For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Rose Villa movie review.బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతా వర్మ, దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా..ఆకట్టుకొనే థ్రిల్లర్.

  |

  Rating: 2.75/5

  లాక్‌డౌన్ కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల నిర్వహణకు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు సహాయ పడుతున్నాయి. కలెక్షన్ల పరంగా చిన్న సినిమాలు ఇండస్ట్రీకి అండగా నిలుస్తున్నాయి. అలాంటి కోవలోనే తెలుగు ప్రేక్షకులను ఆలరించడానికి వచ్చిన హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం ది రోజ్ విల్లా. బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ, కన్నడలో దియా చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొన్న దీక్షిత్ శెట్టి నటించిన చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయంలోకి వెళితే....

  ది రోజ్ విల్లా కథ ఏమిటంటే..

  ది రోజ్ విల్లా కథ ఏమిటంటే..

  ప్రేమికులైన శ్వేత (శ్వేతా వర్మ, డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి) విహార యాత్ర కోసం దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్తారు. అడవిలో వారి కారు చెడిపోవడంతో సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీస్ సాల్మన్ (రాజా రవీంద్ర), హెలెన్ (అర్చనా కుమార్) అనే ఒంటరి వృద్ధ దంపతులు పరిచయం అవుతారు. అయితే శ్వేత, రవిని బలవంతంగా వారి ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్తారు. అయితే సాల్మన్, హెలెన్ విచిత్ర ప్రవర్తన వారికి అనేక అనుమానాలు తలెత్తుతాయి. వారి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తే శ్వేత, రవిని బంధిస్తారు.

  ట్విస్టులతో ఫీల్‌గుడ్‌గా

  ట్విస్టులతో ఫీల్‌గుడ్‌గా


  శ్వేత, రవిని ఎందుకు సల్మాన్ బంధించాడు? హెలెన్ సైకోలా వ్యవహరించడానికి కారణాలు ఏమిటి? వారి నుంచి శ్వేత, రవి తప్పించుకొనే ప్రయత్నంలో ఏం జరిగింది? పోలీసులు వారికి ఎలాంటి రక్షణ కల్పించారు. యువకులను సల్మాన్, హెలెన్ ఎందుకు టార్గెట్ చేశారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ది రోజ్ విల్లా సినిమా కథ.

  రోజ్ విల్లా ఎలా ఉందంటే..

  రోజ్ విల్లా ఎలా ఉందంటే..


  అందమైన ప్రదేశంలో, ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ది రోజ్ విల్లా కథ శ్వేత, డాక్టర్ రవిల ప్రేమ వ్యవహారంతో మొదలవుతుంది. తొలి సీన్లలోనే శ్వేతావర్మ, డాక్టర్ రవి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొంటుంది. ఇక రాజ రవీంద్ర, అర్చన కుమార్ (హెలెన్) పాత్రలు ఎంట్రీ ఇచ్చాక సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. తల్లిదండ్రులను ఒంటరి చేసి వెళ్లిన కథాంశం సినిమాను ఫీల్‌గుడ్‌గా మారుతుంది. ఇలా ఫస్టాఫ్‌లో సానుకూలంగా సాగితే.. సెకండాఫ్ విషయానికి వస్తే.. రాజ రవీంద్ర, అర్చన కుమార్ ఫ్యాష్‌బ్యాక్ మొదలవుతుంది. అయితే సెకండాఫ్‌లో కథలో మిస్టరీ ఎలిమెంట్ మరింత ఆసక్తిని రేపుతుంది. శ్వేత, రవి పారిపోవడానికి ప్రయత్నించడం, అలాగే హెలెన్ పాత్రలో అర్చనా రావుకు సంబంధించి కొత్త కోణం బయటకు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అలాగే చివర్లో అర్చనరావు, దీక్షిత్ శెట్టి మధ్య సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా మారి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాయి.

  దర్శకుడు హేమంత్ ప్రతిభ

  దర్శకుడు హేమంత్ ప్రతిభ

  యువ దర్శకుడు హేమంత్ తెరకెక్కించిన చిత్ర కథ చిన్న పాయింట్‌లా కనిపిస్తుంది. కానీ మదర్ సెంటిమెంట్‌తో కూడిన భావోద్వేగమైన చిత్రంగా పేర్కొన్నవచ్చు. దర్శకుడిగా హేమంత్ కథను నడిపించిన విధానం బాగుంది. నటీనటుల నుంచి రాబట్టుకొన్న ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అయింది.

  శ్వేతా వర్మ, దీక్షిత్ శెట్టి కెమిస్ట్రీ

  శ్వేతా వర్మ, దీక్షిత్ శెట్టి కెమిస్ట్రీ

  ఇక శ్వేతగా బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతా రావు తన పాత్ర పరిధి మేరకు విభిన్నమైన నటనను ప్రదర్శించింది. శ్వేత బాడీ లాగ్వేంజ్, గానీ ఎక్స్‌ప్రెషన్ ఫ్రెష్‌గా ఉన్నాయి. అలాగే దీక్షిత్ శెట్టి తనదైన నటనతో ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్ల ఆయన ఫెర్ఫార్మెన్స్ హైలెట్ అయింది. తల్లి, కొడుకుల అనుబంధాన్ని చూపే పాత్రలో ఆకట్టుకొన్నాడు. ఇక రాజా రవీంద్రకు ఇటీవల కాలంలో మంచి బరువైన పాత్రలో కనిపించాడు. సినిమా మొత్తానికి ఆయన పాత్ర కీలకంగా మారింది. అలాగే హెలెన్ పాత్రలో అర్చన కుమార్ డిఫెరెంట్ రోల్ ప్లే చేశారని చెప్పవచ్చు. కథకు ఆమె పాత్ర బలంగా మారిందని చెప్పవచ్చు.

  టెక్నికల్ విభాగాల పనితీరు

  టెక్నికల్ విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే.. ది రోజ్ విల్లా సినిమాకు సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అని చెప్పవచ్చు. టైటిల్స్‌ వచ్చే పాట లవ్లీగా ఉంది. కొన్ని సన్నివేశాలను తన మ్యూజిక్‌తో సురేష్ బొబ్బిలి ఫీల్‌గుడ్‌గా మార్చారు. ముఖ్యంగా ఈ సినిమాకు గరుడవేగ అంజీ అందించిన సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అందమైన లొకేషన్లు, పచ్చిక బయళ్ల మధ్య సన్నివేశాలు కనులకు విందుగా మారేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక శివ అందించి ఎడిటింగ్ కూడా బాగుంది.

  తుది తీర్పు

  తుది తీర్పు

  ది రోజ్ విల్లా సినిమా విషయానికి వస్తే.. నిర్మాత అచ్యుత్ రామారావు అలియాస్ వెన్నెల రామారావు స్వయంగా నటించి నిర్మించారు. ఇన్స్‌పెక్టర్‌గా ఈ కథకు పరిష్కారం చూపించే ప్రత్యేక పాత్రలో ఆయన స్టైల్ బాగుంది. అలాగే నటీనటుల ఎంపిక విషయంలో నిర్మాతగా ఆయన అభిరుచి ఏమిటో చెప్పకనే చెప్పారు. సాంకేతిక నిపుణులు సెలక్షన్ బాగుంది. సాధారణంగా చిన్న పాయింట్‌తో తక్కువ మంది నటీనటులతో మంచి కాన్సెప్ట్‌తో రూపొందే చిత్రాలు హాలీవుడ్‌లో కనిపిస్తాయి. అలాంటి ప్రభావంతో ఈ సినిమాను అందించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత దృష్ణి పెట్టి ఉంటే.. ఇటీవల కాలంలో మంచి థ్రిల్లర్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇస్టే పడే వారికి ది రోజ్ విల్లా తప్పకుండా నచ్చుతుంది.

  రోజ్ విల్లాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  రోజ్ విల్లాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజ రవీంద్ర, వెన్నెల రామారావు, టీఎన్నార్, అర్చనా కుమార్ తదితరులు
  దర్శకత్వం: హేమంత్
  మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి
  సినిమాటోగ్రఫి: గరుడువేగ అంజి
  ఎడిటింగ్: శివ
  నిర్మాత: అచ్యుత్ రామారావు పీ
  బ్యానర్: చిత్ర మందిర్ స్టూడియోస్
  రిలీజ్ డేట్: 2021-10-10

  English summary
  The Rose Villa movie review and rating: Deekshith Shetty, Swetha Varma, Raja Ravindra, Vennela Ramarao, TNR, Archana Kumar and others. Directed by Hemanth and produced by Achut Rama Rao P
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X