The Taj Story Movie Review: ది తాజ్ స్టోరి హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: పరేశ్ రావల్, జాకీర్ హుస్సేన్, అమృతా ఖాన్‌విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాగ్, అఖిలేంద్ర మిశ్రా, బ్రిజేంద్ర కాలా, కరమ్ వీర్ చౌదరీ తదితరులు
రచన, దర్శకత్వం: తుషార్ అమ్రీష్ గోయల్
నిర్మాత: సీఏ సురేష్ జా
సినిమాటోగ్రఫి: సత్యజిత్ హజర్నిస్
ఎఢిటింగ్: హిమంశు ఎం తివారీ
మ్యూజిక్: రోహిత్ శర్మ, రాహుల్ దేవ్ నాథ్
బ్యానర్: స్వామిమ్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
రిలీజ్ డేట్: 2025-10-31

ఆగ్రా పట్టణంలో విష్ణు దాస్ (పరేష్ రావల్) గైడ్‌గా పనిచేస్తుంటాడు. గైడ్‌గా పనిచేసే తన తండ్రి సూసైడ్ చేసుకొని మరణిస్తాడు. మూడు, నాలుగు తరాలుగా గైడ్ వృత్తిలోనే విష్ణుదాస్ కుటుంబం జీవనం సాగిస్తుంటుంది. ఆగ్రాలో జరిగే గైడ్ అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణుదాస్ పోటీ చేయాలనుకొంటాడు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజ్ మహల్ నిర్మాణం షాజహాన్ చేపట్టలేదు. ఆ ప్రాంతంలో ఇంతకు ముందు ఓ ఆలయం ఉండేది. దానిపైనే తాజ్ మహల్ కట్టాడని తన ఇంటర్వ్య్యూలో వివాదస్పదంగా ఓ బాంబు పేల్చుతాడు. ఆ తర్వాత విష్ణు దాస్ జీవితం ప్రమాదంలో పడుతుంది. ముస్లిం ఆధిపత్యం కొనసాగించే గైడ్ అసోసియేషన్ నుంచి విష్ణుదాస్ కుటుంబానికి ప్రతిఘటన ఎదురవుతుంది. ఆయన కుమారుడిని గైడ్ విధుల నుంచి బహిష్కరిస్తారు. ఈ క్రమంలో ఆయన కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే ది తాజ్ స్టోరి (The Taj Story) సినిమా కథ.

The Taj Story Hindi Movie Review

తాజ్ మహల్ కట్టడంపై దర్శకుడు తుషార్ అమ్రీష్ గోయల్ రాసుకొన్న కథ అత్యంత వివాదాస్పదమైన అంశాలతో ముందుకు సాగుతుంది. ఈ కథ గురించి చేసిన పరిశోధన, పూర్వ చరిత్రను తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. అంతేకాకుండా ఒక చిన్న పాయింట్‌ను పట్టుకొని.. వాస్తవాల ఆధారంగా పక్కాగా స్క్రీన్ ప్లేను రూపొందించడంలో సక్సెస్ అయ్యాడు. కోర్టు రూమ్ డ్రామాను నడిపించిన తీరు ఆయనకు కథపై, తాజ్ మహల్ కట్టడం వెనుక చరిత్రపై పూర్తి పట్టు ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే స్టోరీ విషయంలోను, సన్నివేశాల విషయంలోను, అలాగే డైలాగ్స్ రాసుకొని తెరకెక్కించిన విషయంలో ఉన్న కమిట్‌మెంట్, కన్విన్స్ చేసే విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. అయితే కథలో వైవిధ్యం లేకపోవడం, పూర్తిగదా కోర్టు రూమ్ డ్రామాగా నడిపించడం కొన్ని సార్లు విసిగించేలా ఉంటుంది. డాక్యుమెంటరీ తరహాలో సాగడం కొంత మైనస్‌గా అనిపిస్తుంది.

తాజ్ మహల్ నిర్మాణం బ్యాక్ డ్రాప్‌తో సాగే కోర్ట్ రూమ్ డ్రామాలో విష్ణు దాస్ పాత్ర చుట్టే కథ సాగుతుంది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా నిలిచిన పాత్రలో చెలరేగిపోయాడు. తన పిల్‌ను తానే వాదించేకొనే వ్యక్తిగా.. తాను చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ఆయనలోని నటనా విశ్వరూపాన్ని చూసే అవకాశం కలిగింది. ప్రత్యర్థి లాయర్‌ రియాజ్‌గా జాకీర్ హుస్సేన్ పోటాపోటీగా నటించాడు. పరేష్ రావల్‌తో కలిసి కోర్టు రూమ్ డ్రామాను రక్తి కట్టించాడు. ఈ ఇద్దరి పాత్రల ముందు మరో క్యారెక్టర్ కథలో బలంగా కనిపించలేకపోయింది.

సాంకేతిక అంశాల వివరాల్లోకి వెళితే.. డైలాగ్స్‌తో డామినేట్ చేసే సినిమా కావడంతో కొన్నిసార్లు మాటలు తూటల్లా పేలాయి. మరికొన్ని సార్లు హాస్యాన్ని పండించాయి. ఇంకా కొన్ని మార్లు వాస్తవాలు వెల్లడించినప్పుడు నిజమేనా? అనే విధంగా ఆలోచింప చేస్తాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా, తాజ్ నిర్మాణంపై చరిత్రకారులు రాసిన గ్రంథాల ఆధారంగా, సాక్ష్యాలుగా చేసుకొని దర్శకుడు తన వాదనను వినిపించిన తీరు బాగుంది. సత్యజిత్ హజర్నిస్ ఈ సినిమాను చిత్రీకరించిన విధానం, కోర్టు రూమ్ డ్రామాను నడిపించిన విధానం బాగుంది. ఈ సినిమా కథ చెప్పే విషయం ఓ సవాలే.. అయితే హిమంశు తివారీ సన్నివేశాల కూర్పు సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో రోహిత్ శర్మ, రాహుల్ దేవ్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సీఏ సురేష్ జా అనుసరించిన నిర్మాణ విలువలే కాకుండా వాస్తవాలను చెప్పాలనే తపన, అభిరుచి ప్రస్పుటంగా కనిపించింది.

ఓవరాల్‌గా ది తాజ్ స్టోరి సినిమా విషయానికి వస్తే.. తాజ్ మహల్ నిర్మాణం షాజహాన్ ప్రేమకు చిహ్నం కాదు. It's Symbol of Atrocity, It's Symbol of Genocide అని దర్శకుడు తన సినిమాలో విష్ణు దాస్ పాత్ర ద్వారా చెప్పించి కొత్త వాదనకు తెరలేపాడు. తాజ్ నిర్మాణానికి ముందే ఆ ప్రాంతంలో శివుడి ఆలయం ఉంది. దానిపైనే షాజహాన్ నిర్మించాడు. అందుకే ఇప్పటికే నేల మాళిగలో గదులకు తాళం వేసి ఎవరినీ అనుమతించరు. తాజ్ నిర్మాణం జరగకముందే 200, 300 ఏళ్ల కిందటనే అక్కడ ఆలయం ఉందని చరిత్రకారులు వెల్లడించారు. మొఘలుల కాలంలో ఆలయాల విధ్వంసం జరిగింది. బ్రిటీష్ కాలంలో ఎలాంటి విధ్వంసాలు జరగలేదు. శివాజీ, మహరాణా ప్రతాప్, శంభాజీ మహారాజ్ లాంటి మహనీయుల జీవితను పాఠ్యాంశాలుగా చెప్పకుండా మొఘల్ రాజుల చరిత్రను బలవంతంగా చరిత్రకారులు రుద్దుతున్నారు. ఇలాంటి విద్యా విధానం వల్ల చరిత్రను తెలుసుకొనే విషయంలో జనరేషన్స్ తప్పుదోవ పడుతున్నారు.

ఆలయాల చరిత్రను తెలుసుకోవాలంటే.. Carbon Dating అనే టెక్నాలజీతో వాస్తవాలను నిగ్గు తేల్చాలనే డిమాండ్‌ను సినిమా ద్వారా తెరపైకి తెచ్చారు. ఈ సినిమాను అందించే క్రమంలో చేసిన పరిశోధనను, సంపాదించిన పుస్తకాల ద్వారా కథను చెప్పిన తీరును అభినందించాలి. వివాదాస్పద అంశాలతో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి, ఓపెన్ మైండ్ ఉండే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X