The Royals Web Series Review: ది రాయల్స్ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: ఇషాన్ కట్టర్, భూమీ పడ్నేకర్, జీనత్ ఆమన్, సాక్షి తన్వర్, విహన్ సమత్, మిలింద్ సోమన్, చంకీ పాండే, డినో మారియా, నోరా ఫతేహి తదితరులు
క్రియేటర్స్: రంగితా ప్రీతీష్ నంది, ఇషితా ప్రీతీష్ నంది
దర్శకత్వం: ప్రియాంక ఘోష్, నూపుర్ ఆస్థానా
నిర్మాత: ప్రీతీష్ నంది
బ్యానర్: ప్రీతీష్ నంది కమ్యూనికేషన్స్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఎపిసోడ్స్: 8

రాజస్థాన్‌లోని సో మోర్పూర్ రాజ సంస్థానానికి చెందిన యువరాజు అవిరాజ్ (ఇషాన్ కట్టర్). అమ్మమ్మ సాసీ (జీనత్ ఆమన్), తల్లి పద్మజ (సాక్షి తన్వర్), సోదరుడు డిగ్గి (విహాన్ సమత్), సోదరి జిన్నీ (కావ్య ట్రెహాన్)తో కలిసి విలాసవంతంగా జీవిస్తుంటారు. అయితే ఊహించని విధంగా రాజ పరివారంలో ఆర్థిక సమస్యలు తీవ్రంగా తలెత్తుతాయి. దాంతో తాము ఉండే రాయల్ ప్యాలెస్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌కు అద్దెగా ఇవ్వాలని నిర్ణయించుకొంటారు. ఈ నేపథ్యంలో ఫైవ్ స్టార్ హోటల్ సీఈవో సోఫియా కన్మని శేఖర్ (భూమీ పడ్నేకర్) రాజ పరివారంలోకి అడుగుపెడుతుంది.

The Royals Web Series Review

మోర్పూర్ సంస్థానంలో అవిరాజ్ ఫ్యామిలీకి ఆర్థిక సమస్యలు ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టాయి? ప్యాలెస్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చడానికి కుటుంబ ఎలాంటి తర్జనభర్జన పడింది? అవిరాజ్‌కు సోఫియా ఎలా దగ్గరైంది? సోఫియాకు తన సహ ఉద్యోగి కునాల్ (ఉదిత్ అరోరా)తో బ్రేకప్ ఎందుకు అయింది? అవిరాజ్‌తో సోఫియా రొమాన్స్ ఎలా సాగింది? రాజ కుటుంబానికి ఎదురైన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ది రాయల్స్ వెబ్ సిరీస్ కథ.

ది రాయల్స్ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. సింపుల్‌గానే ఉంటుంది. విలాసవంతంగా బతికే రాజ కుటుంబం ఆర్థిక కష్టాల్లో పడటం, వాటి వల్ల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం పడింది? కష్టాల్లోను రాజ కుటుంబీకులు ఎలాంటి దర్బాన్ని చూపించే ప్రయత్నం చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్‌లోకి రొమాంటిక్ కంటెంట్‌ను బలవంతంగా జొప్పించి.. ఆ స్టోరీలో ఉండే ఇంటెన్సినీని దెబ్బ తీశారనిపిస్తుంది. చివరకు రొమాంటిక్ లవ్ స్టోరీనా? ఎమోషనల్ రాయల్ ఫ్యామిలీ కథనా? అనే విషయంపై పూర్తిగా గందరగోళం ఏర్పడుతుంది. అవిరాజ్, సోఫియా మధ్య ఉండే రొమాన్స్ పూర్తిగా ఆర్టిఫిషియల్‌గానే కనిపిస్తుంది.

కథలో ఎమోషన్స్‌కు స్కోప్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా దృష్టిపెట్టలేదనే విషయం తొలి రెండు ఎపిసోడ్స్‌లోనే తేలిపోతుంది. మిగితా 6 ఎపిసోడ్స్ సాగదీసి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. అయితే క్లైమాక్స్ బలహీనంగా ఉండటం వల్ల అంతగా ఆకట్టుకోలేకపోతుంది. వెబ్ సిరీస్ చూసిన తర్వాత అందులో బలమైన పాయింట్ ఏమిటనే విషయం ఎట్టి పరిస్థితుల్లోను బోధపడదనిపిస్తుంది.

The Royals Web Series Review

నటీనటుల విషయానికి వస్తే.. అవిరాజ్‌గా ఇషాన్ కట్టర్ పెర్ఫార్మెన్స్ చూస్తే.. గొప్పగా, ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు. ఆరు ముద్దులు, మూడు కౌగిలింతల క్యారెక్టర్‌లో కనిపించాడు. భూమీ పడ్నేకర్‌ను ముద్దులు పెట్టుకోవడమో లేదా.. అర్ధనగ్నంగా గుర్రమెక్కి గోల్ఫ్ ఆడుకోవడమో చేస్తుంటాడు. ఇక భూమి పడ్నేకర్ పాత్ర ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ తీసుకొన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ పాత్రలో కూడా బలం లేకపోవడంతో రొమాన్స్ కోసమే ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారా? అనే అనుమానం వస్తుంది.

చాలా రోజుల తర్వాత జీనత్ ఆమన్ తెరపైన కనిపించింది. కానీ ఆమె టాలెంట్‌ను పూర్తిగా వృధా చేయడంతోపాటు గాలికి వదిలేసినట్టు కనిపిస్తుంది. సాక్షి తన్వర్ పర్వాలేదనిపిస్తుంది. నోరా ఫతేహి, డినో మారియా, చంకీ పాండే, మిలింద్ సోమన్ నామమాత్రంగానే మిగిలిపోయారు. మిగితా నటీనటులు సాదాసీదా పాత్రల్లోనే మిగిలిపోయారు.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో గొప్పగా కంటెంట్ లేకపోవడం నిరాశ పరిచే అంశం. ఆర్టిఫిషియల్ రొమాన్స్, కామెడీ చూస్తే.. స్క్రిప్టు పరంగా అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. కానీ ప్రొడక్షన్ వాల్యూస్, నటీనటుల ఎంపిక చాలా బాగుంది. వీటిపై భారీగా కసర్తత్తు చేసిన టీమ్.. కంటెంట్‌ను పట్టించకోలేదని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రాండియర్ లుక్, విజువల్ బ్యూటీ, కెమెరా వర్క్ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇషాన్, భూమీ రొమాన్స్ చూద్దామనుకొనే వారు ఎలాంటి అంచనాల లేకుండా.. బోర్ కొట్టినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో స్కిప్ చేస్తూ ఈ వెబ్ సిరీస్‌ను ముగించేయ వచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X