Thimmarajupalli TV Movie Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: సాయి తేజ్, వేదా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, మాధవి ప్రసాద్, తేజ విహన్, సత్య నారాయణ, టీవీ రామన్, అన్షుమన్, లతీష్ కీలపట్టు తదితరులు
దర్శకత్వం: వీ మునిరాజ్
నిర్మాత: కిరణ్ అబ్బవరామ్
సహ నిర్మాత: తేజా వెల్పుచర్ల
సీఈవో: రహస్య కిరణ్
మ్యూజిక్: వంశీకాంత్ రేఖానా
డీవోపీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: రితికేష్ గోరక్
బ్యానర్: KA ప్రొడక్షన్స్, సుమైరా స్టూడియోస్
రిలీజ్ డేట్: 2026-04-17

తిమ్మరాజుపల్లి గ్రామంలో అల్లరి చిల్లరగా తిరిగే సతీష్‌ (సాయి తేజ్) ఊర్లో జరిగే ఉత్సవాల సందర్భంగా టీవీ, వీసీఆర్ తెచ్చి సినిమాలు ప్రదర్శిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన రాజప్ప (ప్రదీప్ కొట్టే) చెల్లెలు శారద (వేదా జలంధర్), సతీష్ ప్రేమించుకొంటూ ఉంటారు. అయితే ఆ గ్రామంలోనే మొట్టమొదటిసారి రాజప్ప టెలివిజన్ కొనడంతో గ్రామస్థులంతా ఆ ఇంట్లోనే చూస్తుంటారు. ఓ కారణంగా రాజప్ప ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రాజప్ప ఇంట్లో టెలివిజన్ చోరీకి గురి అవుతుంది. దాంతో సతీష్ దొంగతనం చేశాడని నేరం మోపుతారు. 14 రోజుల్లో టెలివిజన్ అప్పగించకపోతే గ్రామ పెద్ద కఠిన శిక్ష వేస్తానని హుకుం జారీ చేస్తాడు.

Thimmarajupalli TV Review

గ్రామ ఉత్సవాల్లో టీవీ, వీసీఆర్‌తో సినిమాలు ప్రదర్శిస్తూ గ్రామస్థులంతా ఎలా ఎంజాయ చేసేవారు? పనిపాట లేకుండా తిరిగే సతీష్‌కు ఊర్లో ఎలాంటి ఇమేజ్ ఉంది? గ్రామంలో రాజప్ప ఫస్ట్ టైమ్ టీవీ కొనడంతో గ్రామస్థుల ఫీలింగ్ ఏమిటి? ఏ విషయంలో రాజప్ప, సతీష్ మధ్య గొడవ జరిగింది? రాజప్ప ఇంటిలో టెలివిజన్ చోరీకి గురైన తర్వాత చోటు చేసుకొన్న సంఘటనలు ఏమిటి? టెలివిజన్ దొంగతనం జరిగిన తర్వాత సతీష్‌ను గ్రామస్థులు ఎలా అవమానించారు? టెలివిజన్ చోరీ వ్యవహారంలో గ్రామస్థులు సతీష్‌కు విధించిన శిక్ష ఏమిటి? టెలివిజన్ దొంగతనం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? సతీష్ తనపై మోపిన దొంగతనాన్ని తప్పు అని ఎలా నిరూపించాడు? శారద, సతీష్ ప్రేమ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే తిమ్మరాజుపల్లి TV సినిమా కథ.

తిమ్మరాజుపల్లి TV సినిమా విషయానికి వస్తే.. కథలో గొప్పతనం ఏమీ కనిపించదు. సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్లు, కాకతీరిన విలన్లు ఉండరు. ట్రెండింగ్‌లో ఉన్న టెక్నిషియన్ల పేర్లు కనిపించవు. గ్రామీణ వాతావరణంలో 90వ దశకంలో అందరికి ఉత్సాహం కలిగించే టెలివిజన్ చుట్టూ అల్లుకొన్న కథలో దాదాపు 60 మంది నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను తెరక్కించారు. ఈ సినిమాకు ముందు తెలిసిన ఒక్క నటుడు కానీ, సాంకేతిక నిపుణుడు కూడా పరిచయం లేకపోయినా.. ఈ సినిమాను అందరూ తమ భుజాల మీద మోశారు. ప్రతీ ఒక్కరు తమ ప్రాణం పెట్టి తమ పాత్రలను పండించారు. దర్శకుడు మునిరాజ్ చాలా నిజాయితీగా కథను రాసుకొని అంతే నిజాయితీగా తెర మీద పాత్రలను సజీవంగా చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడు విజన్‌ను నమ్మి ఈ సినిమాను నిర్మించిన కిరణ్ అబ్బవరం టీమ్‌ను అభినందించాలి. అయితే ఈ సినిమాలో కామెడీకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. ఎమోషన్స్‌ను జొప్పించడానికి కావాల్సినంత అవకాశం ఉంది. లవ్ ట్రాక్‌కు ఇంకా బెటర్ ఛాయిస్ ఉంది. అయితే ఎందుకో ఆ ప్రయత్నం సరిగా చేయలేదనే సంతృప్తి సినిమా చూసినంత సేపు కలుగుతుంది. కానీ ఈ సినిమా పక్కా హనెస్ట్ అటెంప్ట్. తక్కువ బడ్జెట్ మంచి అవుట్‌పుట్ అందించిన సినిమాగా చెప్పుకోవచ్చు.

తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకు సాయి తేజ్, వేదా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్లుగా మారడమే కాకుండా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరామ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశాతం తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో తమ వంతు సహకారాన్ని అందించారు.

ఈ మూవీకి అత్యంత బలంగా మారిన సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి చెప్పుకోవాలి. కథ, సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా వంశీకాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఫ్లైకామ్, డ్రోన్ షాట్స్ బాగున్నాయి. ప్రతీ సన్నివేశాల్లో మట్టి వాసన క్యాప్చర్ చేసిన విధానం సూపర్‌గా అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. సరైన కంటెంట్‌ ఉంటే.. భారీ బడ్జెట్‌తో కాకుండా తక్కువ వ్యయంతో ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించారు. ఈకలు పీకి..లోపాలు వెతకాలనే టార్గెట్‌తో కాకుండా.. ఓ నిజాయితీతో కూడిన అంటెంప్ట్‌ను చూడాలంటే.. తిమ్మరాజుపల్లి టీవీని ఈ వారం మీ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X