ అమెజింగ్‌గా ఉంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధికుమార్‌లు స్టన్నింగ్‌గా ఉన్నారు. సంజయ్ దత్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది. హార్రర్ సీన్స్ బాగున్నాయని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ బాగుంది. ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్, బీజీఎం బెస్ట్‌గా ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ బ్యాక్ ఇచ్చాడు అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.

More from Filmibeat

Read more about: the rajasaab prabhas maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X