For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Warrior Movie Review.. రామ్, ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ ఫెర్పార్మెన్స్.. కృతిశెట్టి గ్లామర్ ఎలా ఉందంటే?

  |

  Rating: 3/5

  ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి సక్సెస్‌పుల్ చిత్రాలతో ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని మాస్ ఫాలోయింగ్‌తో మంచి జోష్‌తో ముందుకెళ్తున్నాడు. తాజాగా పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర ద్వారా ది వారియర్ అనే సినిమాతో తెలుగుతోపాటు తొలిసారి తమిళ సినీ రంగంలో అడుగుపెట్టారు. విడుదలకు ముందు రిలీజైన ది వారియర్ పాటలు, టీజర్లు, ట్రైలర్లు ది వారియర్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రామ్‌ ఖాతాలో సక్సెస్‌ను చేర్చించిందా? పవర్‌పోలీస్ పాత్రతో రామ్ పోతినేని ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. ది వారియర్ మూవీ కథ, కథనాలను సమీక్షించాల్సిందే..

  ది వారియర్ కథ ఏమిటంటే?

  ది వారియర్ కథ ఏమిటంటే?

  సత్య (రామ్ పోతినేని) డాక్టర్‌ విద్యను పూర్తి చేసుకొని కర్నూలులో హౌస్ సర్జన్‌ పోస్టింగ్ అవుతాడు. తల్లి (నదియా)తో కలిసి కర్నూలుకు చేరిన సత్యకు అక్కడి గ్యాంగ్‌స్టర్ గురు (ఆది పినిశెట్టి)తో వైరం ఏర్పడుతుంది. గురు ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే అప్పటి వరకు కర్నూలులో ఎదురులేని ఫ్యాక్షన్ సామ్రాజ్యాన్ని విస్తరించిన గురుకు డాక్టర్ సత్య కంట్లో నలుసుగా మారుతాడు.

  మూవీలో ట్విస్టులు ఇలా..

  మూవీలో ట్విస్టులు ఇలా..

  సత్య జీవితంలోకి విజిల్ మహాలక్ష్మీ (కృతిశెట్టి) ఎలా ప్రవేశించింది. సత్య, మహాలక్ష్మీ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? డాక్టర్‌గా సత్య కర్నూలు ఫ్యాక్షన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? గురు అక్రమాలను సహించలేని సత్య ఎలా నిర్ణయం తీసుకొన్నాడు. డాక్టర్‌గా సేవలందించే సత్య పోలీస్‌గా మారడం వెనుక ట్విస్ట్ ఏమిటి? పోలీస్ ఆఫీసర్‌గా కర్నూలుకు వచ్చిన సత్య.. గురు ఆగడాలకు ఎలా చెక్ పెట్టాడు. సత్య వేసే ఎత్తులను గురు ఎదిరించాడా? గురు అన్యాయాలకు సత్య ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే ది వారియర్ సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా

  ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా

  కర్నూలులో తిరుగులేని ఫ్యాక్షన్ లీడర్, అన్యాయాన్ని సహించలేని సాధారణ డాక్టర్ మధ్య జరిగే యాక్షన్ డ్రామా రెగ్యులర్ కథ మాదిరిగానే అనిపిస్తుంది. కాకపోతే దర్శకుడు కథను నడిపించిన విధానం.. పాత్రల పరిచయం కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల మెదడుకు ఎలాంటి పని పెట్టకుండా ఫస్టాప్‌లో కథను ఫ్యామిలీ ఎమోషన్స్, కృతిశెట్టి‌తో లవ్ ట్రాక్ ఫీల్‌గుడ్‌గా సాగుతాయి.

  ఇలాంటి ఫీల్‌గుడ్ అంశాల మధ్య గురు పాత్రను ఎలివేట్ చేసిన విధానం లింగుస్వామి స్క్రీన్ ప్లే చిన్నపాటి మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది. విలన్, హీరో మధ్య ఉండే రెగ్యులర్‌ స్టోరిని కొత్తగా ప్రజెంట్ చేయడంతో ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. హీరో రామ్ చేసిన డాక్టర్ పాత్ర అనేది ఫస్టాఫ్‌లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా అనిపిస్తుంది. ఒక మంచి ట్విస్టుతో ది వారియర్ మూవీపై అంచనాలను, జోష్‌ను పెంచడంలో లింగుస్వామి సక్సెస్ అయ్యాడు.

  సెకండాఫ్‌లో నువ్వా నేనా?

  సెకండాఫ్‌లో నువ్వా నేనా?

  ఇక సెకండాఫ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా రామ్ ఎంట్రీ పవర్‌ఫుల్‌గా మొదలవుతుంది. అయితే ఆది పినిశెట్టి, రామ్ మధ్య సన్నివేశాలు కొన్ని ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయే తప్పా.. మొదట్లో ఉన్న టెంపోను కొనసాగించకపోవడంతో లింగుస్వామి ఏం చేయబోతున్నాడనే విషయంపై ఆసక్తి కలుగుతుంది. అయితే కథ బలంగా లేకపోవడంతో రకరకాల ఎపిసోడ్స్‌తో క్లైమాక్స్‌ను ముగించాడనే అనిపిస్తుంది. కాకపోతే కథను పక్కన పెడితే.. స్క్రీన్ ప్లే, ముఖ్యంగా ఆది పినిశెట్టి, రామ్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అత్యంత బలంగా కనిపిస్తాయి.

  లింగుస్వామి పాయింట్ ఒకే.. కథ విషయంలోనే..

  లింగుస్వామి పాయింట్ ఒకే.. కథ విషయంలోనే..

  దర్శకుడు లింగుస్వామి రాసుకొన్న పాయింట్ బ్రహ్మండంగా అనిపిస్తుంది. ప్రాణాలు పోసే డాక్టర్.. ప్రాణాలకు రక్షణ కల్పించే పోలీస్ ఈ రెండు పాత్రలను బ్లెండ్ చేసి రాసుకొన్న స్క్రిప్టు ఆకట్టుకొనే పాయింటే. కాకపోతే కథా విస్తరణలో లింగుస్వామి తడబాటు కనిపిస్తుంది. బలమైన పాత్రలను తెరపైన సృష్టించాడు. కానీ ఆ పాత్రలకు తగినట్టుగా సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే.. మరో పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా అయి ఉండేదనిపిస్తుంది.

  రామ్ పోతినేని మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్

  రామ్ పోతినేని మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్

  ఇక రామ్ పోతినేని ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మానవీయ కోణంలో సాగే డాక్టర్‌ పాత్రలో, అలాగే అన్యాయాలను ఎదురించే పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. రెండు రకాల షేడ్స్, వేరియేషన్స్‌తో సినిమా భారాన్ని ఒంటిచేత్తో మోసాడు. దర్శకుడిలోని లోపాలను కప్పిపుచ్చేంతగా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన రామ్.. ఈ చిత్రంతో మరోసారి మాస్ హీరోగా అలరించాడు. ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్‌, డ్యాన్సులు, యాక్షన్ సీన్లలో కూడా ఇరగదీయడమే కాకుండా ఫుల్ ఎనర్జీతో కనిపిస్తాడు.

  ఆది పినిశెట్టి పర్‌ఫుల్ విలనిజం

  ఆది పినిశెట్టి పర్‌ఫుల్ విలనిజం

  మిగితా పాత్రల విషయానికి వస్తే.. సరైనోడు సినిమా తర్వాత ఆది పినిశెట్టి మరోసారి పవర్‌ఫుల్ విలన్‌గా చెలరేగిపోయాడు. గురు పాత్రతో తెర మీద పక్కా విలనిజాన్ని పండించాడు. ది వారియర్ సినిమాకు ఆది వెన్నముకగా నిలిచాడంటే అతిశయోక్తి కాదు. కరడు గట్టిన ఫ్యాక్షన్ లీడర్‌గా ఆది పినిశెట్టి ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తాడని చెప్పవచ్చు. ఇక కృతిశెట్టి రేడియో జాకీగా కనిపించింది. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించింది. రెడిన్ కింగ్స్‌లే, నదియా, జయప్రకాశ్, ఆనంద చక్రపాణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

  టెక్నికల్ విభాగాల పనితీరు

  టెక్నికల్ విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ సీన్లు, ఛేజింగ్ సీన్లను తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు మ్యాజిక్ ఫ్యాక్టర్‌ను తెచ్చిపెట్టింది. సెకండాఫ్‌లోని పలు సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా మారింది. ఎడిటర్ నవీన్ నూలి కూడా పనితనం బాగుంది.

   ప్రోడక్షన్ వ్యాల్యూస్

  ప్రోడక్షన్ వ్యాల్యూస్

  ఫీల్‌గుడ్, యాక్షన్, ఎమోషన్స్‌తో ది వారియర్ సినిమాగా రూపొందించడంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకం సక్సెస్ అయింది. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి, సమర్పకుడు పవన్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు ఈ సినిమాను రిచ్‌గా మార్చాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటులు ఎంపిక విధానం సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజేసింది. ఉత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకుడికి మంచి చిత్రాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారు.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మెడికల్ మాఫియాపై ఓ పోలీస్ ఆఫీసర్‌గా మారిన డాక్టర్ సాగించిన పోరాటంగా ది వారియర్ తెరకెక్కింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగితే.. రెండో భాగం ఎమోషనల్‌గా, యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకొంది. ఇంటర్వెల్ ముందు ట్విస్టు ఈ సినిమాకు హైలెట్ మాత్రమే కాకుండా కథను మరో మలుపుతిప్పేలా ఉంటుంది. రెండో భాగంలో బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణ.

  మాస్ ఆడియెన్స్‌కు యాక్షన్, మసాలా సీన్లు కిక్కెకించేలా ఉంటాయి.కథ మైనస్ అనిచెప్పవచ్చు. రామ్, ఆది పినిశెట్టి పవర్‌ప్యాక్ పెర్ఫార్మెన్స్, కృతిశెట్టి గ్లామర్ ప్రేక్షకుడికి నూటికి నూరు శాతం వినోదాన్ని, మంచి ఫీల్‌ను అందిస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  రామ్, ఆది పినిశెట్టి ఫెర్ఫార్మెన్స్
  ఫస్టాఫ్
  మ్యూజిక్
  స్క్రీన్ ప్లే
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్
  కథ
  రెగ్యులర్ కథ

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: రామ్ పోతినేని, కృతిశెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా, జయప్రకాశ్, ఆనంద చక్రపాణి, రెడిన్ కింగ్స్‌లే తదితరులు
  ఎడిటింగ్: నవీన్ నూలి
  ఆర్ట్: డీవై సత్యనారాయణ
  యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు
  సినిమాటోగ్రఫి: సుజీత్ వాసుదేవ్
  డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి
  సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
  బ్యానర్: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్
  స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌
  నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి
  కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి
  రిలీజ్ డేట్: 2022-07-14

  English summary
  Ram Pothineni and Lingusamy's The Warrior movie released on July 14th. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X